newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ముందు జాగ్రత్తలు తీసుకోకపోతే దెబ్బతింటాం.. కరోనాపై కేసీఆర్

20-03-202020-03-2020 07:08:02 IST
Updated On 20-03-2020 07:08:19 ISTUpdated On 20-03-20202020-03-20T01:38:02.824Z20-03-2020 2020-03-20T01:37:59.284Z - 2020-03-20T01:38:19.096Z - 20-03-2020

ముందు జాగ్రత్తలు తీసుకోకపోతే దెబ్బతింటాం.. కరోనాపై కేసీఆర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మానవజాతికి మహమ్మారిగా దాపురించిన కోవిడ్19 వైరస్ నియంత్రణలో ముందు జాగ్రత్తలు తీసుకున్న దేశాలే ఆ వైరస్ బారినుంచి తప్పించుకున్నాయని, ఏ దేశాలైతే ఆ ప్రాణాంతక వైరస్ పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించాయో ఆ దేశాలే ఇప్పుడు ఘోరంగా దెబ్బతింటున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. అందుకే వ్యాధి నిరోధక చర్యలకంటే ముందు వైరస్ వ్యాప్తి పట్ల ప్రభుత్వాలు, ప్రజలూ, వ్యవస్థలూ తీసుకునే ముందు జాగ్రత్త చర్యలే శ్రీరామరక్ష అని కేసీఆర్ హితవు పలికారు. 

గురువారం ప్రగతిభవన్‌లో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో రాష్ట్రంలో కోవిడ్‌ పరిస్థితిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్షించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మన రాష్ట్రంలో ఉన్న వారెవరికీ కోవిడ్‌ సోకలేదని, విదేశాల నుంచి వచ్చిన వారికే సోకిందని, ఈ పరిస్థితుల్లో మన రాష్ట్రం, మన పిల్లల క్షేమం దృష్ట్యా స్వచ్ఛందంగా ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఎవరొచ్చినా సరే వారికి పరీక్షలు నిర్వహించి, హోం క్వారంటైన్‌ చేస్తామని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 5 నుంచి 10 మందికి మించి గుమికూడొద్దని, ఆర్భాటాలు లేకుండా శుభకార్యాలు నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రత్యేకించి విదేశాల నుంచి మార్చి 1 తర్వాత వచ్చిన ఎవరైనా సరే స్వచ్ఛందంగా పరీక్షలు జరిపించుకోవడానికి ముందుకు రావాలని సీఎం పిలుపునిచ్చారు. 

కోవిడ్‌-19 నియంత్రణలో ముందు జాగ్రత్త చర్యలే శ్రీరామరక్ష అని, అందుకే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి  కేసీఆర్‌ చెప్పారు. ఈ వైరస్‌ పుట్టిన చైనా పక్కనే ఉన్న వియత్నాం దేశంలో ఇబ్బందే లేదని పేర్కొన్నారు. వారు మొదటి రోజు నుంచీ కఠిన చర్యలు తీసుకున్నారని గుర్తుచేశారు. అలా కఠిన చర్యలు తీసుకున్న చోట ఇబ్బంది లేదన్నారు. కానీ ఇటలీ, ఇరాన్‌లు బాగా దెబ్బతిన్నాయని, వారు నిర్లక్ష్యంగా ఉన్నందుకే ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. చైనా కూడా మొదట్లో కొంత నిర్లక్ష్యంగా ఉందని, అందుకే మనం ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఏ దేశం నుంచి ప్రయాణికులు వచ్చినా సరే వెంటనే ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు స్వచ్ఛందంగా రిపోర్టు చేయాలని కోరారు. 

‘కోవిడ్‌కు సంబంధించి కరీంనగర్‌లో జరిగిన ఉదంతం దృష్ట్యా ఈ రోజు అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులతో విస్తృతంగా చర్చించాం. ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపై ఆదేశాలిచ్చాం. ఇప్పటివరకు తెలంగాణలో కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన వ్యక్తుల సంఖ్య 14 మాత్రమే. అందులో ఐదుగురు మాత్రమే మన ఎయిర్‌పోర్టులో దిగారు. మిగతా తొమ్మిది మంది రోడ్డు, రైలు మార్గాల్లో రాష్ట్రంలోకి వచ్చారు. ఇతర మార్గాల్లో వస్తున్న వారిని కనిపెట్టడం ఇబ్బందిగా ఉంది. రామగుండానికి అలాగే వచ్చారు. వారందరికీ చికిత్స అందిస్తున్నాం. ఇలా ఇతర మార్గాల్లో వచ్చే వారి విషయంలో ముందు జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బంది పడే అవకాశముందని కేసీఆర్ చెప్పారు.

‘శుక్రవారం నుంచి జిల్లా ఎస్పీలు, కలెక్టర్ల ఆధ్వర్యంలో రాష్ట్రానికి విదేశాల నుంచి ఎవరొచ్చారో గుర్తిస్తారు. విదేశాల నుంచి వచ్చిన వారు వాళ్లంతట వాళ్లే రిపోర్టు చేస్తే మంచిది. వారికి, వారు ఉంటున్న ప్రాంతానికి కూడా మంచిది. నేటి నుంచి పోలీసుల సహకారంతో గ్రామపంచాయతీ, మున్సిపల్‌ సిబ్బందిని వినియోగించి విదేశాల నుంచి ఎవరు వచ్చారో విచారణ చేయిస్తాం. ఈ విషయంలో అన్ని మార్గాలను అన్వేషించాలని ఇంటెలిజెన్స్‌కు కూడా సమాచారమిచ్చాం. జిల్లా కలెక్టర్లు, పోలీసులు కలసి విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించిన తర్వాత కలెక్టర్లు, ఎస్పీలు, డీఎంహెచ్‌వోలతో కమిటీ ఏర్పాటు చేసి వారిని హోం క్వారంటైన్‌ చేస్తాం. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 1,165 మందిని ప్రభుత్వ పర్యవేక్షణలో పెట్టాం. అందులో కొందరు ఇంటికి వెళ్తామంటున్నారు. వారిని పంపిస్తాం. కానీ వారి మీద పర్యవేక్షణ ఉంటుంది’ అని సీఎం వివరించారు. 

‘రాష్ట్రంలో ప్రస్తుతం బస్సులు, ప్రజా రవాణా బంద్‌ చేసేంత ఘోరమైన పరిస్థితి ఏమీ లేదు. సాధారణ ప్రజా జీవనానికి ఇబ్బందులు లేకుండా కూరగాయలు, ఇతరత్రా నిత్యావసరాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులు అమ్ముకోవడంలో ఇబ్బంది ఉండకూడదు. లక్ష టన్నుల కందులు మార్కెట్‌కు వస్తున్నాయి. ఒకవేళ అంతగా ఆందోళనకర పరిస్థితి తలెత్తితే పరిస్థితిని సమీక్షించి నిర్ణయాలు తీసుకుంటాం. ప్రస్తుత పరిస్థితుల్లో ముందు జాగ్రత్త చర్యలే శ్రీరామ రక్ష. స్వీయ నియంత్రణ, స్వీయ క్రమశిక్షణ, స్వీయ పరిశుభ్రత ద్వారానే మనల్ని మనం కాపాడుకోగలం. అవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా చూసుకోవాలి. ఈ విషయంలో మీడియా కూడా ప్రజలకు అవగాహన కల్పించాలి అని కేసీఆర్ సూచించారు.

రాష్ట్రంలో కోవిడ్‌ పాజిటివ్‌ గుర్తించిన వారందరూ కోలుకుంటున్నారు. వారికి వెంటిలేటర్లు పెట్టే అవసరం కూడా రాలేదు. వారిలో ఎవరికీ ప్రాణాపాయం లేదు. చికిత్సకు అవసరమైన మందులన్నీ అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్‌లోని సీసీఎంబీలో 500 నుంచి 600 మందిని స్క్రీనింగ్‌ చేసే సదుపాయం ఉంది. రాష్ట్రంలో ఇప్పటికే 6 స్క్రీనింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశాం. సీసీఎంబీలోని వసతులను ఉపయోగించే అవకాశం ఇవ్వాలని ప్రధానిని కోరతాం’ అని సీఎం కేసీఆర్‌ చెప్పారు.  

మన రాష్ట్రంలో 14 మందికి మాత్రమే వచ్చింది. వాళ్లందరూ బయటి నుంచి వచ్చిన వాళ్లే. మన రాష్ట్రంలో ఒక్క వ్యక్తి కూడా ఇప్పటికైతే ప్రభావానికి గురి కాలేదు. కావొద్దని భగవంతుడిని ప్రార్థిస్తున్నా’అని సీఎం చెప్పారు. ‘కోవిడ్‌ వ్యాప్తి చెందకుండా గతంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం వారం రోజులు మూసేయాలని ప్రకటించిన వాటిపై ఆంక్షలు కొనసాగుతాయి. సినిమా, ఫంక్షన్‌ హాళ్లు, క్లబ్బులు, పార్కులు ఈ నెల 31 వరకు మూసేస్తాం. గతంలో మార్చి 31 వరకు మూసివేత ప్రకటించిన సంస్థలపై ఆంక్షలు అలాగే ఉంటాయి. బహిరంగ సభలు, సమావేశాలు, సెమినార్లు ఎట్టి పరిస్థితుల్లో అనుమతించం. దేవాలయాలు, మసీదులు, చర్చిలు, గురుద్వారాలు, ఇతర ప్రార్థనా మందిరాల్లోకి భక్తులను అనుమతించొద్దు. ఇప్పటికే ఈ విషయంలో ఇస్లాం మతపెద్దలు ఇందుకు అంగీకరించారు. బిషప్‌లు, పాస్టర్లు, పూజారులు, గురుద్వారాలకు కూడా చెబుతున్నాం. ఈ వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే, చాలామంది గుమికూడకుండా ఉండటమే మార్గం. అన్ని మతాల వారూ దీన్ని పాటిస్తే మంచిదని కేసీఆర్ సూచించారు.

ప్రపంచవ్యాప్తంగా షట్‌డౌన్‌ అంటున్నారు తప్ప 144 సెక్షన్‌ అని మాట్లాడట్లేదు. దేవాలయాలు, మసీదులు, చర్చిలే మూసేసినప్పుడు మిగిలిన వాటికి భేషజాలు అవసరం లేదు. మాకు ఏమైతది అనే నిర్లక్ష్యం పనికిరాదు. గతంలో అనుమతిచ్చాం కాబట్టి 31 వరకు పెళ్లిళ్లు కొనసాగుతాయి. రాష్ట్రవ్యాప్తంగా మ్యారేజ్‌ హాల్స్‌ మూసేయాల్సిందే. షాదీఖానాలు కూడా బంద్‌ చేయాలని మత పెద్దలు కోరారు. పెళ్లిళ్లు జరిగినా 200 మందికి మించకుండా రాత్రి 9 గంటల లోపే ముగించుకోవాలి. మన రాష్ట్రాన్ని, మన పిల్లలను కాపాడుకునేందుకు వ్యక్తిగత, గ్రామ పారిశుధ్యం పాటించాలి. ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధంగా ఉంది. ఎటువంటి పరిస్థితైనా ఎదుర్కొనేందుకు రెడీగా ఉన్నాం’అని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

   10 hours ago


లొంగిపోయిన కూన రవికుమార్

లొంగిపోయిన కూన రవికుమార్

   6 hours ago


రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

   9 hours ago


షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

   11 hours ago


తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

   13 hours ago


ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

   15 hours ago


బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

   16 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

   18 hours ago


భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

   18 hours ago


ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

   19 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle