newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ముందుజాగ్రత్త.. అప్పుచేసి రాష్ట్ర ఖజానాను నింపిన కేసీఆర్!

23-04-202023-04-2020 12:13:53 IST
Updated On 23-04-2020 12:20:38 ISTUpdated On 23-04-20202020-04-23T06:43:53.023Z23-04-2020 2020-04-23T06:43:51.321Z - 2020-04-23T06:50:38.436Z - 23-04-2020

ముందుజాగ్రత్త.. అప్పుచేసి రాష్ట్ర ఖజానాను నింపిన కేసీఆర్!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా మహమ్మారి రాష్ట్రాన్ని కమ్మేసిన వేళ సీఎం కేసీఆర్ ముందు జాగ్రత్తగా పలు నిర్ణయాలను తీసుకుంటున్నారు. ముందుగా రాష్ట్రంలో పండే ఆహార పంటలను రైతుల నుండి ప్రభుత్వమే కొని పెట్టుకుంటుంది. ఇక లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్రానికి వచ్చే ఆదాయం లేకపోవడంతో అప్పు చేసి.. రాష్ట్ర బాండ్లను తాకట్టుపెట్టి మరీ మొత్తం ఐదువేల కోట్లను రాష్ట్ర ఖజానాకు జమ చేసిపెట్టారు.  

ప్రస్తుతం ఒక రాష్ట్రం, దేశం అన్నది లేకుండా కరోనా ప్రపంచమంతా ఆర్ధిక మూలాల మీద కోలుకోలేని దెబ్బకొట్టింది. దీని ప్రభావం ఎంతన్నది కూడా ఇప్పట్లోనే తేల్చే అవకాశం లేదు. ముందు మహమ్మారి వదలిపోతే తీరిగ్గా లెక్కలు జమలు చూసుకోవచ్చని.. ముందు ప్రజల ప్రాణాలే ముఖ్యమని అందరూ కోరుకుంటున్నారు. కాగా.. సుమారుగా ప్రపంచవ్యాప్తంగా దీని ప్రభావం కరోనా అనంతరం ఆరునెలలు నుండి ఏడాది వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

అంటే ప్రతి దేశం, రాష్ట్రం వచ్చే ఏడాది కరోనా మిగిలించిన కష్టాలను అనుభవించాల్సిందే. ఇక ఇప్పుడు లాక్ డౌన్ అమలు.. కరోనా సమాజాన్ని వదిలి ఎప్పటికి పోతుందో ఎవరూ సరిగా అంచనా వేయలేని పరిస్థితి. దీంతో తెలంగాణ ప్రభుత్వం ముందస్తు చర్యలను మొదలుపెట్టింది. ప్రస్తుతం వచ్చే ఆహారపు పంటలను మార్కెట్ కు వెళ్లకుండా ప్రభుత్వమే స్టాక్ పెట్టుకుంటుంది

అందుకోసం రైతులకు బ్యాంకు ఖాతాలకు ప్రభుత్వమే డబ్బు జమ చేయనుంది. ఇక ఇప్పటికిప్పుడు ప్రభుత్వానికి ఆదాయం లేదు కనుక అప్పుచేసి కొంత నగదును ఖజానాకు జమ చేసి పెట్టింది. ఈ ఏడాది మొత్తం దాదాపు 15000 వేల కోట్లను బాండ్ల వేలం ద్వారా సేకరించుకొనే అవకాశం ఉండడంతో ఈనెలలో బాండ్ల ద్వారా రెండువేల కోట్లను సేకరించింది.

ఈ నెల 13న రూ.2వేల కోట్లు అప్పు చేసిన తెలంగాణ ప్రభుత్వం బాండ్ల అమ్మకం ద్వారా తాజాగా రూ.2 వేల కోట్లు సేకరించింది. ఆర్బీఐ నిర్వహించిన బిడ్‌‌‌లో రాష్ట్ర సర్కారు ఈ రుణం తీసుకుంది. ఇందులో వెయ్యి కోట్లను ఆరేళ్లలో, మరో వెయ్యి కోట్లను ఎనిమిదేళ్లలో చెల్లించనుంది. ఇక పన్నుల్లో వాటా కింద రాష్ట్రానికి రావాల్సిన రూ.982 కోట్లను తాజాగా కేంద్రం రిలీజ్‌‌ చేసింది.

దీంతో మొత్తం సుమారుగా ఐదు వేలకోట్లు రాష్ట్ర ఖజానాకు జమయ్యాయి. వీటిని కేసీఆర్ ప్రభుత్వం కరోనా కట్టడి చర్యలు, అత్యవసర సేవలకు, కరోనాకు ఆర్ధిక సాయం, నిత్యావసర సరుకుల పంపిణీకి వినియోగించనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం నిధులను ఆచితూచి ఖర్చుపెడుతుంది. కరోనా నేపథ్యంలో పరిస్థితులపై ముందు జాగ్రత్తగా ఉంటుంది.

పక్కన మరో తెలుగు రాష్ట్రం ఏపీలో కేంద్రం నుండి వచ్చిన పన్నుల్లో వాటాను అక్కడ ప్రభుత్వం రేపు సోమవారమే పంపకాలు మొదలుపెట్టింది. డ్వాక్రా మహిళలకు ఇచ్చిన హామీల కోసం.. ఫీజ్ రియంబర్స్ మెంట్ చెల్లింపుల కోసం ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించింది. కానీ తెలంగాణలో మాత్రం ముందు కరోనా మీదనే ప్రభుత్వం ద్రుష్టి పెట్టింది. నెలవారీ చెల్లించే పథకాల చెల్లింపులు మినహా ఆడంబరాలకు పోకుండా ముందుచూపుతో వెళ్తుంది.

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

   4 hours ago


తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

   5 hours ago


అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

   an hour ago


“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

   8 hours ago


ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

   8 hours ago


వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

   17 minutes ago


ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

   2 hours ago


తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

   8 hours ago


ఇక కేటీఆర్ టైం వ‌చ్చిన‌ట్లేనా

ఇక కేటీఆర్ టైం వ‌చ్చిన‌ట్లేనా

   9 hours ago


బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమం

బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమం

   18-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle