newssting
Radio
BITING NEWS :
బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి దశలో 55.69 శాతం పోలింగ్‌ నమోదైనట్టు తెలిపిన ఎన్నికల కమిషన్‌. కరోనా వైరస్‌ భయాలు ఉన్నప్పటికీ పోలింగ్‌ మాత్రం ఇంతకు ముందుకన్నా ఎక్కువే నమోదైనట్టు తెలుస్తోంది. తొలి దశలో 16 జిల్లాల్లో విస్తరించిన 71 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగగా సంబంధిత నియోజకవర్గాల్లో గతంలోకంటే ఈసారి పోలింగ్ శాతం అధికంగా నమోదు * తమ పార్టీ తరఫున బరిలో నిలిచిన రాంజీ గౌతమ్‌ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న ఏడుగురు ఎమ్మెల్యేలను బీఎస్పీ అధినేత్రి మాయావతి గురువారం పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. కీలకమైన రాజ్యసభ ఎన్నికల సమయంలో ఎస్పీ తీర్థం పుచ్చుకోవడానికి వీరు ప్రయత్నిస్తున్నట్టు తెలియగానే ఆమె ఈ నిర్ణయం తీసుకొన్నారు * కార్మిక నాయకుడు, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ముఖ్య సహచరుడు ఎస్‌.బీ మోహన్‌రెడ్డి(78) గురువారం తెల్లవారుజామున మరణించారు. ఆరునెలల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న మోహన్‌ రెడ్డి ఆరోగ్యం విషమించగా ఆంధ్రమహిళా సభ దవాఖానలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందారు * జమ్ముకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలోని వైకే పొరా ప్రాంతంలో గురువారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులు జరిపి ముగ్గురు స్థానిక బీజేపీ నేతల ప్రాణాలు తీశారు. పాకిస్థాన్‌ ఇంటెలిజన్స్‌ ఏజెన్సీ మద్దతున్న రెసిస్టంట్‌ ఫ్రంట్‌ ఉగ్రవాద సంస్థ ఈ దాడికి బాధ్యతవహిస్తూ ప్రకటన చేసిందని పోలీసులు చెప్పారు * తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గోకవరం మండలం తంటికొండ వెంకటేశ్వర ఆలయం ఘాట్‌ రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున పెళ్లి బృందానికి చెందిన మినీ వ్యాన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు * డోసుల కొరత కారణంగా.. స్పుత్నిక్‌-వి టీకా మూడో దశ ట్రయల్స్‌ను రష్యా తాత్కాలికంగా నిలిపివేసింది. నవంబరు 10వ తేదీ నుంచి ట్రయల్స్‌ను పునరుద్ధరించనున్నారు. గమలేయా రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, రష్యన్‌ రక్షణ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌-వి టీకాను రష్యా ఆగస్టు నెలలో నమోదు చేసింది * మద్యం ధరలను క్రమబద్ధీకరిస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం ఆదేశాలు జారీ చేసింది. సవరించిన ధరలు ప్రీమియం, మీడియం బ్రాండ్లకు వర్తించేలా ఉత్తర్వులిచ్చింది. ఇవి శుక్రవారం నుంచి అమల్లోకి వస్తాయని ఆదేశాల్లో పేర్కొంది * మిలాద్‌ ఉన్‌ నబీ ఉత్సవాలు, ర్యాలీ సందర్భంగా పాతబస్తీలో పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు. ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.

మీ సేవలు ప్రజలకు అందకపోతే మీ చదువుతో ఏం లాభం.. వైద్యులకు ఈటెల ప్రశ్న

22-09-202022-09-2020 08:09:48 IST
2020-09-22T02:39:48.378Z22-09-2020 2020-09-22T02:39:30.872Z - - 30-10-2020

 మీ సేవలు ప్రజలకు అందకపోతే మీ చదువుతో ఏం లాభం.. వైద్యులకు ఈటెల ప్రశ్న
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నాలుగైదేళ్లు వైద్యవిద్య చదివి గుర్తింపుపొందిన డాక్టర్లయ్యాక మీ సేవలు ప్రజలకు అందకపోతే అంత కష్టపడి చదువుకుని ఏం లాభమని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రశ్నించారు. అందుకే వైద్య ఆరోగ్య శాఖ సంస్కరణలకు సిద్ధం కావాలని, కాలానుగుణంగా మార్పులు చేయకపోతే కాలగర్భంలో కలిసిపోతామని ఈటల వ్యాఖ్యానించారు. ప్రభుత్వ యంత్రాంగంలో పని చేస్తున్న డాక్టర్, నర్సు, పారామెడికల్ సిబ్బంది డ్యూటీ ఓరియంటెడ్‌గా, పీపుల్ ఓరియంటెడ్‌గా, కమిట్‌మెంట్‌తో పని చేయాలన్నారు. 

సోమవారం జరిగిన వైద్య ఆరోగ్యశాఖ సమీక్షా సమావేశంలో వైద్య మంత్రి  మాట్లాడుతూ.. నూతన వైద్య విధానాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు శిక్షణ ఇవ్వాలని. ఫ్లోరైడ్, మలేరియా, బోదకాలు, లాంటి జబ్బులు ఏ ప్రాంతాల్లో ఎక్కువగా వస్తున్నాయో 'డిసీజ్ మాపింగ్' చేయాలని. దానికి అనుగుణంగా ఆయా ఆసుపత్రుల్లో డాక్టర్స్, మందులు ఉండేలా చూడాలని పేర్కొన్నారు. మందులు - ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల నుంచి టర్శరే కేర్ ఆసుపత్రుల వరకు.. అన్ని చోట్లా అందుబాటులో ఉన్న మందులు ఎన్ని.. అవి ఎప్పుడు ఎక్స్పైర్ అవుతాయి అనే వివరాలు కంప్యూటరీకరణ చెయ్యాలన్నారు. 

ప్రతి మందుకు లెక్క ఉండాలనీ,. పీహెచ్‌సీలో అనవసర మందులు ఉంచవద్దనీ, దీని కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్ తయారు చేయాలనీ మంత్రి చెప్పారు. వైద్య చరిత్రలో మొదటి సారి గడువు ముగిసిన మందులను కంపెనీలకు తిప్పి పంపించి డబ్బులు వెనక్కి తీసుకున్నామనీ, అదే సమయంలో ప్రపంచంలో ఉన్న మంచి వైద్య విధానాలను తెలుసుకొని మన దగ్గర అమలు చేయాలని ఈటల సూచించారు. 

దేశంలో, ప్రపంచంలో మంచి హెల్త్ కేర్ సిస్టమ్‌లు ఏమున్నాయి, వాటిని మన దగ్గర అమలు చేయడానికి ఉన్న ప్రతిబంధకాలు ఏంటి, వాటిని ఏవిధంగా అధిగమించాలి అనే సమగ్ర కార్యాచరణ రూపొందించాలని మంత్రి పేర్కన్నారు.. మన నెట్ వర్క్ ప్రైవేట్ హాస్పిటల్స్ కంటే పెద్దది. కాబట్టి రెఫరల్ సిస్టమ్‌ను మొదలు పెట్టండి. ఆశా వర్కర్స్ పేషంట్లను పెద్దాసుపత్రులకు పంపించే విధానం అమలు కావాలని సూచించారిు.

ప్రతి ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో, ఆసుపత్రిలో ఏం జరుగుతుందో హైదరాబాద్‌లో కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఉండి చూడగలిగే విధంగా చేయాలి. చిన్న చిన్న పథకాలు పెద్ద మార్పు తీసుకు వస్తాయి. కేసీఆర్‌ కిట్ పథకం వల్ల 50 శాతం డెలివరీలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరుగుతున్నాయి. ఆరోగ్యవంతమైన సమాజం లేకుండా ప్రపంచంతో పోటీ పడలేము. చిన్న చిన్న మార్పులు, చేర్పులతో ఒక సంవత్సర కాలంలో వైద్య ఆరోగ్య శాఖలో గొప్ప మార్పులు వస్తాయని ఆశిస్తున్నా అని వైద్య మంత్రి ఈటల అన్నారు.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle