newssting
BITING NEWS :
*ఢిల్లీ వెళ్లనున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌..రాష్ట్రపతి భవన్‌ లో విందుకు హాజరుకానున్న సీఎం కేసీఆర్‌ *రెండవ రోజు భారత్‌లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పర్యటన *దేవరకొండలో మంత్రి కేటీఆర్‌ పర్యటన. పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొని సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేయనున్న కేటీఆర్‌ *తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎన్‌ ఎన్నికల్లో నేడు నామినేషన్ల స్వీకరణ * కుప్పంలో రెండోరోజు పర్యటించనున్న చంద్రబాబు* ఏపీ స్థానికల రిజర్వేషన్లపై తీర్పు వెల్లడించనున్న ఏపీ హైకోర్టు ఫాలో అప్ *వివేకా హత్యకేసుపై తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు *ఇవాళ హైదరాబాద్ హౌస్ లో మోదీతో ట్రంప్ ద్వైపాక్షిక చర్చలు *ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్‌ గా రామ్‌ నివాస్‌ గోయల్ ఏకగ్రీవ ఎన్నిక*అమరావతి: 70వ రోజుకు చేరిన అమరావతి రైతుల ఆందోళనలు, మందడం, వెలగపూడి, తుళ్లూరులో రైతుల ధర్నాలు*వికారాబాద్: కొడంగల్ సమీపంలో రోడ్డు ప్రమాదం. బీజాపూర్ - హైదరాబాద్ హైవేపై కారును ఢీకొట్టిన లారీ. భార్యాభర్తలకు తీవ్రగాయాలు. హాస్పిటల్ కు తరలింపు*భారతీయ సినిమాలు గ్రేట్.. దిల్‌వాలే దుల్హనియా, షోలే చిత్రాలు గొప్పవి-డొనాల్డ్ ట్రంప్

మీరే మాకు దిక్కు..గవర్నర్ తో ఆర్టీసీ జేఏసీ వేడుకోలు

22-10-201922-10-2019 08:40:40 IST
Updated On 22-10-2019 16:43:43 ISTUpdated On 22-10-20192019-10-22T03:10:40.772Z22-10-2019 2019-10-22T03:10:06.234Z - 2019-10-22T11:13:43.397Z - 22-10-2019

మీరే మాకు దిక్కు..గవర్నర్ తో ఆర్టీసీ జేఏసీ వేడుకోలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తున్న ఆర్టీసీ సమ్మె రోజురోజుకి ఉధృతం అవుతోంది. సమ్మె 18వ రోజు కొనసాగుతోంది. ప్రభుత్వం మెట్టు దిగిరాకపోవడంతో.. ఆర్టీసీ జేఏసీ నేతలు సోమవారం సాయంత్రం గవర్నర్‌ తమిళిసై‌ను కలిశారు. ఆర్టీసీ సమ్మె విషయంలో జోక్యం చేసుకోవాలని గవర్నర్‌కు అశ్వత్థామరెడ్డి విజ్ఞప్తి  చేశారు. ఈ నేపథ్యంలో గవర్నర్ తమిళిసైతో రెండోసారి ఆర్టీసీ నేతలు భేటీ కావడం ఆసక్తిగా మారింది. కోర్టు ఆదేశాలు, ప్రభుత్వ వైఖరి అంశాలపై ఆర్టీసీ నేతలు గవర్నరుతో చర్చించినట్టు సమాచారం.

గవర్నర్ తో  భేటీ ముగిసిన అనంతరం మాట్లాడిన జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామరెడ్డి గవర్నర్ తమకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని.. కార్మికులు భయపడవొద్దని కోరారన్నారు. బోర్డ్ అనుమతి లేకుండా సమ్మెలో ఉన్నప్పుడు మళ్ళీ కొత్తగా అద్దె బస్సులకు టెండర్లకు పిలిచారని గవర్నరుకు వివరించారు జేఏసీ నేతలు.

కోర్టు ఆర్డర్ కాపీ అందలేదని ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు. ఎమ్మెల్యేలు ఆర్టీసీ కార్మికులను ప్రలోభ పెడుతున్నారని చెప్పారు. జేఏసీ కార్యాచరణ విజయవంతమైందని,  తమకు  అందరి మద్దతు లభిస్తోందన్నారు. మంగళవారం జూబ్లీ బస్టాండ్ లో వంటావార్పు నిర్వహిస్తున్నామన్నారు. 

ఆర్టీసీ ఆస్తులపై కొందరి కన్ను పడిందని.. ఆర్టీసీ ఆస్తులు కార్మికుల ఆస్తులని చెప్పారు.  ఆర్టీసీనిప్రైవేట్ పరం చేసేందుకు కుట్ర జరుగుతోందన్నారు. ఆర్టీసీని లాకౌట్ చేస్తామంటే భయపడే ప్రస్తకే లేదన్నారు. ఆర్టీసీని లాకౌట్ చెయ్యడానికి ఎవరికీ  అధికారం లేదన్నారు ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్ రాజిరెడ్డి.  సమ్మె పరిష్కరించకుండా సీఎం  కేసీఆర్ జాప్యం చేస్తున్నారని విమర్శించారు.  గవర్నర్ ఆర్టీసీ కార్మికులకు అండగా ఉన్నారని చెప్పారు.

ఆర్టీసీ కార్మికులకు దేశ వ్యాప్తంగా అందరి సహకారం ఉందన్నారు.గవర్నర్ ని కలిసిన నేతల్లో  కో కన్వీనర్ వీఎస్ రావు , మహిళా నేత సుధ వున్నారు. ఈసారైనా గవర్నర్ జోక్యం చేసుకుంటారని ఆర్టీసీ కార్మికులు ఆశాభావంతో ఉన్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle