newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మీరు సాధించారు.. కేసీఆర్‌, జగన్ కు ఉపరాష్ట్రపతి అభినందనలు..

06-09-202006-09-2020 11:09:12 IST
2020-09-06T05:39:12.102Z06-09-2020 2020-09-06T05:39:07.790Z - - 23-04-2021

మీరు సాధించారు.. కేసీఆర్‌, జగన్ కు ఉపరాష్ట్రపతి అభినందనలు..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

భారత ప్రభుత్వం ప్రకటించిన సులభతర వాణిజ్య రాష్ట్రాల జాబితాలో మొదటి, మూడవ స్థానాల్లో నిలిచిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు తెలిపారు. ఉభయ తెలుగు రాష్ట్రాలు ముందువరసలో చోటు దక్కించుకోవడం ఆనందదాయకమన్నారు. ఈ సందర్బంగా ఆయన శనివారం ట్వీట్ చేస్తూ  తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు అభినందనలు తెలిపారు.

దేశీయ, ప్రపంచ స్థాయి పెట్టుబడిదారుల్ని ఆకర్షించేందుకు కేంద్రప్రభుత్వం ప్రతి సంవత్సరం ఈజ్ ఆఫ్ డూయింగ్  ర్యాంకింగులను ప్రకటిస్తోంది. 2019 ర్యాంకింగ్స్‌లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు మొదటి, మూడు స్థానాలకు దక్కించుకున్నాయి. ఈజ్ ఆప్ డూయింగ్ బిజినెస్‌ (సులభతర వ్యాపార నిర్వహణ) -2020 ర్యాంకులను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంట్లో ఏపీ బర్‌వన్‌ స్థానంలో నిలిచింది. 

బిజినెస్‌ రిఫార్మ్‌ యాక్షన్‌ ప్లాన్‌ ఓవరాల్‌ ర్యాంకింగ్‌లోనూ జాతీయ స్థాయిలో ఏపీ మొదటిస్థానంలో నిలిచింది. రెండోస్థానంలో ఉత్తర ప్రదేశ్‌, మూడోస్థానంలో తెలంగాణ రాష్ట్రాలు నిలిచాయి.

ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌లో ఏపీ మూడేళ్లుగా నెంబర్‌ వన్‌.. ఎలా?

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అభివృద్ధిలో దూసుకుపోతోంది. ఓవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే మరోవైపు పరిశ్రమల స్థాపనకు పెద్దపీట వేస్తోంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌ సర్కార్‌ ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. కీలకమైన ఈజ్ ఆప్ డూయింగ్ బిజినెస్‌లో (సులభతర వ్యాపార నిర్వహణ) నెంబర్‌వన్‌ స్థానంలో నిలిచింది. బిజినెస్‌ రిఫార్మ్‌ యాక్షన్‌ ప్లాన్‌ ఓవరాల్‌ ర్యాంకింగ్‌లోనూ జాతీయ స్థాయిలో మొదటిస్థానంలో నిలిచింది. 

కరోనా సంక్షోభంలోనూ ప్రభుత్వ పనితీరుకు ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ రేటింగ్‌ అద్దం పడుతోంది. ఇక ఏపీ మొదటి స్థానంలో నిలువగా రెండోస్థానంలో ఉత్తర ప్రదేశ్‌, మూడోస్థానంలో తెలంగాణ రాష్ట్రాలు నిలిచాయి. ఈ మేరకు 2020 ఏడాదికిగాను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ శనివారం ర్యాంకులు విడుదల చేశారు. పెరిగిన పారదర్శకత, మెరుగైన పనితీరుకు.. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ ర్యాంకింగ్‌లు అద్దం పట్టాయని ఈ సందర్భంగా ఆమె అభిప్రాయపడ్డారు. తొలిమూడు స్థానంలో నిలిచిన రాష్ట్రాలకు నిర్మల అభినందనలు తెలిపారు. 

గత సర్వే ల కంటే భిన్నంగా ఈ సారి సర్వే నిర్వహించారు. తొలిసారి పారిశ్రామిక వేత్తలు, వినియోగదారుల సర్వే చేయగా.. ఇదే అసలైన ర్యాంకింగ్ ప్రక్రియగా పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. గతంలో ప్రభుత్వాలు ఇచ్చిన నివేదికల ఆధారంగా ర్యాంకింగ్ ప్రకటించేవారు. ఈసారి పారిశ్రామిక వేత్తలు సర్వే నిర్వహించగా.. ఏపీలో 187 సంస్కరణలు అమలు చేసినట్లు గుర్తించారు. అన్నింటినీ అమలు చేసినందున నూటికి నూరు శాతం మార్కులు పొందటంతో ఆంధ్రప్రదేశ్ మొదటిస్థానంలో నిలిచింది.

 

కోవిడ్  వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

   2 hours ago


మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

   4 hours ago


ఆదుకుంటున్న ఆంధ్రప్రదేశ్.. ప్రశంసలు

ఆదుకుంటున్న ఆంధ్రప్రదేశ్.. ప్రశంసలు

   4 minutes ago


గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

   3 hours ago


ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

   5 hours ago


క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

   5 hours ago


క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

   6 hours ago


 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   a day ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   22-04-2021


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   22-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle