newssting
BITING NEWS :
*ప్రధాని నరేంద్రమోడీతో హోంమంత్రి అమిత్ షా భేటీ.. లాక్ డౌన్ పై చర్చ *మాజీ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ తొలగింపు వ్యవహరంలో తుది తీర్పు .. వెంటనే విధులోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశం *కొండపోచమ్మ జలాశయం ప్రారంభం. సీఎం కేసీఆర్ దంపతుల చేతుల మీదుగా ప్రారంభం.. ఇదో ఉజ్వల ఘట్టం అన్నకేసీయార్ *కరోన ఇప్పుడే పోయేది కాదు..సౌదీ అరేబియా నుండి వందలాది మంది వస్తున్నారు..కరోన అపగలిగే శక్తి ప్రభుత్వాలకు లేదు..ప్రజలు దీన్ని తేలికగా తీసుకోవద్దు..ఎవరికివారే జాగ్రత్తగా ఉండాలి : ఈటల *ఏపీ ప్రభుత్వానికి ఇప్పటికే 50కి పైగా కేసులలో చుక్కెదురైనా పద్ధతి మార్చుకోవడం లేదు..రమేష్ ని మళ్ళీ ఎన్నికల కమిషనర్ గా నియమిస్తూ హైకోర్టు తీసుకున్న నిర్ణయం స్వాగతిస్తున్నాం : సీఎం రమేష్ - ఎంపీ *ఏపీలో కొత్తగా 85 మందికి కరోనా పాజిటివ్‌, ఒకరు మృతి.3330 కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య.కరోనాతో 60 మంది మృతి * చోటా కె.నాయుడు సోదరుడు అరెస్ట్..ఎస్.ఆర్.నగర్‌లో శ్యామ్ కె. నాయుడిని అరెస్టు చేసిన పోలీసులు..ఆర్టిస్ట్ సుధను పెళ్లిపేరుతో మోసం చేశాడని ఆరోపణ..సుధ ఆరోపణలపై కేసు నమోదు చేసిన పోలీసులు*భారత్ లో విజృంభిస్తున్న కరోనా. గడిచిన 24 గంటల్లో 7466 కొత్త కరోనా కేసులు. 175 మంది మృతి. దేశవ్యాప్తంగా 1,65,799 కి చేరిన కరోనా కేసులు. 89,987 యాక్టివ్ కేసులుండగా, 71,106 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. భారత్ లో మొత్తం 4,706 కరోనా మరణాలు

మీరు వాడొద్దు.. మీరు వాడండి.. ఏపీ, తెలంగాణలకు కృష్ణా బోర్డు ఆదేశం

20-05-202020-05-2020 08:05:16 IST
Updated On 20-05-2020 08:56:31 ISTUpdated On 20-05-20202020-05-20T02:35:16.129Z20-05-2020 2020-05-20T02:35:14.520Z - 2020-05-20T03:26:31.023Z - 20-05-2020

మీరు వాడొద్దు.. మీరు వాడండి.. ఏపీ, తెలంగాణలకు కృష్ణా బోర్డు ఆదేశం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కృష్ణా జలాల్లో తన వాటా నీటిని ఆంధ్రప్రదేశ్‌ పూర్తిగా వాడుకుందని కృష్ణా నదీ యాజమాన్య సంస్థ (కేఆర్‌ఎంబీ) తెలిపింది. కోటా పూర్తయినందున నీటి వాడకం నిలిపివేయాలని ఆదేశించింది. కృష్ణా బేసిన్‌లో ప్రస్తుతం మిగిలి ఉన్న 60 టీఎంసీలూ తెలంగాణ రాష్ట్రానికే చెందుతుందని తెలిపింది. ఈ మేరకు బోర్డు సభ్య కార్యదర్శి పరమేశం మంగళవారం లేఖ రాశారు. మరో పది రోజుల్లో ఈ ఏడాదికి సంబంధించిన నీటి సంవత్సరం ముగియనుంది. జూన్‌ మొదటి వారం నుంచి కొత్త నీటి సంవత్సరం మొదలవుతుంది. సాగర్‌ కుడి కాల్వ, ముచ్చుమర్రి, హంద్రీ–నీవా కింద వినియోగం ఆపాలని ఏపీని కృష్ణా బోర్డు ఆదేశించింది.

ఈ నేపథ్యంలో ముగుస్తున్న నీటి సంవత్సరంలో మంగళవారం నాటికి ఇరు రాష్ట్రాలు ఉపయోగించుకున్న కృష్ణా నీటి గణాంకాలను పరమేశం విడుదల చేశారు. కృష్ణా నదిలో ఉమ్మడి రాష్ట్రానికి 811 టీఎంసీల నికర జలాల కోటా ఉంది. ఈ ఏడాది వరదల కారణంగా 920 టీఎంసీల నీరు అందుబాటులోకి వచ్చింది. 66:34 నిష్పత్తి ప్రకారం ఏపీకి 647 టీఎంసీలు, తెలంగాణకు 333 టీఎంసీలు పంచారు. అయితే ఆంధ్ర తన వాటా నీటిని ఇప్పటికే వాడేసింది. కృష్ణా డెల్టా కోసం 152 టీఎంసీలు, పోతిరెడ్డిపాడు ద్వారా 169 టీఎంసీలు, నాగార్జున సాగర్‌ కుడి, ఎడమ కాల్వల ద్వారా 195 టీఎంసీలు,తుంగభద్ర పరిధిలో 50 టీఎంసీలు, హంద్రీ-నీవా ద్వారా 41 టీఎంసీలు వాడేయడంతో కోటా పూర్తయిందని పరమేశం తెలిపారు.

కృష్ణా నదీ జలాల వినియోగంలో తెలుగు రాష్ట్రాలు ఈ ఏడాది వాటర్‌ ఇయర్‌లో రికార్డు సృష్టించాయి. ఈ ఏడాది రెండు రాష్ట్రాలు కలిపి 920.405 టీఎంసీలు వినియోగించుకున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ 647.559 టీఎంసీలు వినియోగించుకోగా, తెలంగాణ 272.846 టీఎంసీలు ఉపయోగించుకుంది. నీటి వినియోగంలో ఆంధ్రప్రదేశ్‌ వాటా పూర్తి కాగా, తెలంగాణ వాటాలో ఇంకా 60.605 టీఎంసీలు వినియోగించుకునే అవకాశం ఉంది. 

ఏపీ వాటా పూర్తయిన నేపథ్యంలో సాగర్‌ కుడి కాల్వ, ముచ్చుమర్రి, హంద్రీనీవా కింద నీటి వినియోగం ఆపాలని ఏపీకి సూచించింది. ఈ మేరకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు మంగళవారం ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకు లేఖ రాసింది. వాటర్‌ ఇయర్‌ మే 31తో ముగుస్తుండటంతో రెండు రాష్ట్రాలకు చేసిన నీటి కేటాయింపులు, వినియోగం, నీటి లభ్యత లెక్కలను కృష్ణా బోర్డు తేల్చింది.

ప్రస్తుత వాటర్‌ ఇయర్‌లో తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా నది పరీవాహక ప్రాంతంలో రిజర్వాయర్లలో 980.738 టీఎంసీల నీటి లభ్యత ఉన్నట్లు కృష్ణా బోర్డు లెక్క కట్టింది. ఇందులో ఏపీ వాటా (66 శాతం) 647.287 టీఎంసీలు, తెలంగాణ వాటా (34 శాతం) 333.451 టీఎంసీలు. ఏపీ ఇప్పటికే 647.559 టీఎంసీలు వినియోగించుకుందని, వాటా కంటే 0.272 టీఎంసీలు అదనంగా వాడుకున్నట్లు కృష్ణా బోర్డు లెక్క కట్టింది. తెలంగాణ తన వాటా కంటే 60.605 టీఎంసీలు తక్కువగా 272.846 టీఎంసీలు వినియోగించు కున్నట్లు బోర్డు తేల్చింది. అంటే తెలంగాణ వాటాలో ఇంకా 60.605 టీఎంసీల మిగులు ఉంది. 

శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా 169.668 టీఎంసీలు, హంద్రీనీవా ద్వారా 41.918, ముచ్చుమర్రి ఎత్తిపోతల ద్వారా 5.410, చెన్నైకి తాగునీటి సరఫరా రూపంలో 3.333 వెరసి ఆంధ్రప్రదేశ్‌ 220.329 టీఎంసీలు వినియోగించుకుంది. 

కాగా, శ్రీశైలం జలాశయం నుంచి కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 49.677 టీఎంసీలు, చెన్నైకి తాగునీటి సరఫరా రూపంలో 1.667 వెరసి 51.344 టీఎంసీలు తెలంగాణ వినియోగించుకుంది. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నుంచి ఎడమ కాల్వ ద్వారా 35.287 టీఎంసీలు, కుడి కాల్వ ద్వారా 158.264 టీఎంసీలు, కృష్ణా డెల్టాకు 152.360, గుంటూరు చానల్‌కు 3.150 వెరసి 349.061 టీఎంసీలను ఆంధ్రప్రదేశ్‌ వినియోగించుకుంది. 

తుంగభద్ర ప్రాజెక్టు నుంచి హెచ్‌ఎల్సీ ద్వారా 30.192, ఎల్‌ఎల్‌ఎల్సీ ద్వారా 20.215, కేసీ కెనాల్‌ ద్వారా 27.762 వెరసి 78.169 టీఎంసీలను ఆంధ్రప్రదేశ్‌ వినియో గించుకుంది. ఆర్డీఎస్‌ ద్వారా తుంగభద్ర ప్రాజెక్టు నుంచి 5.93 టీఎంసీలు తెలంగాణ వాడుకుంది.

నాగార్జునసాగర్‌ నుంచి హైదరాబాద్‌ తాగునీటి సరఫరా, ఏఎమ్మార్పీ ద్వారా 57.799, ఎడమ కాల్వ ద్వారా 91.007 వెరసి 148.806 టీఎంసీలను తెలంగాణ ఉపయోగించుకుంది. మూసీ, పాకాల చెరువు, వైరా తదితర మధ్య తరహా ప్రాజెక్టుల ద్వారా 9.483 టీఎంసీలను తెలంగాణ వినియోగించుకుంది.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle