newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మీరు మారరా.. పేకాటలు, బర్త్ డే పార్టీలా? కరోనాకు మీరే అంబాసిడర్లా?

21-05-202021-05-2020 10:59:53 IST
Updated On 21-05-2020 11:42:22 ISTUpdated On 21-05-20202020-05-21T05:29:53.328Z21-05-2020 2020-05-21T05:26:39.251Z - 2020-05-21T06:12:22.731Z - 21-05-2020

మీరు మారరా.. పేకాటలు, బర్త్ డే పార్టీలా? కరోనాకు మీరే అంబాసిడర్లా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎవరూ మారడం లేదు. మృత్యువు మీద పడుతున్నా.. కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నా అంతా లైట్ తీసుకుంటున్నారు. బర్త్ డే పార్టీలు, పేకాటలు, టీ పార్టీలు.. పెళ్ళిళ్ళు ఇలా జనసమూహాలు ఎక్కువగా ఉండేచోట కరోనా వైరస్ పొంచి వుండి కాటేస్తోంది. రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు పార్టీల పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. తాజాగా పేకాట ఆడుతూ లక్షలాది రూపాయలతో  ఎస్ఓటీ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు జవహర్ నగర్ టీఆర్ఎస్ కార్పొరేటర్ శివాజీ. ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ సమయంలో మౌలాలి లోని ఓ పేకాట క్లబ్ లో పేకాట ఆడుతున్న పోలీసులకు సమాచారం అందింది. దీంతో మల్కాజ్ గిరి ఎస్వోటీ పోలీసులు దాడులు చేశారు. 

దీంతో అడ్డంగా దొరికిపోయాడు జవహర్ నగర్ కార్పొరేటర్ బిలిగౌలికర్  శివాజీ. ఈ కార్పొరేటర్ వయస్సు 35 ఏళ్ళు. అతనుండేది అంబేద్కర్ నగర్ జవహర్ నగర్ మున్సిపాలిటీ. అతనితో పాటు మరికొందరు కూడా పేకాట ఆడుతూ పట్టుబడ్డారు. వీరినుంచి లక్షా ఇరవై వేలు స్వాధీనం చేసుకున్నారు. శివాజీతో పాటు మౌలాలీ కస్తూర్బా నగర్ కి చెందిన శిలా సాగర.కిరణ్ గౌడ్, చర్లపల్లి, బీఎన్ రెడ్డినగర్ వాసి కొచానా రాజు, ముషీరాబాద్ వాసి పల్నాటి రమేష్, కాప్రా వాసి రాజేష్ కన్నా నాయుడు, ఇందిరానగర్ హెచ్ బి కాలనీ వాసి అలపురం  భాస్కర్ రెడ్డి, నాగారం వాసి పోల్ రాజుని అరెస్ట్ చేశారు. వీరందరి వద్ద నుండి నగదుతో పాటు ఏడు సెల్ ఫోన్లు, 14 ఫ్లయింగ్ కార్డులతో పాటు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. వీరిని మల్కాజిగిరి పోలీసులు కోర్టుకు తరలించగా  14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. వీరిని చర్లపల్లి జైలుకు తరలించారు పోలీసులు. ఇది పేకాట కథ.. ఇంకా కోడికూర కోసం.. అష్టాచెమ్మా ఆడుతూ కాలక్షేపం చేస్తూ కరోనాకు బలయిపోతున్నారు.

గులాబీ నేతలకు నిబంధనలు వర్తంచవా?

విజయవాడలో ఇలాంటి కేసులే మనకు కనిపించాయి. ఒక లారీ డ్రైవర్ పశ్చిమబెంగాల్లో చిక్కుకుపోయాడు. కేంద్రం ఇచ్చిన సడలింపులలో అతను స్వస్ధలం విజయవాడ చేరుకుని కృష్ణలంకలో ఇంటికి వెళ్లిపోయాడు. కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళలో ఊరు కాని ఊరులో చిక్కుకుపోయాడు అనుకుని అందరూ మాట కలిపారు. అక్కడితో ఆగలేదు సాయంత్రానికి మిత్రులంతా కలిసి అలా కృష్ణానది తీరానికి చేరుకున్నారు. వాతావరణం బాగుంది పేకాట ఆడదామని అనుకున్నారు. అంతే పేకాడేశారు. కట్ చేస్తే ఒకటి రెండు రోజులకు ఆ లారీ డ్రైవర్ లో కరోనా లక్షణాలు టెస్టు చేస్తే పాజిటివ్.  అతనితో పాటు పేకాడిన 10మందికి పైగా కరోనా పాజిటివ్ బారిన పడ్డారు. 

కరోనా లాక్ డౌన్ కదా అని ఇంట్లో ఉండే అమ్మలక్కలు సరదాకి అలవాటుపడ్డారు. అంతా కలిసి ఆమాటా ఈమాటా కలుపుకుని టైంపాస్ కావడం లేదనుకుంటూ అష్టాచమ్మా, హౌసీలు ఆడటం ప్రారంభించారు. ఆడుకున్నారు నవ్వుకున్నారు ఇళ్లకు చేరుకున్నారు రెండు రోజులకు ఒకరిద్దరిలో కరోనా లక్షణాలు కనిపించాయి. వారికి పరీక్షలు నిర్వహిస్తే పాజిటివ్. వారితో పాటు ఆటాడుకున్నవారందరినీ క్వారంటైన్ తరలించారు. 

ఒకామె కోడి కూర వుండుతూ, ఇంకొకరు సేవ అంటూ విజయవాడ కృష్ణలంక ప్రాంతంలో ఉన్న అనేక వీధులలో వీరంతా సందడి చేసారు. కట్ చేస్తే ఆ ప్రాంతంలో కరోనా వైరస్ విజృంభించింది. అలా ఒక్కొక్క వ్యక్తి ద్వారా 20 మంది వరకు కరోనా వైరస్ వ్యాపించినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా 7500 మందికి వైద్య పరీక్షలు నిర్వహిస్తే 170 పాజిటీవ్ కేసులు నమోదు అయ్యాయి. వారంతా ఈ బాపతే. 

హైదరాబాద్ కరోనాకు కేరాఫ్ గా మారిన సంగతి తెలిసిందే. బర్త్ డే పార్టీలు, నిశ్చితార్థాలతో సందడి చేస్తున్నారు. అదే కరోనా వ్యాప్తికి కారణం అవుతోంది. ధూల్ పేటలో  ఓ ఫ్యామిలీ ధూంధాంగా నిశ్చితార్థం నిర్వహించటంతో 15మంది కరోనా వైరస్‌ బారిన పడగా ఒకరు మృతి చెందారు. 300 మంది బంధువులు, స్నేహితులతో వైభవంగా నిశ్చితార్థ వేడుకను నిర్వహించింది. దీంతో వేడుకలో పాల్గొన్న వారిపై కరోనా వైరస్‌ విజృంభించింది. దాదాపు 15 మందికి వైరస్‌ సోకినట్లు పరీక్షల్లో తేలింది. పెళ్లికొడుకు తండ్రి కూడా కరోనా బారినపడి మృతి చెందాడు. ఏదో సరదాపడి టీ తాగితే అనేకమంది కరోనా బారిన పడుతున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle