newssting
BITING NEWS :
* భారత్ లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు 1, 45, 380.. మరణాలు 4167*ఏపీలో 2719 మృతులు 57, తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1920 * కరోనా వైరస్ మహమ్మారిపై పోరులో భారత్ కు చైనా సహకారం యథాతథం * మహారాష్ట్రలో 1695 కోవిడ్ మరణాలు.. కేసులు 17,082*భారత్ లో వారం రోజుల్లో 45 వేల కేసులు *ఏపీలో భారీగా పట్టుబడుతున్న తెలంగాణా మద్యం*హైకోర్టుకు చేరిన ఏపీ వికేంద్రీకరణ, సీఆర్డీఏ సవరణ బిల్లు వ్యవహారం*సిద్దిపేట:కొండపోచమ్మ సాగర్‌ ప్రారంభోత్సవం ముహూర్తం ఖరారు..ఈనెల 29న ఉ. 11:30 గంటలకు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ *జార్ఖండ్ లో ఘోర ప్రమాదం ఐదుగురి మృతి

మీడియాపై కాంగ్రెస్‌లో ఫ్ర‌స్ట్రేష‌న్ పెరిగిపోతోందా..?

15-05-202015-05-2020 08:17:15 IST
Updated On 15-05-2020 10:37:24 ISTUpdated On 15-05-20202020-05-15T02:47:15.443Z15-05-2020 2020-05-15T02:46:42.038Z - 2020-05-15T05:07:24.876Z - 15-05-2020

మీడియాపై కాంగ్రెస్‌లో ఫ్ర‌స్ట్రేష‌న్ పెరిగిపోతోందా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ కాంగ్రెస్ నేత‌ల్లో ఫ్ర‌స్ట్రేష‌న్ పెరిగిపోతోంది. చేతులో మీడియా లేక‌పోవ‌డం, ఉన్న మీడియాలో త‌మ ప్రాధాన్య‌త లేక‌పోవ‌డంతో వారిలో అస‌హ‌నం ఏర్ప‌డుతోంది. తాము ఏ కార్య‌క్ర‌మం చేసినా మీడియాలో చూపించ‌డం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇంత‌కాలం బాబూ.. నాన్నా.. కొంచె మా వార్త‌లు రాయండి.. మా వార్త‌లు టీవీల్లో చూపించండి అంటూ బ‌తిమాలేవారు. అయినా, వారి వార్త‌లు నామ‌మాత్రంగానే వ‌చ్చేవి. దీంతో ఇప్పుడు ఏకంగా మీడియాతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ విష‌యాన్ని తెలంగాణ కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్ రేవంత్ రెడ్డి బ‌హిరంగంగానే ప్ర‌క‌టించారు.

మీడియా పార్టీల వారీగా చీలిపోవ‌డం తెలుగు రాష్ట్రాల్లో చాలా కాలంగానే ఉంది. అనేక సంవ‌త్స‌రాలుగా రెండు తెలుగు ప‌త్రిక‌లు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తూ ఉన్నాయి. ఈ ప‌త్రిక‌లు వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని అప్ప‌ట్లో బాగా ఇబ్బంది పెట్టారు. కాంగ్రెస్ వార్త‌ల‌కు పెద్ద‌గా ప్రాధాన్య‌త ఇచ్చేవి కాదు.

పైగా కాంగ్రెస్ వ్య‌తిరేక క‌థ‌నాలు, తెలుగుదేశం అనుకూల క‌థ‌నాలు వ‌చ్చేవి. వీటిని ఎదుర్కుంటూ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ప్ర‌జ‌ల్లోకి వెళ్లి అధికారంలోకి వ‌చ్చారు. ఆ స‌మ‌యంలోనే ఆయ‌న నేరుగా ఆ రెండు ప‌త్రిక‌లూ అంటూ అవి త‌మ‌కు వ్య‌తిరేకం అని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లారు.

అధికారంలోకి వ‌చ్చాక కూడా ఆ రెండు ప‌త్రిక‌లు కాంగ్రెస్‌కు, వైఎస్‌కు వ్య‌తిరేకంగా ఉండేవి. దీంతో త‌మ‌కే ఒక మీడియా సంస్థ ఉండాల‌ని భావించిన వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి, త‌న కుమారుడు జ‌గ‌న్‌తో ప‌త్రిక‌, టీవీ ఛాన‌ల్ పెట్టించారు. ఈ ప‌త్రిక‌, ఛానెల్‌ను అప్ప‌ట్లో కాంగ్రెస్ శ్రేణులు త‌మ స్వంత ప‌త్రిక‌గా భావించాయి. టీడీపీ అనుకూల మీడియాకు కౌంట‌ర్‌గా ఈ మీడియా నిలిచేది.

అయితే, వైఎస్ మ‌ర‌ణం త‌ర్వాత జ‌గ‌న్ స్వంత పార్టీ పెట్టుకోవ‌డంతో ఆయ‌న మీడియా కూడా కాంగ్రెస్‌కు దూర‌మైంది. దీంతో కాంగ్రెస్‌కు స్వంత మీడియా అనేది మ‌రోసారి లేకుండా పోయింది.

ఇప్పుడు తెలంగాణ‌లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న కాంగ్రెస్‌కు స్వంత మీడియా లేని లోటు బాగానే తెలుసొస్తుంది. రాష్ట్రంలో ప్ర‌ధాన ప‌త్రిక‌లు, టీవీ ఛాన‌ళ్లు టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయ‌నేది కాంగ్రెస్ భావ‌న‌. అందుకే ఆ మీడియం సంస్థ‌లు టీఆర్ఎస్‌కే అనుకూలంగా ఉంటున్నాయ‌ని, టీఆర్ఎస్ కార్య‌క్ర‌మాల‌ను, ప్ర‌భుత్వాన్ని హైలెట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీకి ఏ మాత్రం ప్రాధాన్య‌త ఇవ్వ‌డం లేద‌ని కాంగ్రెస్ నేత‌లు భావిస్తున్నారు. దీంతో ఒక‌రిద్ద‌రు కాంగ్రెస్ నేత‌లు మీడియా సంస్థ‌ల‌ను ఏర్పాటు చేయ‌డానికి ప్ర‌య‌త్నించినా స‌క్సెస్ కాలేక‌పోయారు.

కొత్త‌గా మీడియా స్థాపించే ప‌రిస్థితి లేక‌పోవ‌డం, ఉన్న మీడియా సంస్థ‌ల్లో త‌మ వార్త‌లకు ప్రాధాన్య‌త లేక‌పోవ‌డంతో తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు అసంతృప్తితో ఉన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌తిప‌క్ష తెలుగుదేశం పార్టీకి మీడియా ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తోంది. చంద్ర‌బాబు వ్యూహాల‌తో మెజారిటీ మీడియా సంస్థ‌లు ఎప్పుడూ టీడీపీ అనుకూలంగానే ఉంటాయి. ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు ఫోటో, వార్త మొద‌టి పేజీలో లేకుండా ప‌త్రిక‌లు ప్ర‌చురించ‌డం అరుదు. అదే, తెలంగాణ‌లో ప్ర‌తిప‌క్ష పార్టీల ఫోటోలు, వార్త‌లు మొద‌టి పేజీలు క‌నిపించ‌డ‌మే అరుదు.

తాము ఎన్ని కార్య‌క్ర‌మాలు చేసినా ప్రాధాన్య‌త ఇవ్వ‌డం లేద‌ని, వార్త‌లు స‌రిగ్గా ప్ర‌సారం చేయ‌డం లేద‌ని కాంగ్రెస్‌లో ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌ల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఈ విష‌యంపై మీడియా సంస్థ‌ల‌కు ఒక‌ర‌కంగా హెచ్చ‌రిక జారీ చేశారు.

ప్ర‌తిప‌క్షంగా ఉన్న తమ కార్య‌క్ర‌మాల‌ను చూపించ‌క‌పోతే తీవ్ర నిర్ణ‌యాలు తీసుకోవాల్సి ఉంటుంద‌ని, కేబుల్‌లు క‌ట్ చేస్తామ‌ని, కార్యాల‌యాల ముందు ధ‌ర్నాలు చేస్తామ‌ని సైతం ఆయ‌న హెచ్చ‌రించారు. అయితే, ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు, వారి పోరాటాల‌కు, ప్ర‌జ‌ల త‌ర‌పున వారి వాద‌న‌ల‌కు పత్రిక‌లు, టీవీ ఛాన‌ళ్లు ప్రాధాన్య‌త ఇవ్వ‌డం నైతిక బాధ్య‌త‌.

అయితే, మీడియాను డిక్టేట్ చేయాల‌నుకునేలా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లూ స‌రైన‌వి కాదు. ప్ర‌జ‌ల్లో ఉంటే, ప్ర‌జ‌ల త‌ర‌పున పోరాడితే మీడియాలో చూపించ‌క‌పోయినా ప్ర‌జ‌లు గుర్తిస్తారు. అధికారాన్ని క‌ట్ట‌బెడ‌తారు.

ఈ విష‌యాన్ని వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి, వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నిరూపించారు. బ‌ల‌మైన మీడియా వ్య‌తిరేకంగా ఉన్నా వారు ప్ర‌జ‌ల మ‌న‌స్సులు గెలుచుకొని అధికారంలోకి వ‌చ్చారు. అయితే, రేవంత్ రెడ్డి వ్యాఖ్య‌లు మీడియాను బెదిరించేలా ఉండ‌వ‌చ్చు, కానీ ఆయ‌న వాద‌న‌లో మాత్రం త‌ప్పు లేద‌ని ప‌త్రిక‌లు, ఛాన‌ళ్లు, అవి ప్ర‌సారం చేసే, ప్ర‌చురించే వార్త‌లు, వాటి ప్రాధాన్య‌త‌లు చూస్తే అర్థం చేసుకోవ‌చ్చు. ప్ర‌తిప‌క్షాలు ప్ర‌జ‌ల త‌ర‌పున మాట్లాడితే త‌గిన ప్రాధాన్య‌త ఇవ్వ‌డం ప‌త్రిక‌లు, ఛాన‌ళ్ల నైతిక బాధ్య‌త‌.

 

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

   6 hours ago


బాబోయ్ ఎండలు.. నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు!

బాబోయ్ ఎండలు.. నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు!

   8 hours ago


వైరల్ అవుతున్న కేటీయార్ చేనేత మాస్కులు

వైరల్ అవుతున్న కేటీయార్ చేనేత మాస్కులు

   11 hours ago


అకస్మాత్తు నిర్ణయాలతో ప్రయాణికుల అయోమయం

అకస్మాత్తు నిర్ణయాలతో ప్రయాణికుల అయోమయం

   12 hours ago


తెలంగాణ 66.. ఏపీలో 89.. పోటాపోటీగా పాజిటివ్ కేసులు

తెలంగాణ 66.. ఏపీలో 89.. పోటాపోటీగా పాజిటివ్ కేసులు

   13 hours ago


సీరియల్ కిల్లర్ సంజయ్.. ఒక హత్య దాచేందుకు 10 హత్యలు

సీరియల్ కిల్లర్ సంజయ్.. ఒక హత్య దాచేందుకు 10 హత్యలు

   14 hours ago


ఈ కుర్రాడు చాలా బోల్డ్.. ఢిల్లీ నుంచి ఒంటరిగా బెంగళూరుకు

ఈ కుర్రాడు చాలా బోల్డ్.. ఢిల్లీ నుంచి ఒంటరిగా బెంగళూరుకు

   14 hours ago


బాబోయ్ కోడి @500.. ఇక కొని తినలేమా?

బాబోయ్ కోడి @500.. ఇక కొని తినలేమా?

   14 hours ago


నిద్రపోతున్న జగన్ సర్కారుకి హైకోర్టు మొట్టికాయలు

నిద్రపోతున్న జగన్ సర్కారుకి హైకోర్టు మొట్టికాయలు

   15 hours ago


ముదిరిన టీటీడీ భూవివాదం.. వెనక్కు తగ్గిన ప్రభుత్వం!

ముదిరిన టీటీడీ భూవివాదం.. వెనక్కు తగ్గిన ప్రభుత్వం!

   15 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle