newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మిస్సింగ్ కేసుల కలవరం... కుటుంబసభ్యుల ఆందోళన

13-01-202013-01-2020 08:37:03 IST
2020-01-13T03:07:03.889Z13-01-2020 2020-01-13T03:06:58.351Z - - 17-04-2021

మిస్సింగ్ కేసుల కలవరం... కుటుంబసభ్యుల ఆందోళన
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
విశ్వనగరంగా మారుతున్న హైదరాబాద్ లో నేరాలు కలవరం కలిగిస్తున్నాయి. విద్యార్ధినులు, మహిళలు, చిన్నారుల  వరుస మిస్సింగ్ కేసులు ఆందోళన కరంగా మారాయి. భాగ్యనగరంలో ఇటీవల కాలంలో రోజుకు కనీసం నాలుగైదు మిస్సింగ్ కేసులు నమోదవుతుండడంతో పరిస్థితి తీవ్రతను తెలియచేస్తున్నాయి. రెండురోజుల క్రితం ఓ తల్లీకొడుకు తప్పిపోయిన విషయం వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో తల్లీకొడుకు అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది.

దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అసలు ఈ మిస్సింగులకు కారణం ఏంటో ఆరాతీస్తున్నారు. శంషాబాద్‌లోని వీకర్ సెక్షన్ కాలనీలో నివాసముండే నర్సింహులు, భార్య వరలక్ష్మి, కొడుకు శశాంక్ కనిపించకుండా పోయారు. శనివారం నర్సింహులు, వరలక్ష్మి మధ్య గొడవ జరిగినట్టు తెలుస్తోంది. అర్ధరాత్రి సమయంలో కొడుకును తీసుకుని వరలక్ష్మి బయటకు వెళ్లిపోయిందని, ఆమె ఎక్కడికో వెళ్లిందో తెలియడం లేదంటున్నారు. 

వరలక్ష్మి భర్త  నర్సింహులు చట్టుపక్కల వెతికినా ఎక్కడా వారి ఆచూకీ తెలియలేదు. దీంతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్లో నర్సింహులు ఫిర్యాదు చేశాడు. దీనిపై మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కుటుంబ కలహాల కారణంగానే వీరిద్దరూ కనిపించడంలేదంటున్నారు పోలీసులు. 

ఇటు ఏపీలోనూ మిస్సింగ్ కేసులు నమోదవుతున్నాయి. నెల్లూరు జిల్లాలో గుర్తుతెలియని వ్యక్తి తొమ్మిదేళ్ల బాలికను కిడ్నాప్‌ చేయడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. వీఎస్‌ఆర్‌నగర్‌ ఎస్టీకాలనీలో నివాసం ఉండే బూదూరు అశోక్, కృష్ణమ్మ దంపతుల కూతురు సంధ్య. కుమారుడు సంతోష్‌ ఆడుకుంటున్నారు. 

అశోక్‌ తండ్రి ముత్యాలుతో గుర్తుతెలియని వ్యక్తి శుక్రవారం అక్కడే వున్నాడు. ఇద్దరూ మందు తాగారు. కాసేపటికే ఇంటి వద్ద ఆడుకుంటున్న సంధ్య కనిపించకుండా పోయింది. గుర్తుతెలియని వ్యక్తే కిడ్నాప్ చేసి వుంటాడని భావించారు. తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. 

 

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   11 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   16 hours ago


కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

   12 hours ago


సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

   16 hours ago


కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

   14 hours ago


కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత

కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత

   19 hours ago


ల‌క్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడిన‌ట్లే- ర‌ఘురామ‌

ల‌క్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడిన‌ట్లే- ర‌ఘురామ‌

   18 hours ago


తిరుప‌తిలో  ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

తిరుప‌తిలో ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

   21 hours ago


ష‌ర్మిల ప‌క్క‌నే విజ‌య‌మ్మ‌.. లాభ‌మా న‌ష్ట‌మా

ష‌ర్మిల ప‌క్క‌నే విజ‌య‌మ్మ‌.. లాభ‌మా న‌ష్ట‌మా

   17 hours ago


ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

   a day ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle