newssting
BITING NEWS :
*సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో భారత్‌ 7 వికెట్లతో ఘన విజయం *ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు *సింగరేణి కార్మికులకు బోనస్-ముఖ్యమంత్రి కేసీఆర్‌*నల్లగొండలో భారీవర్షం... ఆరుగంటల్లో 200 మిల్లీలీటర్ల వర్షపాతం *కర్నూలు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు *బోటు ప్రమాద బాధితులకు 25 లక్షలు ఇవ్వాలి-మాజీ సీఎం చంద్రబాబు డిమాండ్ * జనగామ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి* ఈనెల 26 నుంచి బ్యాంకులు బంద్*న్యూఢిల్లి : నేడు కేంద్ర మంత్రివర్గ సమావేశం

మిషన్ భగీరథకు మీ సాయం కావాలి

12-06-201912-06-2019 09:31:06 IST
Updated On 24-06-2019 11:53:00 ISTUpdated On 24-06-20192019-06-12T04:01:06.989Z12-06-2019 2019-06-12T04:00:58.568Z - 2019-06-24T06:23:00.419Z - 24-06-2019

మిషన్ భగీరథకు మీ సాయం కావాలి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తమ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పథకానికి చేయూత నివ్వాలని కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరింది. మిషన్ భగీరథ ప్రాజెక్టుకు అయిన ఖర్చులో సగం నగదు రూపంలో అందించాలని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కేంద్రాన్ని కోరారు. కేంద్ర జలశక్తిశాఖ ఆధ్వర్యంలో గ్రామీణప్రాంతాల్లో తాగునీటి సరఫరా, స్వచ్ఛభారత్ నిర్వహణపై ఢిల్లీలో జరిగిన సదస్సులో ఎర్రబెల్లి పాల్గొన్నారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం క‌‌ృషి చేస్తోందన్నారు ఎర్రబెల్లి. దేశవ్యాప్తంగా ఇలాంటి పథకం గురించి చర్చిచేందుకు కేంద్రం ఇలాంటి సదస్సు నిర్వహించడం హర్షణీయమన్నారు.

దేశానికి ఆదర్శంగా ఉన్న తెలంగాణలో ఇప్పటికే అమలు జరుగుతున్న మిషన్‌భగీరథ కు సాయం చేయాలన్నారు. వేసవికాలంలోనూ తాగునీటి కొరత లేకుండా చేయగలిగామని మంత్రి కేంద్రానికి వివరించారు. మిషన్‌ భగీరథ పథకం నిర్వహణకు ప్రతిఏటా రూ.2వేల కోట్ల ఖర్చవుతుందని.. కనీసం ఈ నిర్వహణ ఖర్చునైనా కేంద్రం భరించాలని విజ్ఞప్తి చేశారు. 

అనంతం కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్‌తో మంత్రి ఎర్రబెల్లి సమావేశమయ్యారు. ఉపాధిహామీ పథకం అమలులో తెలంగాణ.. దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నదని వివరించారు. గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో చేపట్టే అన్ని పథకాలనూ అమలుచేస్తున్నామని, ఈ పథకాలకు నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తిచేశారు. తమ వినతులకు కేంద్రం సానుకూలంగా స్పందించిందని మంత్రి చెప్పారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle