newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మిషన్ కాకతీయకు మంగళం.. రైతులకు కష్టాలు తప్పవా?

25-02-202025-02-2020 11:46:07 IST
Updated On 25-02-2020 12:41:52 ISTUpdated On 25-02-20202020-02-25T06:16:07.889Z25-02-2020 2020-02-25T06:16:05.719Z - 2020-02-25T07:11:52.240Z - 25-02-2020

మిషన్ కాకతీయకు మంగళం.. రైతులకు కష్టాలు తప్పవా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా కేసీఆర్ దేశమే ప్రామాణికంగా తీసుకొనే కొన్ని కార్యక్రమాలకు ఊపిరి పోశారు. కేసీఆర్ ప్రారంభించిన రైతు బంధు లాంటి పథకాలు అంతకు ముందెన్నడూ దేశంలో ఏ రాష్ట్రం తీసుకొచ్చే సాహసమే చేయలేదు. ఇప్పటికీ రైతు బంధుకి సరితూగే పథకాలు ఎక్కడా లేవు. ఆ స్థాయిలో కాకపోయినా మిషన్ భగీరధ, మిషన్ కాకతీయ పథకాలు కూడా ప్రయోజనకారి పథకాలే.

మిషన్ భగీరథ పథకం యావత్ రాష్ట్రానికి మంచి నీటి దాహార్తిని తీర్చేందుకు తెస్తే కాకతీయ పథకం సాగునీటి కోసం తీసుకొచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చెరువులను పూడికలు తీసి.. వీలున్న చెరువులకు ప్రాజెక్టుల నుండి నీటిని మళ్లించేందుకు కాలువలు తీసి కట్టలు బాగుచేసి వ్యవసాయానికి నీటిని అందించడమే ఈ పథకం ఉద్దేశం. ఈ పథకంకు రూపకల్పన చేసినప్పుడు ఏటా 9,300 చెరువుల్ని బాగుచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఐదేళ్లలో మొత్తం చెరువులు, కుంటల్లో పూడిక తీసి, కట్టలు, తూములు బలోపేతం చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే పధకం అమలుకు వచ్చేసరికి కేవలం 27,625 చెరువుల పనులకే పరిపాలనా ఆమోదం ఇచ్చి.. వాటిని 4 విడతల్లో బాగు చేస్తామని, తొలి విడతగా 26,989 చెరువులు బాగు చేసేందుకు రూ.9,125 కోట్లు కేటాయించారు. తొలి విడతలో మంజూరు అయిన చెరువుల పనులు దాదాపుగా పూర్తి పూర్తయ్యాయి. ఈ పథకం కొంతమేర రైతులకు ఉపయోగపడుతుంది.

ఇక రెండో విడతకి వచ్చేసరికి ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. అనుమతులిచ్చిన వాటిలో ఎక్కువభాగం చెరువుల పనులు మొదలు కాలేదు. అదలా ఉండగానే మూడవ విడతకి అనుమతులు ఇచ్చినా అమలుకి మాత్రం నోచుకోలేదు. నిజానికి రాష్ట్రంలో చాలా పథకాలు ఆ కష్టాలే పడుతున్నా మిషన్ కాకతీయకి ఇవి రెండోసారి ప్రభుత్వంలో మరింతగా పెరిగాయని ప్రభుత్వ వర్గాలలో వినిపించే మాట.

పనులు చేసే కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులో తీవ్ర జాప్యం తలెత్తింది. ఫిబ్రవరి మొదటి వారం వరకు మిషన్‌‌‌‌ కాకతీయలో రూ.4,352.18 కోట్ల పనులు చేసినట్టుగా అధికారులు చెప్తున్నా.. ఇందులో రూ.450 కోట్ల బిల్లులు పెండింగ్‌‌‌‌లో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆ కారణంగానే గత రెండేళ్లుగా ఈ పథకంలో పనులు నెమ్మదిగా సాగుతూ వచ్చాయి. ఇక ఇప్పుడు పూర్తిగా పథకానికి మంగళం పడేసినట్లుగా వినిపిస్తుంది.

ఈ పధకం కింద ఇకపై పనులేవీ చేపట్టవద్దని సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్నట్లుగా అధికారుల నుండి వినిపిస్తుంది. ఇప్పటికే ఆ శాఖ ఉన్నతాధికారులకు సీఎం కేసీఆర్‌‌‌‌ మౌఖికంగా ఆదేశాలిచ్చినట్టు చెప్తున్నారు. గతంలో పది లేదా ఇరవై శాతం మధ్యన ఆగిన పనులను మాత్రమే పూర్తి చేయాలని.. అంతకు మించి ఉన్న వాటిని వదిలేయాలని నిర్ణయించుకున్నట్లుగా చెప్తున్నారు. కొద్ది రోజులు గడిస్తేకాని దీనిపై స్పష్టత వచ్చే అవకాశాలు లేవు!

 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   15 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   12 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   14 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   18 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   21 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   a day ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle