మినీ సంగ్రామంలో విజయ తాపత్రయం లేని కాంగ్రెస్!
10-01-202010-01-2020 10:41:02 IST
Updated On 10-01-2020 10:56:19 ISTUpdated On 10-01-20202020-01-10T05:11:02.334Z10-01-2020 2020-01-10T05:10:59.934Z - 2020-01-10T05:26:19.054Z - 10-01-2020

తెలంగాణ రాష్ట్రంలో మినీ సంగ్రామం మొదలైంది. పంచాయతీ, మున్సిపల్, నగర పంచాయతే స్థానిక ఎన్నికలు ఏదైనా ప్రతిపార్టీ ఒక సంగ్రామంగానే భావిస్తాయి. స్థానికంగా తమ పార్టీ బలాబలాలు.. తమ క్యాడర్ లో పటుత్వం.. కార్యకర్తలలో పార్టీపై అభిప్రాయం అన్నీ బయటపడేది ఇక్కడే. పైగా పార్టీ గుర్తులతో జరిగే మున్సిపల్ ఎన్నికలంటే ప్రతి పార్టీ చావో రేవో తేల్చుకోవాల్సిందే. అందుకే, ఇప్పుడు తెలంగాణలో అన్ని పార్టీలు సమరానికి సిద్ధమయ్యాయి. ఒకపక్క టీఆర్ఎస్ పార్టీ సమీక్షలు, సంక్షేమం, రైతాంగం అంటూ ప్రజలలో దూసుకెళ్తుంటే బీజేపీ గట్టిగా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగానే తెరాస-ఎంఐఎం బంధాన్ని హైలెట్ చేస్తూ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది. సీనియర్ నేతలను తనలో కలుపుకొని ప్రభుత్వానికి తామే పోటీ అనేలా బిల్డప్ ప్లాన్ చేసుకుంటుంది. మరి తెరాస తర్వాత రెండో అతిపెద్ద పార్టీగా సీట్లు దక్కిచ్చుకున్న కాంగ్రెస్ ఎక్కడ? ఎమ్మెల్యేలు హ్యాండిచ్చి ప్రతిపక్ష హోదా చేయిజారిన రోజే పార్టీ పరిస్థితి కూడా దిగజారిందా? ఇవే సగటు రాజకీయ మేధావులకి తలెత్తే ప్రశ్న. మున్సిపల్ తపన స్థానిక నేతలలో కనిపిస్తుంది తప్ప కాంగ్రెస్ పెద్దలు, సీనియర్లలో మాత్రం కనిపించడం లేదని చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్రస్థాయి నేతలు ఓ కమిటీగా ఏర్పడి విస్తృత పర్యటనలు చేసి స్థానిక నేతలలో కదలిక తెచ్చి ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయత్నం చేస్తూ పార్టీకి జవసత్వాలు నింపాలి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. కనీసం సన్నాహాలు, ప్రణాళికలు అనేలా సమీక్షలు కూడా కరువయ్యాయి. ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా స్థానిక నేతలే ఎన్నికలకి సిద్ధమవుతున్నారు. ఇక పార్టీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తీరా ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యాక తాను చీఫ్ గా రాజీనామా చేస్తా అంటే అధిష్టానమే మున్సిపల్ ఎన్నికల వరకు ఉండాలని కోరిందని చెప్పారంటే.. ముందే హ్యాండ్సప్ చెప్పేసినట్లుగా అనుకోవాలి. పైగా ఎన్నికల సమయంలో చీఫ్ పై సీనియర్ నేతలు అధిష్టానానికి ఫిర్యాదులు చేయడం ఇక్కడ మరో వింత. మొత్తంగా టీకాంగ్రెస్ లో పరిస్థితి చూస్తే మొక్కుబడి సమీక్షలు, మొక్కుబడి విమర్శలు.. మొక్కుబడి మీడియా మీట్లు తప్ప ప్రభుత్వానికి తామే ప్రత్యామ్నాయం అనే భరోసా ఇచ్చే ప్రయత్నం చేయలేకపోయారు. తెరాస పార్టీ అధిష్టానమే కాంగ్రెస్ ను తక్కువగా అంచనా వేయమని చెప్పినా.. కాంగ్రెస్ నేతలలో మాత్రం వాళ్లకున్న అవకాశం ఏమిటో వాళ్ళు ఉపయోగించులేని పరిస్థితిలో పడిపోయారని చెప్పక తప్పదు.

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు
4 hours ago

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం
6 hours ago

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుపతిలో
an hour ago

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన
8 hours ago

ఈ టైంలో అవసరమా మేడమ్
8 hours ago

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా
28 minutes ago

ఏంది సార్.. మరీ ఇంత దిగజారిపోయారా
2 hours ago

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ
8 hours ago

ఇక కేటీఆర్ టైం వచ్చినట్లేనా
10 hours ago

బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమం
18-04-2021
ఇంకా