newssting
BITING NEWS :
పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల్లో గురువారం ఉదయం సంభవించిన భూకంపం. పాకిస్థాన్ దేశంలోని ఇస్లామాబాద్ నగరానికి పశ్చిమాన 40 కిలోమీటర్ల దూరంలో ఉదయం 5.46 గంటలకు భూ ప్రకంపనలు. భూకంప ప్రభావం రిక్టర్ స్కేలుపై 4.3 అని సీస్మోలజీ శాస్త్రవేత్తల ప్రకటన. ఆఫ్ఘనిస్థాన్ దేశంలోని కాబూల్ నగరానికి ఈశాన్యంలోని 237 కిలోమీటర్ల దూరంలో ఉదయం 5.33 గంటలకు భూకంపం. రిక్టర్ స్కేలుపై 4.2గా నమోదు * గుజరాత్‌లో గురువారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం. సూరత్‌లోని హజీరా ఆధారిత ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ) ప్లాంట్‌లో తెల్లవారుజామున 3:30 గంటలకు ప్రమాదం. ఓఎన్‌జీసీ ప్లాంట్‌లోని రెండు టెర్మినల్స్ వద్ద పేలుడుతో భారీ ఎత్తున చెలరేగిన మంటలు * ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ ప్రభావిత ప్రాంతాల్లో 12 వేల పందులను మట్టుబెట్టాలని అసోం ప్రభుత్వం ఆదేశం. ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూను అరికట్టే చర్యల్లో భాగంగా నిర్ణయం. పందులను చంపేందుకు యజమానులకు పరిహారం. రాష్టంలోని 14 జిల్లాలలో స్వైన్ ఫ్లూ ప్రభావం,స్వైన్ ప్లూ కారణంగా ఇప్పటి వరకూ రాష్ట్రంలో 18 వేలకు పైగా పశువులు మృతి * ముంబైలో మరోసారి రికార్డు స్థాయిలో వర్షాలు. సెప్టెంబర్‌ నెలలో ఇంతటి స్థాయిలో వర్షాలు కురవడం గత 26 ఏళ్లలో ఇది నాల్గోసారి. మంగళవారం, బుధవారం 24 గంటలలో ఏకంగా 286.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు. 1994 తర్వాత సెప్టెంబర్‌ నెలలో కురిసిన భారీ వర్షమిదే. 1974 నుంచి 2020 కాలంలో సెప్టెంబర్‌లో ఇంత భారీ వర్షం నమోదు కావడం ఇది నాల్గోసారి * ఢిల్లీలో కరోనా వైరస్ మరోసారి విజృంభణ. కరోనా బాధితులలో 11.55 శాతం మంది వెంటిలేటర్ సపోర్టుతో చికిత్స. కొద్దిరోజులుగా అంతకంతకూ పెరుగుతున్న ఢిల్లీలో వెంటిలేటర్‌పై ఉంటున్న రోగుల సంఖ్య. ఢిల్లీలో స్థానిక కోవిడ్ బాధితుల కోసం రిజర్వ్ చేసిన 62 శాతం వెంటిలేటర్ బెడ్లు ఫుల్ * కరోనాతో మృతి చెందిన కర్ణాటక బీజేపీ ఎంపీ, రైల్వే శాఖ సహాయ మంత్రి సురేశ్‌ అంగడి(65). మూడు రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఢిల్లీ ఎయిమ్స్‌ ఆసుపత్రి ట్రామా సెంటర్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన సురేష్ అంగడి. కరోనా వల్ల చనిపోయిన తొలి కేంద్ర మంత్రి ఈయనే * భద్రాద్రి కొత్తగూడెం చెన్నాపురం అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు. ముగ్గురు మావోయిస్టుల మృతి చెందగా అందులో ఇద్దరు మహిళలు. అయితే కాల్పులు జరిగిన ప్రదేశం నుండి రైఫిల్, పేలుడు సామాగ్రి స్వాధీనం చేసుకున్న పోలీసులు. మరికొంత మంది మావోయిస్టుల కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు * హైదరాబాద్ నగర శివారులో రోడ్డెక్కిన సిటీ బస్సులు. రాజేంద్రనగర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, బండ్లగూడ శివారు ఆర్టీసీ డిపోల నుంచి బస్సు సర్వీసులు ప్రారంభం. ప్రతి డిపో నుంచి 12 బస్సులను నడుపుతున్న ఆర్టీసీ * కరోనాకు మరో ప్రముఖ నటుడు బలి. తెలుగు కమెడియన్ నటుడు కోసూరి వేణుగోపాల్ కరోనా కారణంగా కన్నుమూత. గత 22 రోజులుగా గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి. కరోనా నెగిటివ్ వచ్చాక కూడా అనారోగ్యం నుంచి కోలుకోలేకపోయిన కమెడియన్ * శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న భారీ వరద ప్రవాహం. జలాశయం 8 గేట్లను 10 అడుగుల మేర ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల * చిత్తూరు జిల్లాలోని కుప్పంలో ఏనుగులు బీభత్సం. పంట పొలాలకు కాపలాగా ఉన్న వారిపై ఏనుగులు దాడి. ఒకరు మృతి చెందగా మరికొందరికి గాయాలు. ఏనుగుల బీభత్సంతో భయాందోళనలు వ్యక్తం చేసున్న గ్రామస్థులు * పశ్చిమ మధ్యప్రదేశ్‌ పరిసరాల్లో కొనసాగుతున్న అల్పపీడనం. అల్పపీడనానికి అనుబంధంగా 5.8 కి.మీ ఎత్తున ఆవరించిన ఉపరితల ఆవర్తనం. గురు, శుక్రవారాలలో ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు కురిసే అవకాశం. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం.

మా పార్టీకో రూల్... మీ పార్టీనేతలకో రూలా?

19-12-201919-12-2019 09:06:07 IST
Updated On 19-12-2019 11:22:25 ISTUpdated On 19-12-20192019-12-19T03:36:07.732Z19-12-2019 2019-12-19T03:30:33.335Z - 2019-12-19T05:52:25.091Z - 19-12-2019

 మా పార్టీకో రూల్... మీ పార్టీనేతలకో రూలా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాజాసింగ్... పేరు చెబితే వివాదాలు మదిలో మెదులుతాయి. తెలంగాణ అసెంబ్లీలో ఏకైక బీజేపీ ఎమ్మెల్యే. బీజేపీ పార్టీకి వీర విధేయుడు. ఎంతమంది సీనియర్ నేతలు టికెట్ రాకుండా చేసినా అమిత్ షా ప్రోత్సాహంతో రాజాసింగ్ టికెట్ తెచ్చుకుని తన సత్తా చాటుకున్నారు. తాజాగా పోలీసుల తీరుపై రాజాసింగ్ ఆగ్రహోదగ్రుడవుతున్నాడు. ఎందుకంటే ఆయన ఒక ఎమ్మెల్యేగా ఉన్నా.. పాతకేసులు ఆయన్ని వెంటాడుతూనే వున్నాయి.

ఎమ్మెల్యే రాజా సింగ్‌కు హైదరాబాద్ పోలీసులు షాకివ్వడం చర్చనీయాంశం అయింది.  మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఉన్న రౌడీ షీటర్స్ జాబితాలో రాజాసింగ్ పేరు కనిపించడంతో ఆయన ఆవేశానికి అంతే లేకుండాపోతోంది. 

ఇది ఇప్పుడు వైరల్ అవుతోంది.  పోలీసుల తీరుపై రాజాసింగ్ తీవ్రంగా మండిపడుతున్నారు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు ఎమ్మెల్యే రాజాసింగ్. తనకో న్యాయం.. టీఆర్ఎస్ పార్టీ నేతలకో న్యాయమా అంటూ రాజాసింగ్ ఫైర్ అవుతున్నారు. 

నేను ఇప్పటికీ  తెలంగాణ పోలీసుల దృష్టిలో రౌడీ షీటర్‌గానే ఉండడం బాధాకరంగా ఉంది. టీఆర్ఎస్ పార్టీలో కూడా కొంత మంది ఎమ్మెల్యేల పేర్లు రౌడీ షీట్‌ లో ఉండేవి. కానీ ఇప్పుడు వారి పేర్లు ఆ లిస్ట్ లో పెట్టగలరా?

దీనికి హోం మంత్రి లేదా ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి అని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆవేదన చెందుతున్నారు. చట్టం ముందు అంతా సమానమే అని చెప్పే పోలీసులు టీఆర్ఎస్ నేతల్లోని రౌడీ షీటర్ల పేర్లు కూడా ఈ జాబితాలో చేర్చాలన్నారు. 

అవినీతి తిమింగలం.. చెట్లకు నీరు పోసేవాడు కూడా బినామీనే..

అవినీతి తిమింగలం.. చెట్లకు నీరు పోసేవాడు కూడా బినామీనే..

   6 minutes ago


రెండుసార్లు శ్రీవారిని దర్శించుకున్న సీఎం.. ఆశ్చర్యపోతున్న భక్తులు

రెండుసార్లు శ్రీవారిని దర్శించుకున్న సీఎం.. ఆశ్చర్యపోతున్న భక్తులు

   3 hours ago


టెస్టింగ్, ట్రేసింగ్ ఇదేనా మంత్రం – కరోనా కట్టడిపై మోడీ సర్కార్ నిస్సహాయత

టెస్టింగ్, ట్రేసింగ్ ఇదేనా మంత్రం – కరోనా కట్టడిపై మోడీ సర్కార్ నిస్సహాయత

   3 hours ago


కర్ణాటక ఎమ్మెల్యేల జీతాల తగ్గింపు.. మరి మిగతా రాష్ట్రాల సంగతేమిటి?

కర్ణాటక ఎమ్మెల్యేల జీతాల తగ్గింపు.. మరి మిగతా రాష్ట్రాల సంగతేమిటి?

   4 hours ago


మోదీ-షాల‌కు కొడాలి కౌంట‌ర్‌...  ఇంత ధైర్యం ఎలా వ‌చ్చింద‌బ్బా?

మోదీ-షాల‌కు కొడాలి కౌంట‌ర్‌... ఇంత ధైర్యం ఎలా వ‌చ్చింద‌బ్బా?

   5 hours ago


వ్యవసాయ బిల్లులపై ఎవరికి లాభం.. ఎవరికి నష్టం..?

వ్యవసాయ బిల్లులపై ఎవరికి లాభం.. ఎవరికి నష్టం..?

   6 hours ago


పొలిటికల్ ఎంట్రీ పై స్పందించిన పీపుల్ స్టార్.!

పొలిటికల్ ఎంట్రీ పై స్పందించిన పీపుల్ స్టార్.!

   7 hours ago


ఇంటినుంచి పనే భేషుగ్గా ఉంది... హైదరాబాద్ ఐటీ ఉద్యోగులు

ఇంటినుంచి పనే భేషుగ్గా ఉంది... హైదరాబాద్ ఐటీ ఉద్యోగులు

   8 hours ago


ఏపీలో తగ్గుతున్న కేసులు.. పెరుగుతున్న రికవరీ రేటు

ఏపీలో తగ్గుతున్న కేసులు.. పెరుగుతున్న రికవరీ రేటు

   9 hours ago


ఇంటర్ సిలబస్ కుదింపు ఉంది.. లేదు.. తెలంగాణ బోర్డు గందరగోళం

ఇంటర్ సిలబస్ కుదింపు ఉంది.. లేదు.. తెలంగాణ బోర్డు గందరగోళం

   9 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle