newssting
BITING NEWS :
*కార్మికులతో చర్చలు జరపండి: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఆదేశం * విశాఖ భూ కుంభకోణంపై సిట్‌ ఏర్పాటు * ఆర్టీసీ జేఏసీ సమావేశం.*ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ.. కోర్టుకు నివేదిక సమర్పించిన తెలంగాణ ప్రభుత్వం*హైదరాబాద్‌ వనస్థలిపురంలో దారుణం...ప్రియురాలిని భవనం పైనుంచి కిందకు నెట్టి చంపిన ప్రియుడు*కేబినెట్ సమావేశాల నిర్వాహణలో సీఎం జగన్ కీలక నిర్ణయం..ఇకపై నెలలో రెండు సార్లు మంత్రి వర్గ సమావేశం *ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెపై గవర్నర్ తమిళిసై ఆరా...మంత్రి పువ్వాడ అజయ్ తో ఫోన్‌ లో మాట్లాడిన గవర్నర్ *హూజూర్‌నగర్‌లో భారీ వర్షం.. మార్గ మధ్యలో కూడా ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షం.. కేసీఆర్ టూర్ రద్దు

మా గొంతు ఎండిపోతోంది.... నీళ్ళివ్వండి మహా ప్రభో!

11-07-201911-07-2019 16:13:47 IST
Updated On 13-07-2019 12:28:22 ISTUpdated On 13-07-20192019-07-11T10:43:47.906Z11-07-2019 2019-07-11T10:43:46.255Z - 2019-07-13T06:58:22.848Z - 13-07-2019

మా గొంతు ఎండిపోతోంది.... నీళ్ళివ్వండి మహా ప్రభో!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నగరం నడిబొడ్డున ఉన్న కంటోన్మెంట్ ప్రాంతవాసుల గొంతెండిపోతోంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ వాసులు గుక్కెడు నీరు దొరక్క నానా అవస్థలు పడుతున్నారు. తాము నీటి కోసం కష్టాలు పడుతుంటే అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని కాకాగూడ బస్తీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Image may contain: 8 people, including Devender Reddy, people smiling, people standing

ఎన్నికల సమయంలో కంటోన్మెంట్‌ బోర్డు పరిధిలోని ప్రజలకు రోజు విడిచి రోజు తాగునీరు సరఫరా చేస్తామన్న హామీ ఇచ్చారని, ఇన్నినెలలు అయినా ఆ హామీని నిలబెట్టుకోలేదని స్థానిక మహిళలు ఖాళీబిందెలతో నిరసన వ్యక్తం చేశారు. తాము నీళ్ళకోసం నానా ఇబ్బందులు పడుతున్నామని మహిళలు ఆవేదన చెందుతున్నారు.

Image may contain: 3 people, people standing

ఈ కంటోన్మెంట్ ప్రాంతంలో కొన్ని బస్తీల్లో వారానికి ఒకరోజు నీరు సరఫరా అవుతోంది. హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై బోర్డు ఈ కాలనీలను నిర్లక్ష్యం చేస్తోందని బస్తీవాసులు మండిపడుతున్నారు. మహేంద్రహిల్స్ లోని రిజర్వాయర్ ద్వారా నీరు సరఫరా చేయాలి. ఇక్కడ 25 వేల మంది నివాసం ఉంటున్నారు. వీరికి తాగడానికి నీరు దొరకడం లేదు. తమకు బోర్లు కూడా లేవని. తాగునీరు లేకపోతే బాటిల్ 30 రూపాయలకు కొనుక్కోవాల్సి వస్తోందంటున్నారు. 

వాటర్ బోర్డు ద్వారా నీటిని తెప్పించుకోవాలని భావించినా.... బుక్ చేసిన పదిరోజులకు గానీ వాటర్ ట్యాంకర్ రావడంలేదని స్థానికులు ‘న్యూస్ స్టింగ్’ ప్రతినిధికి వివరించారు, ఉచిత వాటర్ ట్యాంకుపై తాము ఆశలు వదిలేసుకున్నామని, తాము కొనుక్కుని నీరు తాగలేక అవస్థలు పడుతున్నామని అంటున్నారు. గత 25 ఏళ్ళనుంచి సమస్య ఇలాగే ఉందని స్థానిక మహిలు చెబుతున్నారు. దీంతో స్నానాలకు కూడా నీరు దొరకడం లేదంటున్నారు స్థానిక మహిళలు.

సికింద్రాబాద్ కంటోన్మెంట్ లోని ఈప్రాంతంలో నెలకు రూ. 315 నుంచి రూ.450 నెలవారీ బిల్లులు వస్తున్నాయి. అయినా తాగునీరు మాత్రం సక్రమంగా అందడం లేదు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని వీకర్ సెక్షన్ కాలనీల్లో ఈ బిల్లులు రూ.100 నుంచి 162 రూపాయలే వుంటున్నాయి. తమపట్ల ఎందుకీ వివక్ష అంటున్నారు బస్తీ వాసులు.

Image may contain: 2 people

ఈ వ్యత్యాసాన్ని తగ్గించి గ్రేటర్ హైదరాబాద్ బస్తీలకు సరఫరా చేసినట్టు తాగునీరు అందించాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. ఈమేరకు సీఎం కేసీఆర్, వాటర్ బోర్డు అధికారులకు వాసవీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తేలుకుంట సతీష్ కుమార్ గుప్తా  40 రోజులుగా సంతకాల సేకరణ చేసి వినతిపత్రం అందచేశారు. 

మొత్తం మీద తాము కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఉండడం వల్లే ఈ ఇబ్బందులు వస్తున్నాయని, తమను గ్రేటర్ హైదరాబాద్ లో కలపాలన్న డిమాండ్ తో ఆందోళన నిర్వహిస్తామని స్థానికులు అంటున్నారు. వాటర్ బోర్డు అధికారులు, ఎమ్మెల్యే, ఎంపీలు తక్షణం తమ సమస్యను పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 

 

లెక్క తేలింది.. మద్యం దరఖాస్తుల ద్వారా రూ. 960 కోట్లు

లెక్క తేలింది.. మద్యం దరఖాస్తుల ద్వారా రూ. 960 కోట్లు

   9 hours ago


కార్మికులతో చర్చలు జరపండి: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఆదేశం

కార్మికులతో చర్చలు జరపండి: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఆదేశం

   9 hours ago


‘మహా’లో పట్టు నిలిచేనా? హర్యానాలో హవా సాగేనా?

‘మహా’లో పట్టు నిలిచేనా? హర్యానాలో హవా సాగేనా?

   10 hours ago


టీఆర్ఎస్‌లో తిరుగుబాటు.. కేసీఆర్ సర్కార్ పై నీలినీడలు

టీఆర్ఎస్‌లో తిరుగుబాటు.. కేసీఆర్ సర్కార్ పై నీలినీడలు

   10 hours ago


జర్నలిస్టు హత్య కేసు:ప్రాణహాని ఉందని చెప్పినా పట్టించుకోలేదా?

జర్నలిస్టు హత్య కేసు:ప్రాణహాని ఉందని చెప్పినా పట్టించుకోలేదా?

   11 hours ago


హుజూర్‌నగర్లో హోరాహోరీ.. గెలుపెవరిది?

హుజూర్‌నగర్లో హోరాహోరీ.. గెలుపెవరిది?

   11 hours ago


ఆ విషయంలో జగన్ కంటే వైఎస్సే బెస్ట్.. బాబు కామెంట్స్

ఆ విషయంలో జగన్ కంటే వైఎస్సే బెస్ట్.. బాబు కామెంట్స్

   13 hours ago


జేసీ బ్రదర్స్‌ప్రై ప్రతీకారం మొదలైనట్లేనా..

జేసీ బ్రదర్స్‌ప్రై ప్రతీకారం మొదలైనట్లేనా..

   13 hours ago


దేవుడు కూడా కేసీఆర్‌‌ను వ్యతిరేకిస్తున్నాడుగా.. దాసోజు ఎద్దేవా

దేవుడు కూడా కేసీఆర్‌‌ను వ్యతిరేకిస్తున్నాడుగా.. దాసోజు ఎద్దేవా

   14 hours ago


ఆర్టీసీ జేఏసీ నేత అశ్వథ్ధామరెడ్డి అరెస్ట్

ఆర్టీసీ జేఏసీ నేత అశ్వథ్ధామరెడ్డి అరెస్ట్

   14 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle