newssting
BITING NEWS :
*కరోనా కట్టడిలో అన్ని వర్గాల కృషిని ప్రశంసించిన ప్రధాని మోడీ. మన్ కీ బాత్ లో పలు అంశాలను ప్రస్తావించిన మోడీ ఆత్మనిర్భర భారత్ ద్వారా ఆర్థికవ్యవస్థకు ఊతం *తెలంగాణలో పెరుగుతున్న కేసులు.. కొత్తగా 74, మరణాలు 77, మొత్తం కేసులు 2499 * జూన్ 30 వరకూ ఐదవ విడత లాక్ డౌన్.. పలు సడలింపులు *దేశ వ్యాప్తంగా జూన్ 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు..కొత్త మార్గదర్శకాలు రిలీజ్ చేసిన కేంద్రం..ఈ సారి లాక్ డౌన్ లో మరిన్ని సడలింపులు..కేవలం కంటైన్మెంట్ జోన్లకే లాక్ డౌన్ పరిమితం*మాల్స్, రెస్టారెంట్లు జూన్ 8 వ తేదీ నుంచి పునఃప్రారంభం..కర్ఫ్యూ సమయం కుదింపు..దేశ వ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ*ఆదివారం మన్ కీ బాత్ లో పలు వివరాలు వెల్లడించనున్న ప్రధాని మోడీ * మాల్స్, రెస్టారెంట్ల, దేవాలయాలు, చర్చిలు జూన్ 8 నుంచి ప్రారంభం *పాఠశాలలు, కాలేజీలు, విద్యాసంస్థలు ప్రారంభంపై రాష్ట్రాలకు నిర్ణయాధికారం *విద్యాసంస్థల ప్రారంభంపై జూలైలో నిర్ణయం*నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామక ఉత్తర్వులు వెనక్కి *ఏపీలో మొత్తం కేసులు 3461

మాస్క్ లేకుండా బయటికి వస్తే పట్టేస్తారు.. పోలీసుల చేతిలో వజ్రాయుధం

18-05-202018-05-2020 16:03:13 IST
2020-05-18T10:33:13.392Z18-05-2020 2020-05-18T10:33:10.900Z - - 31-05-2020

మాస్క్ లేకుండా బయటికి వస్తే పట్టేస్తారు.. పోలీసుల చేతిలో వజ్రాయుధం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశచరిత్రలోనే మొదటి సారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ సహాయంతో మాస్కుల ఉల్లంఘనదారుల్ని అట్టేసే పట్టేసే సాంకేతిక నిఘా హైదరాబాద్ పోలీసులకు అందుబాటులోకి వచ్చింది. ఇక నుంచి రాజధాని నగరంలో ఎవరైనా సరే.. మాస్కులు ధరించటాన్ని తేలిగ్గా తీసుకున్నా. బట్టతో ముఖాన్ని సరిగా కవర్ చేసుకోకున్నా అలాంటివారి జాడను తెలంగాణ పోలీసులు అట్టే పట్టేస్తారు. కృత్రిమ మేధస్సు సహాయంతో అలాంటి మాస్క్ ఉల్లంఘనదారుల వద్దకు నిమిషాల్లోనే పోలీసు టీమ్ చేరుకుని జరిమానా వడ్డించేయగలరు.

కోవిడ్‌ మహమ్మారి విస్తరించకుండా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలోని బహిరంగ ప్రదేశాల్లో సంచరించే ప్రతి ఒక్కరూ కచ్చితంగా మాస్కులు ధరించాలన్న నిబంధన వాటిలో ఒకటి. దీన్ని అమలులోకి తీసుకువచ్చిన పోలీసు విభాగం నేరుగా, సాంకేతికంగానూ ఉల్లంఘనుల్ని గుర్తిస్తోంది. రహదారులపై మాస్కులు లేకుండా సంచరిస్తున్న వారిని సీసీ కెమెరాల ద్వారా ఆటోమేటిక్‌గా గుర్తించడానికి ఉద్దేశించిన ఫేస్‌ మాస్క్‌ వైలేషన్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (ఎఫ్‌ఎంవీఈ) సిస్టం రాజధానిలోని మూడు కమిషనరేట్లలో ప్రయోగాత్మకంగా అమలులోకి వచ్చింది. 

ఈ నెల 7నుంచి పని ప్రారంభించిన దీని ద్వారా ఆరు రోజుల్లో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులు 1896 కేసులు నమోదు చేశారు. త్వరలో ఎఫ్‌ఎంవీఈ విధానాన్ని పూర్తి స్థాయిలో అమలులోకి తీసుకురావడానికి పోలీసు విభాగం కసరత్తు చేస్తోంది. ఈ తరహా విధానం దేశంలోనే తొలిసారి రాజధానిలోని మూడు కమిషనరేట్లలో మొదలైంది. 

సరికొత్త సాంకేతిక నిఘా ఎలా పనిచేస్తుంది?

వివిధ నేరాలకు సంబంధించి వాంటెడ్‌గా ఉన్న వ్యక్తులు, పాత నేరస్తుల్ని నగరంలో పట్టుకోవడానికి రూపొందించిన ఫేషియల్‌ రికగ్నైజేషన్‌ సిస్టం (ఎఫ్‌ఆర్‌ఎస్‌)లో పోలీసు విభాగం సమకాలీన అవసరాలకు తగ్గట్టు మార్పు చేర్పులు చేసింది. రాజధానిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలన్నీ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ (సీసీసీ)లోని ఎఫ్‌ఆర్‌ఎస్‌ వ్యవస్థతో కూడిన సర్వర్‌కు అనుసంధానించి ఉన్నాయి. ఇక్కడి సర్వర్‌లో ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ నిక్షిప్తమై ఉంది. ఫలితంగా ఆయా కెమెరాల ముందుకు వచ్చిన వాంటెడ్‌ వ్యక్తుల్ని గుర్తించే సాఫ్ట్‌వేర్‌ సీసీసీలోని సిబ్బందికి అలెర్ట్‌ ఇస్తుంది. 

దేశంలోని మరే ఇతర కమిషనరేట్‌లోనూ లేని ఈ ఎఫ్‌ఆర్‌ఎస్‌ పరిజ్ఞానాన్ని ఇప్పుడు కరోనా నిరోధానికి అనువుగా మార్చి వాడుతున్నారు. ఎఫ్‌ఎంవీఈ పేరుతో రూపొందే ఈ సాఫ్ట్‌వేర్‌ సైతం సీసీసీలోని సర్వర్‌లో నిక్షిప్తం అవుతోంది. ఫలితంగా నగరంలో కాలినడకన సంచరించే, వివిధ క్యూలైన్లలో నిల్చునే ఏ వారిలో ఎవరైనా ఫేస్‌మాస్క్‌ ధరించకపోతే ఆ విషయాన్ని సమీపంలోని సీసీ కెమెరాల ద్వారా ఎఫ్‌ఎంవీఐ గుర్తించి, కంట్రోల్‌ రూమ్‌ సిబ్బందికి సమాచారం ఇస్తుంది. వెంటనే ఆ సమాచారాన్ని ఆ ప్రాంతానికి సమీపంలో ఉన్న పోలీసులకు చేరవేసి వారు ఈ ఉల్లంఘనులున్న ప్రాంతానికి వెళ్లేలా చర్యలు తీసుకుంటారు. ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉన్న ఎఫ్‌ఎంవీఈ పరిజ్ఞానం మరికొన్ని రోజుల్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. 

వాహనంపై వెళ్తున్న వాళ్లు, పాదచారుల్లో కొందరు మాస్కులు ధరించట్లేదు. అయితే వీళ్లు ఓ ప్రాంతంలో ఎక్కువ సేపు ఉండరు. ఫలితంగా వీరు మాస్క్‌ ధరించలేదనే విషయం ఎఫ్‌ఎంవీఈ గుర్తించినా.. దానిపై క్షేత్రస్థాయి పోలీసులకు సమాచారం అంది, వాళ్లు అక్కడకు పంపేలోపు వారు వేరే చోటుకు వెళ్లిపోతున్నారు. అదే దుకాణాల వద్ద, ఇతర సంస్థల వద్ద క్యూలో ఉన్న వారు మాత్రం చిక్కుతున్నారు. 

మాస్క్‌ ధరించడం తప్పనిసరి అంటూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం దీన్ని ధరించకుండా బయటకు వచ్చిన వారికి రూ.1000 జరిమానా విధించాలని స్పష్టం చేసింది. డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌లోని సెక్షన్‌ 51 (బి) ప్రకారం ఈ కేసులు నమోదు చేస్తున్నారు. అయితే పోలీసులకు ఈ మొత్తం వసూలు చేసే అధికారం లేకపోవడంతో ప్రస్తుతం చలానా జారీ చేసి, వ్యక్తిగత బాండ్‌పై విడిచిపెడుతున్నారు. న్యాయస్థానాలు పని చేయడం ప్రారంభమైన తర్వాత ఈ ఉల్లంఘనులకు నోటీసులు ఇచ్చి, కోర్టులో హాజరుపరచనున్నారు. 

ఈ సరికొత్త సాంకేతిక నిఘా వ్యవస్థ పోలీసులకు అందుబాటులోకి వచ్చిన తర్వాత కేవలం ఆరు రోజుల్లోనే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులు 1896 కేసులు నమోదు చేశారు. ఈ నెల 7– 13 మధ్య హైదరాబాద్‌ 1315 సైబరాబాద్‌ 191, రాచకొండ 390 కేసులు నమోదు కావడం విశేషం.

తెలంగాణలో కంటైన్మెంట్ జోన్లలోనే లాక్‌డౌన్ ... అక్కడ షరతులు వర్తిస్తాయ్!

తెలంగాణలో కంటైన్మెంట్ జోన్లలోనే లాక్‌డౌన్ ... అక్కడ షరతులు వర్తిస్తాయ్!

   3 hours ago


తెలంగాణలో కరోనా విజృంభణ.. ఒకేరోజు 6 గురు మృతి!

తెలంగాణలో కరోనా విజృంభణ.. ఒకేరోజు 6 గురు మృతి!

   8 hours ago


భక్తులకు శుభవార్త.. జూన్ 8 నుంచి తిరుమలలో దర్శనాలు

భక్తులకు శుభవార్త.. జూన్ 8 నుంచి తిరుమలలో దర్శనాలు

   11 hours ago


మోడీ మన్ కీ బాత్.. కరోనాపై యుద్ధానికి కొత్త దారులు వెతుకుదాం

మోడీ మన్ కీ బాత్.. కరోనాపై యుద్ధానికి కొత్త దారులు వెతుకుదాం

   11 hours ago


నిమ్మగడ్డ  ఎపిసోడ్‌లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు

నిమ్మగడ్డ ఎపిసోడ్‌లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు

   12 hours ago


మోడీ సరే.. మరి తెలంగాణ సీఎం వైఖరేంటో?

మోడీ సరే.. మరి తెలంగాణ సీఎం వైఖరేంటో?

   14 hours ago


యడ్డీ మెడపై రెబెల్స్ కత్తి.. వణుకుతున్న బీజేపీ

యడ్డీ మెడపై రెబెల్స్ కత్తి.. వణుకుతున్న బీజేపీ

   14 hours ago


‘‘ఓ తల్లి ఉసురు మీకు తగలక మానదు’’

‘‘ఓ తల్లి ఉసురు మీకు తగలక మానదు’’

   14 hours ago


తండ్రిని మించిన ఫైర్‌బ్రాండ్‌.. తెర‌పైకి జ‌యారెడ్డి

తండ్రిని మించిన ఫైర్‌బ్రాండ్‌.. తెర‌పైకి జ‌యారెడ్డి

   14 hours ago


డాక్టర్ సుధాకర్ కేసులో సీబీఐ ఏం తేల్చబోతోంది?

డాక్టర్ సుధాకర్ కేసులో సీబీఐ ఏం తేల్చబోతోంది?

   30-05-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle