మాస్కులు తప్పనిసరి...గ్రామాలకు కూడా మినహాయింపులేదు: తెలంగాణలో కీలక నిర్ణయాలు
11-04-202011-04-2020 10:25:24 IST
Updated On 11-04-2020 10:30:57 ISTUpdated On 11-04-20202020-04-11T04:55:24.854Z11-04-2020 2020-04-11T04:55:07.554Z - 2020-04-11T05:00:57.541Z - 11-04-2020

కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి ఒక్కరూ ఇళ్ల నుంచి బయటకు వస్తే తప్పనిసరిగా మాస్క్ ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే విధుల్లో ఉన్న ఉద్యోగులందరూ మాస్క్‌లు ధరించాల్సిందేనని స్పష్టం చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఉద్యోగులు కూడా మాస్క్‌లు పెట్టుకోవాల్సిందేనని సూచించింది. కాగా బయట దొరికే మాస్కులతో పాటు ఇళ్లలో తయారు చేసిన మాస్క్‌లను కూడా ధరించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే ఇతరులతో మాట్లాడేటప్పుడు తప్పనిసరిగా మాస్కువేసుకోవాలని తెలిపింది. కాగా ఇప్పటికే ఢిల్లీ, మహారాష్ట్ర, పంజాబ్, ఒడిశా రాష్ట్రాలు మాస్క్‌లు ధరించడం తప్పనిసరి చేశాయి. కొన్ని రాష్ట్రాల్లో మాస్క్‌లు పెట్టుకోకుంటే అరెస్టుతో పాటు జరిమానా కూడా విధిస్తున్నాయి. తాజాగా ఇప్పుడు వాటి జాబితాలో తెలంగాణ కూడా చేరింది. తెలంగాణలో ఇప్పటివరకు 471 కరోనా కేసులు నమోదవ్వగా, మృతుల సంఖ్య 12కు చేరుకుంది. శనివారం ఉదయమే ఖైరతాబాద్ చింతలబస్తీలో గస్తీ తిరుగుతున్న పోలీసులు మాస్కులు లేకుండా బయట తిరుగుతున్న వారిని గద్దించడం కనిపించింది. ఆలాగే ఉదయం 9 గంటలు దాటితే షాపులను మూసివేయాలని ఆదేశిస్తున్నారు. తోపుడు బళ్లను కూడా వీధుల్లో తిరగనీయలేదు. పరిస్థితి చూస్తే కరోనా వైరస్ నియంత్రణ పట్ల తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా ఉన్నట్లు కనపిస్తోంది. జేబుల్లో పర్సు, మొబైల్ ఉందో లేదో చూసుకున్నట్లే ముఖానికి మాస్కు ఉందో లేదో కూడా చూసుకోండి! కాలనీలో దగ్గరే కదా అని నగర వాసులు.. పొలానికే కదా వెళుతోందని గ్రామీణ ప్రజలు ఎవ్వరూ మాస్కులెందుకులే అని నిర్లక్ష్యం చేయొద్దు. ఎందుకంటే కరోనా వైర్‌సను కట్టడి చేయడంలో భాగంగా రాష్ట్ర ప్రజలంతా మాస్కులను ధరించడాన్ని తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎవ్వరైనా ఇళ్ల నుంచి బయటకు వస్తే మాస్కులను కచ్చితంగా ధరించాల్సిందేనని స్పష్టం చేసింది. కొందరిలో కరోనా లక్షణాలు బయటకు కనిపించనప్పటికీ ఫలితాల్లో కరోనా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ జరుగుతోంది. ఇలాంటి వారు మాస్కు లేకుండా బయకు వెళుతుండటంతో ఇతరులకు వైరస్ సోకుతోందని ఇటీవల జపాన్‌లో జరిపిన ఓ అధ్యయనంలో తేలిందని ప్రభుత్వం పేర్కొంది. ఈ కారణంగా వైరస్ చాపకింద నీరులా విస్తరించే ప్రమాదం ఉండటంతో మాస్కుల వినియోగాన్ని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి శుక్రవారం ఉత్తర్వులను జారీ చేశారు. ప్రజలంతా మాస్కులను ధరించేలా జిల్లా కలెక్టర్లు ఆరోగ్య శాఖ అధికారులు తగు చర్యల్ని తీసుకోవాలని ఉత్వర్వుల్లో స్పష్టం చేసింది. అలాగే మాస్కుల ధారణ, తొలగింపు విషయంలో ప్రత్యేకంగా సూచనలు కూడా చేసింది. మాస్కులు ఎలా ధరించాలి: ముక్కు, మూతిని పూర్తిగా కవర్ చేసేలా మాస్కు ధరించాలి. ఉద్యోగస్తులందరూ మాస్కులను ధరించాలి. బయట పనిచేసే ప్రతి వర్కర్ తప్పని సరిగా మాస్కులను ఉపయోగించాలి. గ్రామీణ ప్రాంతాల వారు కూడా బయటకు వస్తే తప్పని సరిగ్గా మాస్కులను ధరించాలి. మాస్కులను తొలగించాక చేతులను శానిటైజర్ లేదా సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. మాస్కును ఒకవైపే వేసుకోవాలి. ఒక్కసారి ఉపయోగించే మాస్కులను ఆరుగంటలకు ఒకసారి కొత్తది వేసుకోవాలి. ఉపయోగించిన మాస్కులను ఎక్కడ పడితే అక్కడ వేయరాదు. మూసి ఉన్న చెత్తడబ్బాల్లోనే వేయాలి. మాస్కు ధరించినంత తర్వాత కూడా సామాజిక దూరాన్ని పాటించాలి. మాస్క్ లేకుంటే నో పెట్రోల్... మరోవైపున కరోనా మహమ్మారి కట్టడికి ఇంటి నుంచి బయటకు వస్తే విధిగా మాస్క్ ధరించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కఠినంగా అమలు చేసేందుకు ఒడిశాలోని పెట్రోల్ బంకులు కీలక నిర్ణయం తీసుకున్నాయి. మాస్క్ ధరించని వారికి వారి వాహనాల్లో పెట్రోల్, డీజిల్, సీఎన్జీ నింపబోమని స్పష్టం చేశాయి. మాస్క్ ధరించిన వారికే ఇంధనం నింపుతామని ఉత్కళ్ పెట్రోలియం డీలర్ల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సంజయ్ లత్ వెల్లడించారు. ఒడిశాలో మొత్తం 1600 పెట్రోల్ అవుట్లెట్లు ఉన్నాయని, ప్రభుత్వ మార్గదర్శకాలను అందరూ అనుసరించాలనే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. పెట్రోల్ పంపుల వద్ద పనిచేసే వేలాది మంది ఉద్యోగులు ఇన్ఫెక్షన్ భయం వెంటాడుతున్నా జీవనాధారం కోసం విధులకు హాజరవుతున్నారని అన్నారు. మాస్క్ వేసుకోవడం ద్వారా కస్టమర్లు, తమ ఉద్యోగులు ఇన్ఫెక్షన్ నుంచి రక్షణ పొందుతారని ఆయన సూచించారు. కాగా, మాస్క్‌లు ధరించని వారికి కిరాణా, కూరగాయల విక్రేతలు సైతం ఎలాంటి వస్తువులను అమ్మడం లేదని అధికారులు పేర్కొన్నారు.

వెంట వెంటనే ఎన్నికలు.. మంచికేనట
12 hours ago

లొంగిపోయిన కూన రవికుమార్
8 hours ago

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు
10 hours ago

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు
13 hours ago

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
15 hours ago

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్
17 hours ago

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం
18 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!
19 hours ago

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?
20 hours ago

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ
21 hours ago
ఇంకా