మావోయిస్టుల కరపత్రాల కలకలం
04-06-202004-06-2020 19:03:16 IST
2020-06-04T13:33:16.560Z04-06-2020 2020-06-04T13:32:59.389Z - - 12-04-2021

గత కొంతకాలంగా మావోయిస్టుల కార్యకలాపాలు తగ్గాయి. కానీ తాజాగా తెలంగాణలో కరపత్రాలు కలకలం రేపుతున్నాయి. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం బుట్టయిగూడెం లో వెలిసిన మావోయిస్టు ల లేఖలు పోలీసులను అలర్ట్ చేశాయి. తెలంగాణ ప్రభుత్వం 15 నుండి 20 ఎకరాల భూమి ఉన్న భూస్వాములకి రైతుబంధు డబ్బులు ఇస్తూ మధ్యతరగతి కుటుంబాలకు పట్టా లేని పేదలకు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని కరపత్రంలో పేర్కొంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజు దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తానని మోసం చేసిన కేసీఆర్ తన ఏడేళ్ళ పాలనలో దళితులను అన్ని రంగాల్లో అణిచి వేశారని లేఖల్లో పేర్కొన్నారు మావోయిస్టులు. రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ నేతలకు ప్రజలే బుద్ది చెపుతారని, పోడుభూమి కొట్టుకున్న రైతులకు పట్టాలు ఇవ్వకుండా మోసం చేస్తుంది ప్రభుత్వం అని మావోయిస్టులు విమర్శించారు. వెంకటాపురం, వాజేడు, ఏటూరునాగారం ,కన్నాయిగూడెం ఏరియా కమిటీ పేరుతో వెలువడ్డ మావోయిస్టుల కర పత్రంలో వుంది. సరిగ్గా రెండునెలల క్రితం మార్చి 7వ తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో మావోయిస్టు కరపత్రాలు వెలిసిన సంగతి తెలిసిందే. ఆదివాసీ విప్లవ సంఘం భద్రాద్రి కొత్తగూడెం, తూర్పు గోదావరి డివిజన్ కమిటీ కార్యదర్శి ఆజాద్ పేరుతో ఉన్న ఆ కరపత్రాల్లో మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని పిలునిచ్చారు. కుల వర్గ, స్ర్తీ పురుష వివక్షలేని, హత్యలు, లైంగిక దాడులు లేని సమసమాజ స్థాపన లక్ష్యంతో పోరాడాలని కోరారు. ఆదివాసీ మహిళలపై పోలీసులు కొనసాగిస్తున్న లైంగికదాడులను ఖండించాలని పేర్కొన్నారు. మరోసారి మావోయిస్టులు కరపత్రాల విడుదలచేయడం కలకలం రేపుతోంది. దీనిపై పోలీసులు నిఘా ఏర్పాటుచేసినట్టు తెలుస్తోంది.

జగన్ తిరుపతి పర్యటన రద్దు.. అచ్చెన్నాయుడు సెటైర్లు..!
5 hours ago

షర్మిల దీక్షలతో ఏం ఒరుగుతుంది
9 hours ago

కన్నుమూసిన హిందూపురం మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి
12 hours ago

వాలంటీర్లపై పాత ప్రేమే కొత్తగా చూపించిన జగన్
2 hours ago

బెంగాల్ ఎన్నికల్లో హింస.. కాల్పుల్లో ఐదుగురి మృతి
12 hours ago

జనం ప్రేమ కాదు.. జడ్జిల దయతోనే జగన్ సీఎం అట
10 hours ago

పవన్ కి చంద్రబాబు సపోర్ట్
12 hours ago

కొత్తగా సెకండ్ డోస్ భయం.. తూర్పుకి తిరిగి దండం పెట్టాలా
13 hours ago

దేవినేని ఉమ.. చిక్కుల్లో పడ్డట్టేనా..?
7 hours ago

రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ ఈ తన్నుడు కామెంట్లు ఏంటో..?
15 hours ago
ఇంకా