మార్చి 31 వరకూ తెలంగాణ లాక్ డౌన్
22-03-202022-03-2020 19:06:14 IST
Updated On 22-03-2020 19:10:31 ISTUpdated On 22-03-20202020-03-22T13:36:14.574Z22-03-2020 2020-03-22T13:35:43.560Z - 2020-03-22T13:40:31.233Z - 22-03-2020

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో సీఎం కేసీయార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మార్చి 31వ తేదీ వరకూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ చేస్తున్నట్లు చెప్పారు సీఎం కేసీఆర్. ఈ రోజు చూపించిన పట్టుదల ఈ నెల 31వ తేదీ వరకూ చూపించాలని ఆయన అన్నారు. జనతా కర్ఫ్యూని విజయవంతం చేసి ప్రజలకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల నుంచి మంచి అద్భుత స్పందన వచ్చిందన వచ్చిందన్నారు. ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారని చప్పట్లతో మనకు సేవచేస్తున్నవారికి సంఘీభావం తెలిపి గొప్ప పరిణతి సాధించారన్నారు. రాష్ట్రంలో కొత్తగా ఐదు పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, ఇప్పటివరకు 26 పాజిటివ్ కేసులు నమోదయినట్టు కేసీయార్ తెలిపారు. అయితే వీరు విదేశీయులని పేర్కొన్నారు. దీంతో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఈ రోజు ఏవిధంగా బాధ్యతాయుధంగా కర్ఫ్యూని పాటించారో.. మార్చి 31వ తేదీ వరకూ ఈ విధంగానే ఇంట్లో ఉండాలని కోరారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అన్ని నిత్యావసర సరుకులు మాత్రం అందుబాటులో ఉంటాయన్నారు. అలాగే రేషన్ సరుకులు, మెడిసిన్, కూరగాయలు, పాలు లభ్యమవుతాయన్నారు. మన స్వీయ నియంత్రణే మనకు శ్రీరామ రక్ష అన్నారు కేసీఆర్. ప్రతి రేషన్ కార్డుకి 12 కిలోల బియ్యం, రూ.1500 నగదు అందిస్తామన్నారు కేసీయార్. అత్యవసర ప్రభుత్వ ఉద్యోగులు తప్ప.. మిగతా ప్రభుత్వం ఉద్యోగులు ఇంట్లోనే వర్క్ చేసుకోవచ్చని చెప్పారు. అలాగే లేబర్స్ని కూడా ప్రత్యేకంగా గుర్తించి ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందిస్తామన్నారు.ఆర్టీసీ బస్సులు, ప్రజా రవాణాను అనుమతించమని, కూరగాయల కోసం జనం బయటకు రావాలన్నారు.

వెంట వెంటనే ఎన్నికలు.. మంచికేనట
11 hours ago

లొంగిపోయిన కూన రవికుమార్
7 hours ago

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు
9 hours ago

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు
12 hours ago

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
14 hours ago

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్
16 hours ago

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం
17 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!
18 hours ago

భద్రలోక్పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?
19 hours ago

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ
20 hours ago
ఇంకా