newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మార్క్ ఫెడ్ నిర్లక్ష్యం ..కందుల రైతుల ఇబ్బందులు

28-02-202028-02-2020 08:13:48 IST
Updated On 28-02-2020 08:13:28 ISTUpdated On 28-02-20202020-02-28T02:43:48.769Z28-02-2020 2020-02-28T02:42:44.913Z - 2020-02-28T02:43:28.150Z - 28-02-2020

 మార్క్ ఫెడ్ నిర్లక్ష్యం ..కందుల రైతుల ఇబ్బందులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో పసుపు రైతులకు తోడు కందులు పండించే రైతుల ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. సరైన గిట్టుబాటు ధర లేక వారు నానా ఇబ్బందులు పడుతున్నారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో  మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో  ఏర్పాటు చేసిన కందుల  కొనుగోలు కేంద్రంలో తేమ శాతం పేరుతో అధికారులు కందుల కొనుగోలు నిలిపివేశారు.  దీంతో రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. 

రైతుల సహకార సంఘం అధికారులను నిర్బంధించడంతో పాటు పిట్లం మార్కెట్ యార్డ్ ఎదుట 161 జాతీయ రహదారిపై రాస్తారోకోకు దిగారు.  ముందు తేమ శాతం ఎలా ఉన్న కొనుగోలు చేసిన అధికారులు ఇప్పుడు ఎందుకు కొర్రీలు పెడుతున్నారని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు కందుల రైతులు.

దీంతో పోలీసులు, రెవిన్యూ అధికారులు ఘటన స్థలికి చేరుకొని సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. జుక్కల్ నియోజకవర్గంలో రైతులు రబీ కింద కంది పంటను సాగు చేయగా, ప్రస్తుతం ఆ పంట చేతికి వచ్చింది.  రైతులు పండించిన కందులను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం జుక్కల్, మద్నూర్, బిచ్కుంద, పిట్లం మండల కేంద్రాలలో మార్కుఫెడ్ ఆధ్వర్యంలో కందుల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి క్వింటాలు మద్దతు ధర 5800 రూపాయలుగా ప్రకటించింది. 

దీంతో రైతులు తాము పండించిన కందులను  ఈ కేంద్రాలకు తీసుకువచ్చి అమ్ముకుంటున్నారు.  రెండురోజుల క్రితం  ఈ కొనుగోలు కేంద్రాలలో తేమ శాతం సరిగ్గా లేదని అధికారులు కొనుగోలు నిలిపివేశారు.  గతంలో తేమశాతం పట్టించుకోకుండా రైతులు తెచ్చిన కందులను కొనుగోలు చేసిన అధికారులు ఇప్పుడు ఎందుకు కొనడం లేదని అధికారులతో గొడవకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. 

బుధవారం కొనుగోలు చేసిన అధికారులు పిట్లం మండల కేంద్రంలో గురువారం కూడా కందులు తేమ శాతం సరిగ్గా లేదని కొనుగోలు నిలిపివేశారు. అధికారుల తీరుపై మండిపడుతున్న రైతులు పిట్లం మార్కెట్ యార్డులో ఆందోళనకు దిగడంతో రెవిన్యూ, పోలీస్ అధికారులు మార్కెట్ యార్డుకు వచ్చి రైతులతో మాట్లాడారు. తేమ శాతం చూడకుండా కొనుగోలు చేయిస్తామని, ఒక వేల మార్క్ ఫెడ్ నుండి తేమ శాతం సరిగ్గా లేదని కందులు వెనక్కి వస్తే తరుగు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. దీంతో రైతులు శాంతించారు. 

ఇటు జగిత్యాల జిల్లా కోరుట్లలోనూ కందుల కొనుగోళ్లు నిలిపివేశారు అధికారులు. పంట కొనుగోళ్లు నిలిచిపోవడంతో…కోరుట్ల మార్కెట్ యార్డు కందులతో నిండిపోయింది. వ్యవసాయ మార్కెట్ కు పంట అమ్మకానికి తీసుకొచ్చినా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల తీరుతో కుటుంబాలను వదిలి మార్కెట్లోనే గడపాల్సి వస్తోందన్నారు. మొత్తం మీద రైతుల ఇబ్బందులను మార్క్ ఫెడ్ అధికారులు ఎలా తొలగిస్తారో చూడాలి. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle