newssting
BITING NEWS :
* భారత్ లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు 1, 45, 380.. మరణాలు 4167*ఏపీలో 2719 మృతులు 57, తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1920 * కరోనా వైరస్ మహమ్మారిపై పోరులో భారత్ కు చైనా సహకారం యథాతథం * మహారాష్ట్రలో 1695 కోవిడ్ మరణాలు.. కేసులు 17,082*భారత్ లో వారం రోజుల్లో 45 వేల కేసులు *ఏపీలో భారీగా పట్టుబడుతున్న తెలంగాణా మద్యం*హైకోర్టుకు చేరిన ఏపీ వికేంద్రీకరణ, సీఆర్డీఏ సవరణ బిల్లు వ్యవహారం*సిద్దిపేట:కొండపోచమ్మ సాగర్‌ ప్రారంభోత్సవం ముహూర్తం ఖరారు..ఈనెల 29న ఉ. 11:30 గంటలకు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ *జార్ఖండ్ లో ఘోర ప్రమాదం ఐదుగురి మృతి

మారుతీరావ్ ఆత్మహత్య వెనుక మిస్టరీ?

09-03-202009-03-2020 09:04:04 IST
2020-03-09T03:34:04.312Z09-03-2020 2020-03-09T03:33:51.964Z - - 27-05-2020

మారుతీరావ్ ఆత్మహత్య వెనుక మిస్టరీ?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మిర్యాలగూడలో ప్రణయ్ హత్యలో ప్రధాన నిందితుడైన మారుతీరావు ఆత్మహత్య సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. మారుతీరావు ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరాతీస్తున్నారు.మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నాడని టీవీలో చూసే తెలుసుకున్నాం.. మరణవార్త అఫిషియల్‌గా మాకు సమాచారం లేదు.. ప్రణయ్ హత్య నాటి నుంచి నాన్న నాకు టచ్‌లో లేడు..ప్రణయ్‌ని చంపిన పశ్చాత్తాపంతో ఆత్మహత్య చేసుకుని ఉంటారు. మారుతీరావు ఆత్మహత్య చేసుకునే ముందు సూసైట్ నోట్ రాసినట్లు పోలీసులు గుర్తించారు. ‘తల్లీ అమృత అమ్మ దగ్గరికి వెళ్ళిపో....’ అని సూసైడ్ నోట్‌లో రాసి ఉన్నట్లు తెలిసింది. ఈ ఒక్క విషయమే కాదు.. అమృత గురించి ఇంకా చాలా విషయాలు ప్రస్తావించినట్లు సమాచారం. అయితే పోలీసులు మాత్రం ఆ నోట్‌ను బయటపెట్టకుండా గోప్యంగా ఉంచుతున్నారు.

ఈ ఆత్మహత్యపై ఇప్పుడే ఏం మాట్లాడలేనని అమృత పేర్కొన్న సంగతి తెలిసిందే. ‘నాన్న ఆత్మహత్యపై నాకు క్లారిటీ లేదు. ఆత్మహత్య వ్యవహారంలో నిజానిజాలేంటి అనేది తెలియాల్సి ఉంది. అసలు ఎలా జరిగిందో తెలియదు. ఇప్పుడే ఏమీ స్పందించలేను. అన్ని వివరాలు తెలిసాక స్పందిస్తాను’ అని అమృత మీడియాకు వెల్లడించింది. మరోవైపు మారుతీరావు మృతదేహం మిర్యాలగూడకు చేరుకుంది.

పోలీసుల భద్రతల మధ్య మారుతీరావు మృతదేహాన్ని  మిర్యాలగూడలోని నివాసానికి  తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో ఎలాంటి ఘటనలు జరుగకుండా మారుతీరావు, అమృత ఇంటి వద్ద పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు మారుతీరావు ఆత్మహత్య ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 

మారుతీరావు మానసిక సంఘర్షణ వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్టు భావిస్తున్నారు. ఖైరతాబాద్‌లోని ఆర్యవైశ్యభవన్‌లో రూం అద్దెకు తీసుకున్న మారుతీరావు తనతో తెచ్చుకున్న పురుగుల మందు సేవించడం, వాంతి చేసుకోవడం, మందుల చీటీ వంటి అంశాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్రణయ్ హత్యకు సంబంధించి ఏడునెలలు జైలులో వున్న మారుతీరావు  తన కూతురు అమృతను ఇంటికి పిలిపించుకునే ప్రయత్నం చేశాడు. 

అయితే అమృత అంగీకరించకపోవడమే కాదు పోలీసులకు కూడా ఫిర్యాదుచేయడం మారుతీరావుని బాధించిందని అంటున్నారు. పోలీసులు కేసు నమో దు చేసి రెండోసారి అతడిని అరెస్టు చేశారు. ఈ కేసులో సైతం మారుతీరావు 20రోజులు జైలులో ఉండి బెయిల్‌పై విడుదలయి వచ్చాడు. ప్రణయ్‌ హత్య తరువాత కూతురితోపాటు దగ్గరి బంధువులు కూడా తనతో సరిగ్గా ఉండటం లేదనే ఆవేదనతో తీవ్ర ఒత్తిడికి గురయి వుంటాడని అంటున్నారు.

హత్యకేసులో ప్రధాన నిందితుడిగా మారుతీరావు ఉండగా.. సుభాష్‌శర్మ, హజ్గర్‌ అలీ, మహ్మద్‌బారీ, కరీం, శ్రవణ్‌, శివ నిందితులుగా ఉన్నారు. వీరిలో ఒకరిద్దరు మారుతీరావును బెదిరించి, ఒప్పందం ప్రకారం డబ్బులు ఇవ్వకపోతే పోలీసులకు అప్రూవర్లుగా మారుతామని బెదిరించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఆందోళనకు గురైన మారుతీరావు ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఉస్మానియా ఫోరెన్సిక్‌ వైద్యులు డాక్టర్‌ సుధాకర్‌ నేతృత్వంలోని వైద్యుల బృందం మారుతీరావు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించింది. అనంతరం ఆయన మృతదేహాన్ని భార్య గిరిజ, సోదరుడు శ్రావణ్‌కు అప్పగించారు. మారుతీరావు అంత్యక్రియలను మిర్యాలగూడలో నిర్వహిస్తారు. 

మరోవైపు తమ కుటుంబాన్ని వదిలేయండని మారుతీరావు భార్య మీడియాపై అసహనం వ్యక్తం చేశారు. ఇటు కూతురికి అన్యాయం చేసి, కేసుల మీద కేసులు మారుతీరావుని బలవన్మరణానికి పాల్పడి ఉండవచ్చంటున్నారు. అయితే ఆత్మహత్య విషయంలో పోెలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

ఏపీలో మాల్స్, జ్యూయలరీ, ఫుడ్ టేక్ అవేలకు అనుమతి

ఏపీలో మాల్స్, జ్యూయలరీ, ఫుడ్ టేక్ అవేలకు అనుమతి

   23 minutes ago


రమణదీక్షితులు సంచలన వ్యాఖ్యలు

రమణదీక్షితులు సంచలన వ్యాఖ్యలు

   an hour ago


ఆన్ లైన్లో మహానాడు.. జూమ్ యాప్ ద్వారా 14వేలమందికి అవకాశం

ఆన్ లైన్లో మహానాడు.. జూమ్ యాప్ ద్వారా 14వేలమందికి అవకాశం

   an hour ago


కరువు సీమకు నీటిని ఇస్తామంటే ఇంతవివాదమా.. జగన్ ప్రశ్న

కరువు సీమకు నీటిని ఇస్తామంటే ఇంతవివాదమా.. జగన్ ప్రశ్న

   an hour ago


లాక్ డౌన్‌పై కేసీయార్ కీలక నిర్ణయం

లాక్ డౌన్‌పై కేసీయార్ కీలక నిర్ణయం

   2 hours ago


కన్నాపై మంత్రి వెల్లంపల్లి హాట్ కామెంట్స్

కన్నాపై మంత్రి వెల్లంపల్లి హాట్ కామెంట్స్

   2 hours ago


ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై బండి సంజ‌య్ ఆశ‌లు నెర‌వేరేనా..?

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై బండి సంజ‌య్ ఆశ‌లు నెర‌వేరేనా..?

   2 hours ago


హైకోర్టు ఆగ్రహం.. 49 మంది వైసీపీ నేతలకు నోటీసులు!

హైకోర్టు ఆగ్రహం.. 49 మంది వైసీపీ నేతలకు నోటీసులు!

   4 hours ago


తెలంగాణలో వైరస్ ఉధృతి.. టెస్టులు తక్కువ.. కేసులు ఎక్కువ!

తెలంగాణలో వైరస్ ఉధృతి.. టెస్టులు తక్కువ.. కేసులు ఎక్కువ!

   4 hours ago


ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

   17 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle