newssting
BITING NEWS :
*భారత్ లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటన.. భారీ భద్రతా ఏర్పాట్లు *చిత్తూరు జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల కలకలం..శ్రీ చౌడేశ్వరి ఆలయం వెనకాల ప్రాంతంలో తవ్వకాలు *ఆదిలాబాద్‌ గుడిహత్నూర్‌లో దారుణం....బాలికపై ఇద్దరు కామాంధుల అత్యాచారం* చైనాలో కొనసాగుతున్న కరోనా మరణమృదంగం....ఇప్పటివరకు 2వేల 460కి చేరిన కొవిడ్-19 మృతుల సంఖ్య*ఒడిశా : పూరీ జిల్లా పిప్పిలి ప్రాంతంలో ఏనుగుల బీభత్సం...ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి.., ఐదుగురికి గాయాలు *గుజరాత్‌లోని వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం..ట్రక్కు- టెంపో ఢీ, 11మంది మృతి *68వ రోజు కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళన... హైకోర్టు ఆదేశాలతో తుళ్లూరులో ఎంక్వైరీ చేపట్టిన పోలీసులు* ఢిల్లీలోని జఫ్రాబాద్ మెట్రో స్టేషన్‌లో సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలు..భారీగా తరలివచ్చిన మహిళలు*తిరుమలలో మరోసారి ప్రత్యక్షమైన బంగారు బల్లి.. చూసేందుకు బారులు తీరిన భక్తులు....శిలాతోరణం చక్రతీర్థంలో బంగారు బల్లి ప్రత్యక్షం

మానవహక్కుల సంఘానికి పోలీసుల నివేదిక

10-12-201910-12-2019 12:52:07 IST
Updated On 10-12-2019 15:28:52 ISTUpdated On 10-12-20192019-12-10T07:22:07.466Z10-12-2019 2019-12-10T07:22:00.444Z - 2019-12-10T09:58:52.208Z - 10-12-2019

మానవహక్కుల సంఘానికి పోలీసుల నివేదిక
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సంచలనం కలిగించిన దిశ అత్యాచారం, సజీవ దహనం కేసులో నిందితుల ప్రమేయం గురించిన సాక్ష్యాలను జాతీయ మానవహక్కుల సంఘానికి సైబరాబాద్ పోలీసులు నివేదిక అందచేశారు. 

దిశ కేసులోని నిందితుల ఎన్‌కౌంటర్‌ ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్సీ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎన్ కౌంటర్ పై దిశ తల్లిదండ్రులతో పాటు నిందితుల తల్లిదండులు, ఘటనలో గాయపడిన అధికారుల వాంగ్మూలాలు సేకరించింది ఎన్‌హెచ్‌ఆర్సీ.

దిశ కేసులో నిందితుల ప్రమేయానికి సంబంధించి జాతీయ మానవ హక్కుల కమిషన్‌ ప్రతినిధుల బృందానికి సైబరాబాద్‌ పోలీసులు మంగళవారం కీలక సాక్ష్యాలు అందజేశారు. 

ఎన్‌కౌంటర్‌ ఘటనలో చనిపోయిన నిందితులే దిశపై అత్యాచారం జరిపి.. హత్య చేసినట్టు రుజువు చేసే ఫోరెన్సిక్‌ ఆధారాలతో కూడిన నివేదిక అందచేసినట్టు తెలుస్తోంది. దిశ కిడ్నాప్, అత్యాచారం, హత్య, మృతదేహం కాల్చివేత తదితర పరిణామాలు... అలాగే ఈ కేసు దర్యాప్తులో సేకరించిన ఆధారాలను ఈ నివేదికలో ఉంచారు.

ఈ కేసులో అత్యంత కీలకమైన శాస్త్రీయ ఆధారాలు కూడా ఎన్‌హెచ్చ్‌ఆర్సీకి అందజేశారు. సంఘటనాస్థలంలో దొరికిన రక్తం మరకలను, లారీ క్యాబిన్‌లో దొరికిన రక్తం మరకలకు సంబంధించిన డీఎన్‌ఏ రిపోర్ట్‌, ఘటనా స్థలంలో నిందితుల లారీ సంచరించిన సీసీటీవీ ఫుటేజీ ఆధారాలు ఎన్‌హెచ్‌ఆర్సీకి పోలీసులు అందజేశారు. గాయపడ్డ పోలీసుల నుంచి సేకరించిన సమాచారం హక్కుల కమిషన్ కి అందింది. దీనిపై హక్కుల కమిషన్ ఎలా స్పందిస్తుందో చూడాలి.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle