మాట వినకుంటే... షూట్ ఎట్ సైట్ ఆర్డర్సే
24-03-202024-03-2020 19:39:17 IST
Updated On 24-03-2020 21:21:38 ISTUpdated On 24-03-20202020-03-24T14:09:17.640Z24-03-2020 2020-03-24T14:08:57.939Z - 2020-03-24T15:51:38.310Z - 24-03-2020

కరోనాను కట్టడి చేసే దిశలో ప్రస్తుతం దేశంలో అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ ను పాటిస్తున్నాయి. ఉదయం నుంచి దాదాపుగా ఎవరూ బయటకు రావడం లేదు. అయితే, కొంతమంది ఆకతాయిలు బయటకు వస్తున్నారు. 60 శాతం వరకు అత్యవసర వ్యక్తులు మాత్రమే వస్తుంటే 40 శాతం మంది యువత బయటకు వస్తున్నారు. ఇవాళ కూడా ఆకతాయిలు బయటకు వస్తుండటంతో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. మీవల్ల ఇతరులు ఇబ్బందులు పడితే చూస్తూ ఊరుకోబోమని, చట్టం ప్రకారం కఠినంగా వ్యవహరించడం తప్పదన్నారు సీఏం కేసీయార్. తెలంగాణ సీఎం కేసీయార్ ఆగ్రహానికి గురయ్యారు. కరోనా వ్యాధి వీరవిహారం చేస్తున్న నేపథ్యంలో లాక్ డౌన్ ఆదేశాలు ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. అవసరమయితే ఆర్మీ ని దింపడం తప్పదు..సాటి మనుషులకు, సమాజానికి ఇబ్బందులు వచ్చేలా ప్రవర్తిస్తే వారికి ఉన్న అన్నీ లైసెన్సులు రద్దు చేయబడతాయి. హోమ్ క్వారంటైన్ లో ఉన్న వారి పాస్ పోర్టులు కలెక్టరేట్ లో ఉంచాలన్నారు. ప్రజాస్వామ్య దేశం కాబట్టి స్మూత్ గా చెప్తున్నాం...మాట వినకపోతే కఠినంగా వ్యవహరించక తప్పదన్నారు. రాష్ట్రాన్ని రక్షించుకునే దిశలో ఏ నిర్ణయం అయినా తీసుకునే పరిస్థితి వస్తుందన్నారు. మాట వినకపోతే 24 గంటల కర్ఫ్యూ తప్పదన్నారు. ఆర్మీని దించే పరిస్థితి రాకూడదన్నారు. మరోవైపు భారత్ లో 519కి చేరాయి కరోనా పాజిటివ్ కేసులు. మీడియా, సోషల్ మీడియా కరోనాపై అవగాహన పెంచాలన్నారు. అధికారులంతా రోడ్డుమీద ఉన్నారని, అయితే కార్పోరేటర్లు ఏం చేస్తున్నారని సీఎం కేసీయార్ మండిపడ్డారు. పోలీసులతో పాటు ప్రజాప్రతినిధులు కూాడా రోడ్డుమీదకు రావాలన్నారు. ఈ ఆపద సమయంలో ప్రజలతో వుండాలన్నారు. మీడియా పట్ల దురుసుగా వ్యవహరించవద్దని, మీడియాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామన్నారు సీఎం కేసీయార్.

జగన్ తిరుపతి పర్యటన రద్దు.. అచ్చెన్నాయుడు సెటైర్లు..!
9 hours ago

షర్మిల దీక్షలతో ఏం ఒరుగుతుంది
13 hours ago

కన్నుమూసిన హిందూపురం మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి
16 hours ago

వాలంటీర్లపై పాత ప్రేమే కొత్తగా చూపించిన జగన్
6 hours ago

బెంగాల్ ఎన్నికల్లో హింస.. కాల్పుల్లో ఐదుగురి మృతి
16 hours ago

జనం ప్రేమ కాదు.. జడ్జిల దయతోనే జగన్ సీఎం అట
14 hours ago

పవన్ కి చంద్రబాబు సపోర్ట్
16 hours ago

కొత్తగా సెకండ్ డోస్ భయం.. తూర్పుకి తిరిగి దండం పెట్టాలా
17 hours ago

దేవినేని ఉమ.. చిక్కుల్లో పడ్డట్టేనా..?
11 hours ago

రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ ఈ తన్నుడు కామెంట్లు ఏంటో..?
19 hours ago
ఇంకా