మాట నిలుపుకున్న కేటీయార్..‘గిఫ్ట్ ఏ స్మైల్’ అంబులెన్సులు
30-07-202030-07-2020 14:24:17 IST
Updated On 30-07-2020 15:06:43 ISTUpdated On 30-07-20202020-07-30T08:54:17.474Z30-07-2020 2020-07-30T08:53:38.333Z - 2020-07-30T09:36:43.976Z - 30-07-2020

తెలంగాణ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నారు మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీయార్. నిత్యం ఏదో అధికారిక కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈమధ్యే బర్త్ డే జరుపుకున్న కేటీయార్ ... తన అభిమానులకు మంచి సందేశం ఇచ్చారు. ఫ్లెక్సీలు, బొకేలు వద్దని, దానికి బదులు సమాజానికి ఉపయోగపడేవి చేయమని కోరారు. దీంతో గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది.

మంత్రి కేటీఆర్ పిలుపునకు స్పందించి పార్టీ నేతలు దాదాపు వంద అంబులెన్సులను ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం ఎందరో పేదల జీవితాల్లో వెలుగు నింపుతున్నదని పలువురు ప్రజాప్రతినిధులు అభినందించారు. కేటీఆర్ తన జన్మదినం సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపిన ఆరు కొవిడ్ రెస్పాన్స్ అంబులెన్సులను గురువారం ఉదయం ప్రారంభించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, మంత్రి కేటీఆర్ ఈ అంబులెన్స్‌లను జెండా ఊపి ప్రారంభించారు.మాట నిలబెట్టుకున్న కేటీయార్ పై ప్రశంసలు కురుస్తున్నాయి.
ప్రగతి భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు కేటీఆర్ సతీమణి శైలిమ, కూతురు అలేఖ్య పాల్గొన్నారు. ఇప్పటికే మంత్రి కేటీఆర్ స్ఫూర్తితో పలువురు అంబులెన్సులు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. త్వరలోనే వాటన్నింటినీ కూడా ప్రారంభిస్తామని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ సందర్భంగా కేటీఆర్ కి తెలిపారు. ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల నేపథ్యంలో కోవిడ్ రెస్పాన్స్ వాహనాలుగా పనిచేస్తాయన్నారు. కోవిడ్ సంక్షోభ సమయంలో ఈ అంబులెన్స్ లను ఇవ్వడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే
5 hours ago

పీకేకి ఏమైంది.. మమతాను కావాలనే దెబ్బ కొట్టాడా
2 hours ago

కేసీఆర్ కు సాగర్ భయం.. రెండోసారీ హాలియాలో సభ
4 hours ago

ఆశగా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడర్లు
8 hours ago

దొరపై జెండా ఎగరేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం
11 hours ago

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!
12 hours ago

షర్మిల మాటలతో చాలా క్లారిటీస్
09-04-2021

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వచ్చింది రెండువేలేనా
09-04-2021

పేర్ని నాని పవన్ ఫ్యానా.. వకీల్ సాబ్ కి ఫుల్ ప్రమోషన్
a day ago

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత
09-04-2021
ఇంకా