newssting
BITING NEWS :
*అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పర్యటన.. ఘనంగా స్వాగతం..సబర్మతి ఆశ్రమంలో మహాత్మాగాంధీ వినియోగించిన చరఖా తిప్పిన ట్రంప్ పంపతులు *సబర్మతి ఆశ్రమంలో ట్రంప్ దంపతులు... గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ట్రంప్, మోడీ *నేడు విజయనగరం జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన.. జగనన్న వసతి దీవేన కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం*సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు బాంబు బెదిరింపు.. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల తనిఖీలు.. ప్లాట్ ఫామ్‌లతో పాటు రైళ్లలోనూ క్షుణ్ణంగా తనిఖీ, పేలుడు పదార్థాలు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు *చిత్తూరు జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల కలకలం..శ్రీ చౌడేశ్వరి ఆలయం వెనకాల ప్రాంతంలో తవ్వకాలు *ఆదిలాబాద్‌ గుడిహత్నూర్‌లో దారుణం....బాలికపై ఇద్దరు కామాంధుల అత్యాచారం* చైనాలో కొనసాగుతున్న కరోనా మరణమృదంగం....ఇప్పటివరకు 2వేల 460కి చేరిన కొవిడ్-19 మృతుల సంఖ్య*ఒడిశా : పూరీ జిల్లా పిప్పిలి ప్రాంతంలో ఏనుగుల బీభత్సం...ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి.., ఐదుగురికి గాయాలు *గుజరాత్‌లోని వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం..ట్రక్కు- టెంపో ఢీ, 11మంది మృతి *68వ రోజు కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళన

మాటల వేడి.. బీజేపీ ఎంపీ వర్సెస్ టీఆర్ఎస్ మంత్రి

30-01-202030-01-2020 08:32:14 IST
Updated On 30-01-2020 11:42:28 ISTUpdated On 30-01-20202020-01-30T03:02:14.052Z30-01-2020 2020-01-30T03:01:54.620Z - 2020-01-30T06:12:28.796Z - 30-01-2020

మాటల వేడి.. బీజేపీ ఎంపీ వర్సెస్ టీఆర్ఎస్ మంత్రి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ రాజకీయాల్లో దూసుకుపోవాలని తెగ తాపత్రయపడుతోంది బీజేపీ. నలుగురు ఎంపీలను గెలుచుకున్న ఆనందంతో మునిసిపల్ ఎన్నికల్లో పోటీచేసినా ఆశించిన ఫలితాలు లభించలేదు. దీంతో మాటల వేడి పెంచేస్తున్నారు బీజేపీ నేతలు. తాజాగా ఆదిలాబాద్ జిల్లా నాగోబా ప్రజాదర్బార్ మాటల మంటలతో వేడెక్కింది. ఆదిలాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీ సోయం బాపూరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో వాతావరణం వేడెక్కింది.

బీజేపీ ఎంపీ తీరుపై టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. తెలంగాణలో ఆదివాసీలను నాశనం చేసేందుకు ఫారెస్టు అధికారులు కుట్ర చేస్తున్నారంటూ బాపూరావు ఆగ్రహంతో ఊగిపోయారు. ఆదివాసీల మీద కేసులు పెడితే మంచిది కాదన్నారు ఎంపీ బాపూరావు.

ఒకవేళ ఆదివాసీలు తిరగబడితే ఫారెస్టు అధికారులు విధినిర్వహణకు వెళ్ళగలరా అని ప్రశ్నించారు ఎంపీ. అటవీశాఖ అధికారులపై ఆగ్రహంతో రెచ్చిపోయిన ఆయన ‘‘తిరగబడితేనే భూములుంటాయి.. పట్టాలుంటాయి లేదంటే భూములండవు…అందుకే తిరగబడండి..’’ అంటూ ఆదివాసీలకు పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది.

ఇదిలా ఉంటే.. ఎంపీ బాపూరావుని చల్లబరిచే ప్రయత్నం చేశారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. ఆయం అభివృద్ధికి ఏంచేశారో చెప్పాలని, ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఎంపీ డిమాండ్ చేశారు. ఎస్టీ జాబితా నుంచి ఎప్పటికైనా లంబాడాలను తొలగించి తీరతామని అంతా ఐక్యంగా ఉండాలన్నారు. కేంద్రం నుంచి వచ్చే నక్సల్ ప్రభావిత ప్రాంతాలకు వచ్చే నిధులను ఆదిలాబాద్ జిల్లాలో వినియోగించాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని ఎంపీ కోరారు.

ఎంపీ కామెంట్లకు స్పందించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నాగోబా దేవాలయ నిర్మాణానికి కావాల్సిన నిధులన్నీ ఇస్తామన్నారు. అయితే నిర్మాణాలకు ఐదు కోట్ల రూపాయలు కేటాయించినా టెండర్లకు స్పందన రాలేదన్నారు. ఆదివాసీల పోడు భూముల జోలికి ప్రభుత్వం వెళ్ళదన్నారు. అడవులు అంతరించిపోకుండా చూడాలని మొక్కలు నాటాలన్నారు మంత్రి. ఇటీవల ఎంపీ బాపూరావు తనపై కుట్ర జరుగుతోందని, ఆదివాసీలు అండగా ఉంటే తనకేం కాదన్నారు. కేంద్రంతో పోరాడైనా లంబాడాలను ఎస్టీ జాబితానుంచి తొలగించేలా చేస్తానన్నారు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle