newssting
BITING NEWS :
*గుజరాత్‌: సూరత్‌లో దారుణం.. కార్పొరేషన్ ట్రైనీ ఉద్యోగినులను గుంపులో నగ్నంగా నిలబెట్టి ఫిట్‌నెస్ పరీక్ష *నేడు తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల... ఈ నెల 25న డైరెక్టర్ పదవులకు నామినేషన్లు, 29న ఛైర్మన్, ఉపాధ్యక్ష ఎన్నికలు *అమరావతి: వైఎస్ జగన్‌ సర్కార్‌ మరో కీలక నిర్ణయం.. గత ప్రభుత్వ అక్రమాలపై విచారణకు సిట్ ఏర్పాటు.. ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామ్‌రెడ్డి నేతృత్వంలో 10 మంది సభ్యులతో సిట్ *హైదరాబాద్: బంజారాహిల్స్ లో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు.. విదేశీయుల హల్చల్, పోలీసులతో వాగ్వాదం.. పాస్ పోర్టు, వీసా పత్రాలు చూపకపోవడంతో పోలీసులకు అప్పగింత *అమరావతి: నేడు 29 గ్రామాల్లో బంద్‌కు పిలుపునిచ్చిన రైతుల జేఏసీ.. మందడంలో పోలీసుల లాఠీఛార్జ్‌కి నిరసనగా బంద్, విద్యా, వ్యాపార సంస్థలను బంద్‌ పాటించాలని కోరిన జేఏసీ

మాజీ మంత్రుల‌ను మ‌రిచిపోయిన‌ట్లేనా..?

02-11-201902-11-2019 08:17:50 IST
Updated On 02-11-2019 17:48:17 ISTUpdated On 02-11-20192019-11-02T02:47:50.222Z02-11-2019 2019-11-02T02:46:08.902Z - 2019-11-02T12:18:17.058Z - 02-11-2019

మాజీ మంత్రుల‌ను మ‌రిచిపోయిన‌ట్లేనా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ‌లో రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వ‌చ్చాక కొంద‌రికి రాజ‌కీయంగా క‌లిసిరాగా మ‌రికొందరు మాత్రం కనిపించ‌కుండా పోయారు. గ‌త క్యాబినెట్‌లో మంత్రులుగా చ‌క్రం తిప్పిన వారు ఇప్పుడు తెర‌మ‌రుగ‌య్యారు. దీంతో త‌మ నాయ‌కుడు కేసీఆర్ త‌మ‌ను గుర్తిస్తార‌ని, మ‌ళ్లీ పున‌ర్వైభ‌వం వ‌స్తుంద‌ని ఆశ‌గా ఎదురు చూస్తున్నారు.

మొద‌టిసారి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ముఖ్య‌మంత్రి కేసీఆర్ సీనియ‌ర్లు, త‌న‌కు స‌న్నిహితుల‌కు క్యాబినెట్‌లో పెద్ద‌పీట వేశారు. ఈ నేప‌థ్యంలో నాయిని నర్సింహ్మారెడ్డి, క‌డియం శ్రీహ‌రి, తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు, ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డి, జూప‌ల్లి కృష్ణారావుకు మంత్రి ప‌ద‌వులు ద‌క్కాయి.

నాయిని, క‌డియం, తుమ్మ‌ల‌ను ఎమ్మెల్సీలు చేసి మ‌రీ మంత్రి ప‌ద‌వులు ఇచ్చారు కేసీఆర్‌. ఐదేళ్ల పాటు మంత్రులుగా వారి జిల్లాల్లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. అయితే, 2018 అసెంబ్లీ ఎన్నిక‌ల త‌ర్వాత వీరు రాజ‌కీయంగా తెర‌మ‌రుగ‌య్యారు. గ‌తంలో జిల్లా మొత్తం శాసించిన వీరు ఇప్పుడు నియోజ‌క‌వ‌ర్గానికే ప‌రిమితం అయ్యారు. పాలేరులో కందాళ ఉపేంద‌ర్ రెడ్డిపైన తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు ఓడిపోయిన నాటి నుంచి ఆయ‌న సైలెంట్ అయ్యారు.

ఎంపీ ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేసినా ఆయ‌న ఇప్పుడు సైలెంట్‌గా ఉన్నారు. ఉపేంద‌ర్ రెడ్డి టీఆర్ఎస్‌లోకి రావ‌డం, జిల్లా మంత్రిగా త‌న సామాజ‌క‌వ‌ర్గానికే చెందిన పువ్వాడ అజ‌య్‌కు అవ‌కాశం రావ‌డంతో తుమ్మ‌ల ప్రాభ‌వం పూర్తిగా మ‌స‌క‌బారింది.

ఇక‌, మ‌రో మాజీ మంత్రి జూప‌ల్లి కృష్ణారావుది కూడా ఇదే ప‌రిస్థితి. కొల్లాపూర్‌లో ఆయ‌న‌పై గెలిచిన హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రెడ్డి టీఆర్ఎస్‌లోకి వ‌చ్చారు. దీంతో కృష్ణారావు రాజ‌కీయంగా గ‌డ్డు ప‌రిస్థితిని ఎదుర్కొంటున్నారు. మ‌రో మాజీ మంత్రి ప‌ట్నం మ‌హేంద‌ర్‌రెడ్డి వీరిద్దరి కంటే కొంత మేలు. త‌న త‌మ్ముడి ఎమ్మెల్సీ స్థానం త‌న‌కు ద‌క్కింది.

కానీ, త‌న‌పై గెలిచిన పైలట్ రోహిత్ రెడ్డి టీఆర్ఎస్‌లోకి రావ‌డం, ఆయ‌న మంత్రి కేటీఆర్ వ‌ర్గంగా నియోజ‌క‌వ‌ర్గంలో చ‌క్రం తిప్పుతుండ‌టం మ‌హేంద‌ర్‌రెడ్డికి మింగుడు ప‌డ‌టం లేదు.

వ‌రంగ‌ల్ జిల్లాలో గ‌త ఐదేళ్లూ ఉప ముఖ్య‌మంత్రి హోదాలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన క‌డియం శ్రీహరి ఎమ్మెల్సీగా ఉన్నా ఆయ‌న జిల్లాకే ప‌రిమితం అయ్యారు. ఇంత‌కుముందులా పార్టీలో ఆయ‌న క్రియాశీల‌కంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేదు.

ఉద్య‌మ స‌మ‌యం నుంచి కేసీఆర్ వెన్నంటే ఉన్న నాయిని న‌ర‌సింహారెడ్డి ఇప్పుడు పార్టీ వ్య‌వ‌హారాలకు పూర్తిగా దూర‌మ‌య్యారు. ఈసారి ఆయ‌న‌ను క్యాబినెట్‌లోకి తీసుకోక‌పోవ‌డం, త‌న అల్లుడికి ముషిరాబాద్ ఎమ్మెల్యే టిక్కెట్ అడిగినా ఇవ్వ‌క‌పోవ‌డంతో నాయిని అసంతృప్తికి గుర‌య్యారు.

త‌న‌కు ఆర్టీసీ ఛైర్మ‌న్ ప‌ద‌వి ఇస్తార‌నే ప్ర‌చారం జ‌రిగినా ఆయ‌న ఆ ప‌ద‌వి త‌న‌కెందుక‌ని బాహాటంగానే చెప్పారు. ఒక‌ప్పటి ఓ వెలుగు వెలిగిన త‌మ నేత‌ల ప్ర‌స్తుత ప‌రిస్థితి చూసి వారి అనుచరులు సైతం బాధ ప‌డిపోతున్నారు. మరి, ఈ నేత‌ల రాజ‌కీయ భ‌విత‌వ్యాన్ని కేసీఆర్ ఎలా నిర్ణ‌యిస్తారో చూడాలి.

 

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

   2 hours ago


‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

   3 hours ago


మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

   3 hours ago


బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

   4 hours ago


రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

   5 hours ago


రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

   5 hours ago


ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

   7 hours ago


మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

   8 hours ago


పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

   8 hours ago


కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

   9 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle