newssting
BITING NEWS :
*అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పర్యటన.. ఘనంగా స్వాగతం..సబర్మతి ఆశ్రమంలో మహాత్మాగాంధీ వినియోగించిన చరఖా తిప్పిన ట్రంప్ పంపతులు *సబర్మతి ఆశ్రమంలో ట్రంప్ దంపతులు... గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ట్రంప్, మోడీ *నేడు విజయనగరం జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన.. జగనన్న వసతి దీవేన కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం*సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు బాంబు బెదిరింపు.. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల తనిఖీలు.. ప్లాట్ ఫామ్‌లతో పాటు రైళ్లలోనూ క్షుణ్ణంగా తనిఖీ, పేలుడు పదార్థాలు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు *చిత్తూరు జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల కలకలం..శ్రీ చౌడేశ్వరి ఆలయం వెనకాల ప్రాంతంలో తవ్వకాలు *ఆదిలాబాద్‌ గుడిహత్నూర్‌లో దారుణం....బాలికపై ఇద్దరు కామాంధుల అత్యాచారం* చైనాలో కొనసాగుతున్న కరోనా మరణమృదంగం....ఇప్పటివరకు 2వేల 460కి చేరిన కొవిడ్-19 మృతుల సంఖ్య*ఒడిశా : పూరీ జిల్లా పిప్పిలి ప్రాంతంలో ఏనుగుల బీభత్సం...ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి.., ఐదుగురికి గాయాలు *గుజరాత్‌లోని వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం..ట్రక్కు- టెంపో ఢీ, 11మంది మృతి *68వ రోజు కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళన

మాజీ మంత్రి గీతారెడ్డి వార‌సుడొచ్చేశాడు..!

31-10-201931-10-2019 07:13:01 IST
Updated On 31-10-2019 15:22:40 ISTUpdated On 31-10-20192019-10-31T01:43:01.730Z31-10-2019 2019-10-31T01:42:56.316Z - 2019-10-31T09:52:40.645Z - 31-10-2019

మాజీ మంత్రి గీతారెడ్డి వార‌సుడొచ్చేశాడు..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రి గీతారెడ్డి సీనియ‌ర్ నాయ‌కురాలు. ముగ్గురు ముఖ్య‌మంత్రుల కేబినేట్‌లో మంత్రిగా ప‌నిచేసిన అనుభ‌వం ఆమెది. గ‌త ఎన్నిక‌ల్లో ఓట‌మిని చ‌విచూశాక పార్టీ కార్య‌క‌లాపాల‌కు దాదాపుగా ఆమె దూర‌మైపోయారు. పూర్తి నైరాశ్యంలో ఉన్న గీతారెడ్డి దాదాపుగా రాజ‌కీయాల నుంచి త‌ప్పుకున్న‌ట్టేన‌ని గుస‌గుస‌లాడేసుకుంటున్నారు. ఇక నాయ‌కుల‌కే కాదు.. కార్య‌క‌ర్త‌ల‌కు కూడా దూరంగా ఉంటూ కోటలోనే ఉండిపోయారు ఆమె.

కాగా, తెలంగాణ కాంగ్రెస్‌లో కొంద‌రు నాయ‌కులు ఒకానొక స‌మ‌యంలొ అధికార పార్టీ టీఆర్ఎస్‌లోకి జంప్ అయిపోతే మ‌రికొంద‌రేమో సైలెంట్ అయిపోయారు. మ‌రోప‌క్క అధికార పార్టీ దెబ్బ‌కు కాంగ్రెస్ కుదేల‌వుతూ వ‌స్తోంది. ముంద‌స్తు అసెంబ్లీ ఎన్నిక‌ల త‌రువాత జ‌హీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్ మ‌రీ డీలా ప‌డిపోయిన ప‌రిస్థితి. ఈ నేప‌థ్యంలో పార్టీ సీనియ‌ర్లుగా పేరుపొందిన వారిలో చాలా మంది అస‌లు ఉన్నారా..?  లేదా..? అన్న అనుమానాలు ప్ర‌జ‌ల్లో రేకెత్తుతున్నాయి.  

మాజీ మంత్రి గీతారెడ్డి గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయాక హైద‌రాబాద్‌లోని ఇంటికే ప‌రిమిత‌మైపోయారు. ఎప్పుడో అప్పుడ‌ప్పుడు జ‌హీరాబాద్ వ‌చ్చిన అత్యంత స‌న్నిహితుల ఇళ్ల‌లో జ‌రిగే కార్య‌క్ర‌మాల‌కే హాజ‌రై మాయ‌మైపోతున్నారు. పార్టీనే న‌మ్ముకుని దిక్కులు చూస్తున్న కేడ‌ర్ గురించి అస్స‌లు ప‌ట్టించుకోవ‌డం లేదంటున్నారు. ఫ్యూచ‌ర్‌లో కూడా గీతారెడ్డి ఎన్నిక‌ల్లో పోటీచేసే ప్ర‌స‌క్తే లేద‌ని చెవులు కొరుక్కుంటున్నారు.

గీతారెడ్డికి వ‌య‌సు మీద ప‌డ‌టంతో హైద‌రాబాద్‌ను విడిచి నియోజ‌క‌వ‌ర్గానికి రాక‌పోక‌లు త‌గ్గిపోయాయి. దీంతో నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు పార్టీ శ్రేణుల‌కు మ‌ధ్య దూరం కూడా వ‌యసుతోపాటు పెరిగిపోతోంది. ఇక గీతారెడ్డి త‌రువాత ఆమె వార‌సులు ఎవ‌ర‌న్న ప్ర‌శ్న ఇప్పుడు మొద‌లైంది. గీతారెడ్డి కుటుంబం నుంచి మాత్రం ఎవ‌రూ పోటీలో ఉండ‌క‌పోవ‌చ్చ‌ని అంటున్నారు.

గ‌త అసెంబ్లీ ఎన్నిక‌లకు ముందు టీడీపీని వీడి కాంగ్రెస్‌లోకి వ‌చ్చిన న‌రోత్తం జ‌హీరాబాద్‌లో గీతారెడ్డికి రాజ‌కీయ వార‌సుడిగా ఉంటార‌నే టాక్ న‌డుస్తోంది. నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జిగా ఎవ‌రిరైనా నియ‌మిస్తే త‌ప్ప కాంగ్రెస్‌కు మ‌నుగ‌డ ఉండ‌ద‌ని పార్టీలో కిందిస్థాయి నాయ‌కులు అనుకుంటున్నారు. ఇన్నాళ్లు త‌న‌ను ఆద‌రించిన పార్టీని, పార్టీ కేడ‌ర్‌ను ప‌ట్టించుకోకుండా ఇట్టా గాలికి వ‌దిలేయ‌డంపై స్వ‌యాన అమె అనుచ‌ర‌గ‌ణం, కార్య‌క‌ర్త‌లే ఫీల‌వుతుండ‌టం గ‌మ‌నార్హం.

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle