మాకూ ఎగ్జామ్స్ వద్దు... సోషల్ మీడియాలో ఏపీ, టీఎస్ విద్యార్థుల ప్రచారం!
04-06-202004-06-2020 13:23:13 IST
Updated On 04-06-2020 15:37:21 ISTUpdated On 04-06-20202020-06-04T07:53:13.097Z04-06-2020 2020-06-04T07:42:18.152Z - 2020-06-04T10:07:21.801Z - 04-06-2020

కర్ణాటక విద్యార్థులను అనుసరిస్తూ తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఓ సోషల్ మీడియా ప్రచారాన్ని ఆరంభించారు. కాలేజీ, యూనివర్శిటీ స్థాయి పరీక్షలను బ్యాన్ చేయాలంటూ 'ప్రమోట్ స్టూడెంట్స్ సేవ్ ఫ్యూచర్స్' హ్యాష్ ట్యాగ్ తో తమకు ఎగ్జామ్స్ వద్దని డిమాండ్ చేస్తున్నారు.కరోనా మహమ్మారి మరింతగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం ఫైనల్ ఇయర్ పరీక్షలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో, ఇంటర్, డిగ్రీ, పీజీ చదువుతున్న కర్ణాటక విద్యార్థులు గత కొన్ని రోజుల నుంచి తమకు కూడా పరీక్షలొద్దని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు వీరిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులు కూడా అనుసరిస్తూ తమకూ పరీక్షలు వద్దంటూ సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు.

లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన పరీక్షలను తిరిగి నిర్వహించేందుకు పలు రాష్ట్రాల ప్రభుత్వాలు ఏర్పాట్లను చేస్తున్న సమయంలో, ఆ ఏర్పాట్లు తమలో ధైర్యాన్ని పెంచడం లేదన్నది విద్యార్థుల అభిప్రాయం. తమకు వైరస్ సోకవచ్చన్న భయాందోళనలతో ఉన్న విద్యార్థులు పరీక్షలకు హాజరు కాలేమని అంటున్నారు. కాగా, ఈ విషయంలో ప్రభుత్వాలు మాత్రం ఇంతవరకూ స్పందించ లేదు.
పదోతరగతి విద్యార్ధినీ, విద్యార్ధుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పరీక్షలపై పునరాలోచించాలి. ఏపీ తెలంగాణల్లో 10 లక్షలమందికి పైగా పిల్లలు పరీక్షలు రాయాలి. కరోనా కారణంగా పిల్లలు, లక్షలమంది తల్లిదండ్రులు,ఇన్విజిలేటర్లు రోడ్లమీదకు వస్తారు పరీక్షలు వద్దంటూ ఓ పేరెంట్ ట్వీట్ చేశారు.

"భవిష్యత్తులో సాధించాల్సిన విజయం గురించి ఆలోచించాల్సిన సమయం కాదిది. అసలు భవిష్యత్తే ఉంటుందా? ఉండదా? అని యోచించాల్సిన పరిస్థితి" అని విద్యార్థులు వాపోతున్నారు. పరీక్షలు ముఖ్యం కాదని, మహమ్మారి వ్యాపిస్తున్న సమయంలో సమస్యలను కొని తెచ్చుకోవడం ఎందుకని విద్యార్థులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కల్పించుకుని అన్ని పరీక్షలనూ రద్దు చేయాలని మరో విద్యార్థి కోరాడు.

కాగా, కరోనా కారణంగా తీవ్రంగా నష్టపోయిన రంగాల్లో విద్యారంగం కూడా ఉంది. దేశవ్యాప్తంగా ఎన్నో విద్యా సంస్థలు ఆన్ లైన్ క్లాసుల విధానంలోకి మారాయి. ఢిల్లీ ప్రభుత్వం ఆన్ లైన్ ద్వారా ఫైనల్ ఇయర్ పరీక్షలు నిర్వహించేందుకు నిర్ణయించగా, అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీ సైతం అదే నిర్ణయాన్ని తీసుకుంది. మరోపక్క, ఆన్ లైన్ క్లాసులు యువత మనస్సులను ప్రభావితం చేయలేవని ప్రముఖ సైంటిస్ట్ ప్రొఫెసర్ డాక్టర్ సీఎన్ఆర్ రావు అభిప్రాయపడ్డారు.
ఈనేపథ్యంలో ఏపీ, తెలంగాణ విద్యార్ధులు పరీక్షల రద్దువైపే మొగ్గుచూపుతున్నారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో చూడాలి మరి.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే
14 hours ago

పీకేకి ఏమైంది.. మమతాను కావాలనే దెబ్బ కొట్టాడా
11 hours ago

కేసీఆర్ కు సాగర్ భయం.. రెండోసారీ హాలియాలో సభ
13 hours ago

ఆశగా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడర్లు
17 hours ago

దొరపై జెండా ఎగరేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం
20 hours ago

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!
21 hours ago

షర్మిల మాటలతో చాలా క్లారిటీస్
09-04-2021

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వచ్చింది రెండువేలేనా
09-04-2021

పేర్ని నాని పవన్ ఫ్యానా.. వకీల్ సాబ్ కి ఫుల్ ప్రమోషన్
09-04-2021

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత
09-04-2021
ఇంకా