మాకు రావాల్సిన నిధులివ్వండి.. కేంద్రమంత్రికి కేటీయార్ వినతి
25-08-202025-08-2020 15:14:53 IST
2020-08-25T09:44:53.794Z25-08-2020 2020-08-25T09:44:51.482Z - - 14-04-2021

కరోనా సంక్షోభంలోనూ సంక్షేమ పథకాలు అమలుచేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. కేంద్రం ఈ సందర్భంలోనూ తెలంగాణకు ఇవ్వాల్సిన నిధులు విడుదలచేయాలన్నారు. ఢిల్లీలో పర్యటించిన కేటీయార్ కేంద్రానికి పలు ప్రతిపాదనలు చేశారు. కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ నుంచి తెలంగాణకు రావాల్సిన రూ.2,537.81 కోట్లను విడుదల చేయాలని రాష్ట్ర పట్టణాభివృద్ధి, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు కోరారు. ఉడాన్ పథకంలో వరంగల్‌ను కూడా చేర్చి, ఆ నగరానికి విమాన సర్వీసులు నడిపేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తిచేశారు. కేంద్ర పట్టణాభివృద్ధి, పౌర విమానయానశాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌పురీని ఢిల్లీలో సోమవారం మంత్రి కేటీఆర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ కలిశారు. కేంద్రం ఉదారంగా సాయం చేయాలని, పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయాలన్నారు. రాష్ట్రంలో ప్రవేశపెట్టిన నూతన పురపాలక చట్టం అంశాలను కేంద్రమంత్రికి వివరించారు. అక్టోబరులో మరోసారి పూర్తినివేదికతో రావాలని కేంద్రమంత్రి సూచించారని మంత్రి తెలిపారు. కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ నుంచి స్వచ్ఛ భారత్ పథకం కింద రూ.217.49 కోట్లు, అమృత్ పథకం కింద రూ.351.77 కోట్లు, 15వ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ రూ.783.75 కోట్లు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇవ్వాల్సిన రూ.1184.8 కోట్లు విడుదల చేయాలని కేంద్రమంత్రిని కోరారు. అదే విధంగా వరంగల్ జిల్లా మామునూరును ఉడాన్ పథకంలో చేర్చాలన్నారు. త్వరలో వరంగల్ ప్రజలకు విమాన సేవలు అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నట్టు చెప్పారు. వరంగల్‌లో ఇప్పటికే రన్‌వే సిద్ధంగా ఉందని, దీనిద్వారా ఉడాన్ పథకం ద్వారా విమాన సర్వీసులను నడిపించవచ్చని చెప్పారు. రాష్ట్రంలో మొత్తం ఆరుచోట్ల విమానాశ్రయాలు ఏర్పాటుచేయాలని కేంద్రాన్ని కోరామన్నారు. ఇందుకోసం అవసరమైన సర్వే పనులు వేగవంతం చేయాలని కోరారు. తమ ప్రతిపాదనల పట్ల కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత
3 hours ago

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్
4 hours ago

షర్మిల దీక్ష..రచ్చ ఫిక్స్..పర్మిషన్ ప్రాబ్లమ్
4 hours ago

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.
8 hours ago

ఏపీ, తెలంగాణలో ఉత్కంఠ.. ఈ ఒక్కరోజు చాలా ఇంపార్టెంట్
9 hours ago

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జగన్
7 hours ago

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్
10 hours ago

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత
10 hours ago

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!
5 hours ago

ఎమ్మెల్యేల డ్రగ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు
12 hours ago
ఇంకా