newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మాకు మీకు అదే తేడా.. అమరావతిపై కేటీఆర్ కామెంట్స్

18-01-202018-01-2020 07:37:11 IST
2020-01-18T02:07:11.352Z18-01-2020 2020-01-18T02:06:43.125Z - - 16-04-2021

మాకు మీకు అదే తేడా.. అమరావతిపై కేటీఆర్ కామెంట్స్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో  తాజా రాజకీయ పరిణామాలపై తెలంగాణ మంత్రులు కామెంట్లు చేస్తూనే వున్నారు. తాజాగా మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ కోడిపందేల్లో పాల్గొని తనదైన రీతిలో ఏపీ రాజకీయాలను విశ్లేషించారు. పనిలో పనిగా చంద్రబాబుని తూర్పారబట్టారు. ఇప్పుడు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీయార్ వంతు వచ్చినట్టుంది. అమరావతి ఆందోళనలు, మూడు రాజధానుల అంశంపై కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

అమరావతిలో రాజధాని మారుస్తామంటే ఆందోళనలు చేస్తున్నారని... తెలంగాణలో చిన్న ఆందోళన కూడా లేకుండా జిల్లాల విభజన పూర్తిచేశామని గొప్పగా చెప్పుకొచ్చారు. జిల్లాలను విడగొట్టడం సాధారణ విషయం కాదని, ప్రజల అభీష్టానికి అనుగుణంగా సీఎం కేసీయార్ వ్యవహరించారని ఆయన చెప్పుకొచ్చారు. 

2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 33 జిల్లాలు, కొత్త మండలాలు ఏర్పడ్డాయి. ఎక్కడా చిన్న ఆందోళనలు, పోలీసుల బందోబస్తు లేకుండా కేసీఆర్ విజయవంతంగా, సమర్థవంతంగా  పరిపాలన సాగిస్తున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు.

ఏపీలో రాజధాని మార్పుపై ఇంత ఆందోళన, వ్యతిరేకత ఎందుకు వస్తోందో ఆలోచించాల్సిన అవసరం ఉందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఏపీలో రాజధాని అంశంపై ఆందోళనలు, నిరసనలతో రచ్చరచ్చగా మారింది. పోలీసుల చర్యలను కోర్టు సైతం తప్పుబట్టింది. ఇవాళ్టికి 32వ రోజుకి రాజధాని రైతుల ఆందోళన చేరుకుంది. తాజాగా కేటీయార్ వ్యాఖ్యలు రెండు తెలుగురాష్ట్రాల్లోనూ చర్చకు దారితీశాయి. 

తిరుప‌తిలో  ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

తిరుప‌తిలో ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

   24 minutes ago


ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

   an hour ago


వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

   15 hours ago


లొంగిపోయిన కూన రవికుమార్

లొంగిపోయిన కూన రవికుమార్

   11 hours ago


రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

   13 hours ago


షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

   15 hours ago


తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

   18 hours ago


ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

   19 hours ago


బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

   21 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

   a day ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle