మహోన్నతమూర్తి ....నేటితరాలకు తరగని స్ఫూర్తి .. పీవీ కీర్తి....
28-06-202028-06-2020 11:05:10 IST
2020-06-28T05:35:10.737Z28-06-2020 2020-06-28T05:34:56.851Z - - 22-04-2021

భారత దేశ తొలి తెలుగు ప్రధానమంత్రి, మృదుస్వభావి, బహుభాషా కోవిదుడు, పాలనా సంస్కరణలకు ఆద్యుడు పీవీ నరసింహారావు. ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని దశదిశలా వ్యాపింపచేసిన ప్రతిభాశాలి పీవీ నరసింహారావు శతజయంతి ఇవాళ. జాతియావత్తూ ఆయన సేవల్ని స్మరించుకుంటోంది. గాంధీ భవన్లో పీవీ శత జయంతి వేడుకలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఈసందర్భంగా పీవీ చిత్ర పటానికి నివాళి అర్పించిన పీసీసీ చీఫ్ ఉత్తమ్ , వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం, మాజీ మంత్రి చిన్నారెడ్డి తదితరులు పీవీ సేవలను కొనియాడారు.

దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రధానిగా బాధ్యతలు చేపట్టి, ఆర్థిక వ్యవస్థను పరుగులు తీయించిన మేధావి పివి నరసింహారావు. ఏ పదవి నిర్వహించినా, ఆ పదవికే వన్నె తెచ్చిన బహుభాషా కోవిదుడు పీవీ. ఆయన జయంతిని ఏడాదిపాటు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇవాళ్టి నుంచి ఏడాదిపాటు దేశవ్యాప్తంగానే కాదు 50 దేశాల్లో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.
హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లోని పీవీ జ్ఞానభూమిలో ప్రధాన కార్యక్రమం జరిగింది. ఉదయం 10.30 గంటలకు పీవీ శత జయంతి ఉత్సవాలను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రారంభించారు. ముందుగా పీవీ ఘాట్ వద్ద సీఎం పుష్పాంజలి ఘటించారు. అనంతరం అక్కడే ఏర్పాటుచేసిన వేదిక వద్ద సర్వమత ప్రార్థనలు, భజనలు, సంకీర్తనలు నిర్వహించారు. అనంతరం సభాకార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పీవీ కుటుంబసభ్యులు, శతజయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ కే కేశవరావు పాల్గొన్నారు.
కొవిడ్-19 దృష్ట్యా పరిమిత సంఖ్యలోనే అతిథులకు అనుమతిస్తున్నారు. పీవీ కీర్తి దశదిశలా చాటేలా దేశ విదేశాల్లో ఉత్సవాలను నిర్వహించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలమేరకు ఏర్పాట్లు జరిగాయి. ఏడాదిపాటు పీవీ శతజయంతి ఉత్సవాల నిర్వహణ బాధ్యతను పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావుకు అప్పగించారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ దేశ విదేశాల్లో పీవీ శతజయంతి ఉత్సవాల నిర్వహణపై ఆయా దేశాల్లోని తెలుగువారితో మాట్లాడారు. ఇతర రాష్ర్టాల్లో కూడా ఉత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
మాజీ ప్రధాని పీవీ శతజయంతి సందర్భంగా ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సందేశం ఇచ్చారు. ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నప్పుడే అనేక భూ సంస్కరణలు, విద్యా సంస్కరణలతో సంస్కరణవాదిగా ప్రజల అభిమానాన్ని చూరగొన్న ఆయన, ప్రధాని అయిన తర్వాత జాతీయస్థాయిలోనూ అదే సంస్కరణల పర్వాన్ని కొనసాగించారు. ముఖ్యంగా కష్టకాలంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థకు చక్కని భవిష్యత్తు చూపించి, గాడిలో పెట్టేందుకు తీసుకొచ్చిన సంస్కరణలు దేశం మరచిపోదన్నారు. భారతీయ భాషల అభివృద్ధికోసం వారి తపన, ప్రాథమిక విద్య మాతృభాషలోనే ఉండేలా తీసుకున్న చర్యలు, అధికార భాషా సంఘం, తెలుగు అకాడమీ ఏర్పాటులో తీసుకున్న చొరవ ప్రశంసనీయం. వారి నిరాడంబర జీవితం ఆదర్శనీయం అన్నారు.


సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు
7 hours ago

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!
11 hours ago

నిరాహార దీక్షలపై షర్మిలక్కయ్య నిర్ణయం
14 hours ago

మన గుంటూరులోనే.. జాగ్రత్త పడదామా వద్దా.. అంతా మనిష్టం
14 hours ago

ఏందయ్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే
15 hours ago

ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మరి రాష్ట్రాల మాటేంటి
12 hours ago

ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..
21-04-2021

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!
21-04-2021

కాంగ్రెస్ కి ఇంకా ఆశలు ఉన్నట్లున్నయ్
21-04-2021

తిరుపతి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ తప్పదా
21-04-2021
ఇంకా