newssting
BITING NEWS :
*ప్రధాని మోదీని కలిసిన వైఎస్ఆర్సీఎల్పీ నేత జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర సమస్యలపై చర్చ, ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం * వాల్డ్ కప్ వార్మప్ మ్యచ్ లో టీమిండియా పేలవ ప్రదర్శన, న్యూజీల్యాండ్ చేతిలోఓటమి * నరేంద్ర మోదీని పీఎం ఎలక్ట్ గా నియమించిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ * రాష్ట్రపతి కోవింద్ కు కొత్త ఎంపీల జాబితా సమర్పించిన ఈసీ * ఎవరెస్ట్ పర్వతంపై ఈ వారం మరణించిన పర్వతారోహకుల సంఖ్య 10కి చేరిక * తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కు ఏపీలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల జాబితా సమర్పించిన సీఈఓ జీకే ద్వివేది

మహబూబ్‌‌నగర్‌పై డౌటెందుకు?

15-03-201915-03-2019 08:06:37 IST
Updated On 15-03-2019 07:36:33 ISTUpdated On 15-03-20192019-03-15T02:36:37.443Z15-03-2019 2019-03-15T02:03:08.950Z - 2019-03-15T02:06:33.501Z - 15-03-2019

మహబూబ్‌‌నగర్‌పై డౌటెందుకు?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సిట్టింగ్ లు అందరికీ సీట్లు గ్యారంటీ.. ఇద్దరికి తప్ప... అని మొన్నామధ్య కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇంచుమించు అదే సూత్రం పాటించారు కేసీఆర్. రాబోయే ఎన్నికల్లో మహబూబ్‌నగర్ సీటు తనదే అని టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తాను కాంగ్రెస్‌తో టచ్‌లో లేనని వ్యాఖ్యానించారు. తానంటే గిట్టనివారే తనకు టికెట్ రాదని ప్రచారం చేస్తున్నారని జితేందర్ రెడ్డి ఆగ్రహంతో ఉన్నారు.

తమ పార్టీ అధినేత కేసీఆర్‌పై పూర్తి విశ్వాసం ఉందన్నారు. తాను కాంగ్రెస్‌కు వ్యతిరేకమని... ఆ పార్టీతోనే పోరాడానని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పని చేశానని... ఎవరినీ ఓడించడానికి తాను గ్రూపులు కట్టలేదన్నారు. మహబూబ్ నగర్ ఎంపీ స్థానం మళ్ళీ తనదేనని, తనగురించి కేసీఆర్‌కు అన్నీ తెలుసన్నారు జితేందర్ రెడ్డి. 

కేసీఆర్ టికెట్ నిరాకరించబోయే వారి జాబితాలో మహబూబ్ నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి కూడా ఉంటారనే ఊహాగానాల నేపథ్యంలో జితేందర్ రెడ్డి వివరణ ఇచ్చారు. అలాగే అసెంబ్లీ ఎన్నికలు ముందు విశ్వేశ్వర్ రెడ్డితో కలిసి కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు జితేందర్ రెడ్డి ప్రయత్నించారనే ప్రచారం కూడా సాగింది.  అయితే జితేందర్ రెడ్డి మాత్రం కేసీఆర్ తనకు అన్యాయం చేయరనే విశ్వాసంతో ఉన్నారు. మరేం జరుగుతుందో ఒకట్రెండురోజులు ఆగితే తేలిపోతుంది. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకి జర్నలిజంలో విశేష అనుభవం. 21 సంవత్సరాల క్రితం జర్నలిజంలోకి ప్రవేశించిన సత్యనారాయణరాజు ప్రముఖ దినపత్రికలు, న్యూస్ ఛానెళ్ళలో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... మూడేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో సీనియర్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు.ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle