మళ్లీ లాక్ డౌన్‌పై కేసీయార్ వెనకడుగు.. అందుకేనా?
05-07-202005-07-2020 16:25:06 IST
Updated On 05-07-2020 17:12:01 ISTUpdated On 05-07-20202020-07-05T10:55:06.907Z05-07-2020 2020-07-05T10:54:46.576Z - 2020-07-05T11:42:01.735Z - 05-07-2020

తెలంగాణలో కరోనా కేసుల ఉధృతి నేపథ్యంలో హైదరాబాద్ ని మళ్లీ కట్టడి చేద్దామని ప్రభుత్వం భావించింది. కానీ పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవని అర్థం అవుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి మళ్లీ కఠిన లాక్డౌన్ విధించాలనే ఆలోచనలను రాష్ట్ర ప్రభుత్వం విరమించుకుంది. 15 రోజుల పాటు లాక్డౌన్ విధించాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ చేసిన ప్రతిపాదనలపై రాష్ట్ర మంత్రి వర్గంలో చర్చించి నిర్ణయం తీసుకోవాలి. త్వరలో కేబినెట్ భేటీ వుంటుందని అంతా భావించారు. శనివారం నాటికే దీనిపై క్లారిటీ రావాలి. కానీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రగతిభవన్‌లో కరోనా కేసులతో తన ఫాంహౌస్ కి వెళ్లారు. కేసీయార్ నుంచి ఎలాంటి గ్రీన్ సిగ్నల్ రాకపోవడం, లాక్ డౌన్ వల్ల అనేక ఇబ్బందులు ఏర్పడతాయని, వలస కార్మికుల సమస్య మళ్లీ వస్తుందని ప్రభుత్వం పునరాలోచనలో పడింది. లాక్ డౌన్ పెడతారనే ఆలోచనతో నగర వ్యాపార, వాణిజ్యవర్గాల్లో ఉత్కంఠ పెరిగిపోయింది. మళ్లీ లాక్డౌన్ విధిస్తే ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయన్న అంశంపై రాష్ట్ర ప్రభుత్వం విస్తృత అధ్యయనం నిర్వహించింది. వైద్యరంగ నిపుణులతో పాటు రాజకీయ నేతలు, వ్యాపార, పారిశ్రామిక వేత్తలు, సాధారణ ప్రజల అభిప్రాయాలు వ్యక్తం చేశారు. జీచ్ఎంసీ పరిధిలో కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతంగా ఉండటంతో లాక్డౌన్ విధించడమే సరైందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎక్కువ మంది ఈ ప్రతిపాదనలను వ్యతిరేకించారు. లాక్డౌన్ ఎంత కఠినంగా అమలు చేసినా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టలేమని ఇప్పటికే తేలిపోయింది. స్యీయరక్షణే ముఖ్యమని అనేకమంది అభిప్రాయపడ్డారు. తాజాగా సామాజిక వ్యాప్తి ప్రారంభ దశకి చేరుకోవడంతో పరిస్థితుల్లో లాక్డౌన్ విధించినా పెద్దగా ప్రయోజనం ఉండదని ఉన్నతస్థాయి వైద్య నిపుణులు తేల్చిచెప్పినట్టు తెలిసింది. రానున్న రోజుల్లో కరోనా రోగుల సంఖ్య భారీగా పెరగనుందని, అవసరమైన వారం దరికీ వైద్య సదుపాయాలు అందించేందుకు ఏర్పాట్లు చేయాలని పలువురు నిపుణులు సూచించారు. లాక్ డౌన్ అమలుచేస్తే వలస కార్మికులతో పాటు, నిరుపేదలకు కూడా సాయం చేయాలి. గత మూడునెలలుగా కరోనా వైరస్ వల్ల ప్రభుత్వ ఆదాయం పడిపోయింది. ఇప్పుడిప్పుడే ఆదాయం రావడం ప్రారంభం అయింది. మళ్లీ 15 రోజులు కట్టడి చేస్తే ఆర్థికంగా మరింతగా ఇబ్బందులు తప్పవని సీఎం కేసీయార్ భావిస్తున్నారు. అన్ లాక్ 1, అన్ లాక్ 2 వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల రాబడి సైతం గణనీయంగా పెరిగింది. ఆర్థికంగా పరిస్థి తులు క్రమంగా చక్కదిద్దు కుంటున్నాయి. చిరు వ్యాపారులు సైతం నిలదొక్కుకుంటున్నారు. ఈ పరిస్థితుల దృష్ట్యా మళ్లీ లాక్డౌన్ విధించవద్దని రాష్ట్ర ప్రభుత్వం సైతం ఓ అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం. మరికొన్ని రోజుల పాటు పరిస్థితులను అంచనా వేసిన తర్వాత ఒక ప్రకటన చేయనుంది. రాష్ట్రమంత్రివర్గాన్ని సమావేశపరిచి లాక్‌డౌన్‌పై మూడు నాలుగు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్ ప్రకటించి వారం రోజులు గడిచిపోయింది. అసలు మంత్రివర్గ భేటీ ప్రతిపాదనలే ఇప్పటివరకు లేవని ప్రభుత్వంలోని ఉన్నతస్థాయి వర్గాలు చెబుతున్నాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేందుకు మరింత సమయం పట్టనుంది. మానవులపై ప్రయోగాలకు రంగం సిద్ధమవుతోంది. సాధ్యమయినంత త్వరగా ఒక అవగాహనకు వచ్చి సీఎం కేసీఆర్ ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు అంటున్నాయి.

నా రూటే సెపరేటు
41 minutes ago

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత
14 hours ago

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్
15 hours ago

షర్మిల దీక్ష..రచ్చ ఫిక్స్..పర్మిషన్ ప్రాబ్లమ్
15 hours ago

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.
19 hours ago

ఏపీ, తెలంగాణలో ఉత్కంఠ.. ఈ ఒక్కరోజు చాలా ఇంపార్టెంట్
20 hours ago

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జగన్
18 hours ago

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్
20 hours ago

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత
21 hours ago

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!
16 hours ago
ఇంకా