newssting
BITING NEWS :
*న్యూస్ స్టింగ్ వీక్షకులకు, శ్రేయోభిలాషులకు మహా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు *మాతృభాషాదినోత్సవ శుభాకాంక్షలు *నేడు మహాశివరాత్రి... శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు.. శివనామస్మరణతో మర్మోగుతున్న ఆలయాలు *వేములవాడ రాజన్న ఆలయానికి హెలికాప్టర్ సేవలు *శ్రీశైలంలో రాత్రి 10 గంటలకు లింగోద్భవకాల మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పాగాలంకరణ, అమ్మవార్ల కల్యాణోత్సవం *పంచాయితీరాజ్ చట్టంలో సవరణలపై ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ. గత కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వ్యవధిని తగ్గించిన ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ఆర్డినెన్స్ *వైఎస్ వివేకా హత్యకేసు విచారణను సీబీఐకి ఇవ్వాలన్న పిటిషన్ పై విచారణ. సిట్ విచారణను సీల్డ్ కవర్ లో అందజేసిన ఏజీ. సిట్ విచారణ దాదాపుగా పూర్తి కాబోతుందని, ఈ సమయంలో సీబీఐ విచారణ అవసరం లేదన్న ఏజీ.కేసు జనరల్ డైరీ, కేసు డైరీ ఫైల్స్ ను సోమవారానికి సమర్పించాలని ఏజీని ఆదేశించిన ఏపీ హైకోర్టు*అమరావతి: చంద్రబాబు, లోకేష్ అత్యంత అవినీతిపరులు. సమస్యలను పక్కదారి పట్టించేందుకే ఆస్తుల ప్రకటన-ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి *తిరుపతి: రుయా హాస్పిటల్ లో ఆవరణలో సైకోల వీరంగం. రుయా సెక్యూరిటీ సిబ్బందితో సైకోల వాగ్వాదం. బ్లేడులతో గాయపరుచుకున్న నలుగురు సైకోలు. భయంతో పరుగులు తీసిన నర్సులు *నేతలపై దాడులు చేస్తే ఎవరైనా వస్తారా..? పెట్టుబడులు వస్తాయా..? రైతుల ముసుగులో టీడీపీ గుండాలు నాపై దాడి చేసే ప్రయత్నం చేశారు-వైసీపీ ఎమ్మెల్యే రోజా

మల్‌రెడ్డి వర్సెస్ మంచిరెడ్డి... సవాళ్ళ మీద సవాళ్ళు

08-11-201908-11-2019 07:56:51 IST
Updated On 08-11-2019 07:56:48 ISTUpdated On 08-11-20192019-11-08T02:26:51.541Z08-11-2019 2019-11-08T02:26:11.452Z - 2019-11-08T02:26:48.522Z - 08-11-2019

మల్‌రెడ్డి వర్సెస్ మంచిరెడ్డి... సవాళ్ళ మీద సవాళ్ళు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి -మల్‌రెడ్డి రంగారెడ్డి మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేలా వ్యవహారం తయారైంది. తాను భూ కబ్జాలు చేస్తే ఎటువంటి శిక్షకైనా సిద్ధం అంటున్నారు మల్ రెడ్డి. మంచిరెడ్డిని టీఆర్‌ఎస్‌ నుంచి కేసీఆర్‌ సస్పెండ్ చేయాలని, మంచిరెడ్డి భూ బాగోతాలపై విచారణ జరపాలని మల్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు.

తాను, తన  కుటుంబం ఎటువంటి భూ కబ్జా చేయలేదని స్పష్టం చేశారు మల్‌రెడ్డి రంగారెడ్డి.  అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం గౌరెల్లి, బాచారం గ్రామంలోని 16ఎకరాల భూమిని రైతుల వద్ద కొనుగోలు చేశామని వాటికి సంబంధించిన భూ పత్రాలు తమ వద్ద ఉన్నాయని , కిషన్‌రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మల్‌రెడ్డి ఖండించారు.

పత్రాలు ఎవరైనా తనిఖీ చేసుకోవచ్చంటున్నారు. అబ్దుల్లాపూర్ మెట్ తాహశీల్దార్ విజయారెడ్డి హత్య తర్వాత వీరిద్దరి మధ్య మాటల తూటాలు పేలాయి. తాహశీల్దార్ విజయారెడ్డి హత్య కేసులో స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ ‌రెడ్డి అనుచరులపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.

నిందితుడు సురేష్ టీఆర్‌ఎస్ కార్యకర్త అంటూ సోషల్ మీడియాలో ఫొటోలు హల్‌ చల్ చేస్తున్నాయి. ఎమ్మెల్యే అనుచరులే హత్య చేయించారంటూ వార్తలు వచ్చాయి.ఇవన్నీ తప్పుడు ఆరోపణలంటూ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి కొట్టిపారేశారు. 

అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతంలో మల్ రెడ్డి సోదరులు, బంధువులు ఎన్నో భూములు కబ్జా చేశారని మంచిరెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే.

తహశీల్దార్ హత్య కేసు నిందితుడు సురేష్ తండ్రి, పెద్దనాన్న నుంచి మల్ రెడ్డి బంధువులు భూములు కొనుగోలు చేశారని తెలిపారు.ఇందుకు సంబంధించిన సాక్ష్యాలు తన వద్ద వున్నాయని చెప్పిన మంచిరెడ్డి..పోలీసు విచారణలో నిజనిజాలు తేలుతాయని మంచిరెడ్డి కిషన్ రెడ్డి అంటున్నారు.

ఈ వ్యవహారంపై మంచిరెడ్డి సీఎం కేసీఆర్ కు లేఖ రాసినట్టు తెలుస్తోంది. సరైన డాక్యుమెంట్స్ లేకుండానే రైతులను భయభ్రాంతులకు గురిచేసి భూములు లాక్కున్నారని ఆరోపించారు.

పాస్‌బుక్స్ లేకపోయినా పహాణీలతోనే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని.. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరపాల్సిందిగా సీఎస్,డీజీపీలకు లేఖలు రాస్తున్నానని తెలిపారు.ఈనేతల ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయం వేడెక్కింది. 

భారత్ ధర్మ సత్రం కాదు.. పౌరసత్వం అంగడి సరుకుకాదు: స్వామి

భారత్ ధర్మ సత్రం కాదు.. పౌరసత్వం అంగడి సరుకుకాదు: స్వామి

   6 hours ago


గ్రామాలతోనే అభివృద్ధి.. సిరిసిల్ల రోల్ మోడల్

గ్రామాలతోనే అభివృద్ధి.. సిరిసిల్ల రోల్ మోడల్

   7 hours ago


చేను మేసిన కంచె.. చిత్తూరు కో ఆపరేటివ్ బ్యాంకులో భారీ స్కాం

చేను మేసిన కంచె.. చిత్తూరు కో ఆపరేటివ్ బ్యాంకులో భారీ స్కాం

   9 hours ago


వైఎస్ వివేకా కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. విచారణ వాయిదా

వైఎస్ వివేకా కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. విచారణ వాయిదా

   9 hours ago


గ్రేటర్‌ హైదరాబాద్‌కు ముందస్తు ఎన్నికలు?

గ్రేటర్‌ హైదరాబాద్‌కు ముందస్తు ఎన్నికలు?

   10 hours ago


ఉగాదికే ముహూర్తం.. రాజధాని తరలింపు ఖాయం

ఉగాదికే ముహూర్తం.. రాజధాని తరలింపు ఖాయం

   11 hours ago


‘‘రామ మందిరానికి ట్రస్ట్.. మరి మసీదు నిర్మాణం సంగతేంటి?’’

‘‘రామ మందిరానికి ట్రస్ట్.. మరి మసీదు నిర్మాణం సంగతేంటి?’’

   14 hours ago


ట్రంప్ కోసం యమునా నదికి సొగసులు

ట్రంప్ కోసం యమునా నదికి సొగసులు

   14 hours ago


శివనామస్మరణతో మారుమ్రోగుతున్న ఆలయాలు

శివనామస్మరణతో మారుమ్రోగుతున్న ఆలయాలు

   15 hours ago


వేములవాడకు హెలికాప్టర్‌ సేవలు.. భక్తుల్లో ఆనందం

వేములవాడకు హెలికాప్టర్‌ సేవలు.. భక్తుల్లో ఆనందం

   16 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle