newssting
BITING NEWS :
* భారత్-అమెరికా మధ్య కుదిరిన ఐదు ఒప్పందాలు.. ట్రంప్‌తో నాకు ఇది ఐదో సమావేశం, ట్రంప్ సకుటుంబంగా భారత్‌కు రావడం సంతోషంగా ఉంది-ప్రధాని మోడీ*మూడు బిలియన్ డాలర్ల ఒప్పందం జరిగింది, సహజవాయురంగంలో ఒప్పందం చేసుకున్నాం-డొనాల్డ్ ట్రంప్ *ఇండియాతో మాకు ప్రత్యేక అనుబంధం, ఈ టూర్ ఎప్పటికీ మర్చిపోలేను, రెండు దేశాలకు ఇది ఉపయోగకరమైన పర్యటన, ఇస్లాం తీవ్రవాదంపై కూడా చర్చించాం-ట్రంప్ * నిర్భయ దోషుల ఉరి శిక్షలో మరో ట్విస్ట్..! విచారణ 5వ తేదీకి వాయిదా *ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్‌ సస్పెన్షన్ రద్దుచేసిన క్యాట్.. కృష్ణకిషోర్‌ కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ట్రైబ్యునల్‌ అనుమతి, కృష్ణకిషోర్‌పై కేసులను ప్రభుత్వం చట్టప్రకారం పరిశీలించుకోవచ్చన్న క్యాట్ *ఢిల్లీ సర్వోదయ స్కూల్‌లో అమెరికన్ ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్... హ్యాపిసెన్ క్లాస్‌లను పరిశీలించిన మెలానియా*రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. నోటిఫికేషన్‌ మార్చి 6, నామినేషన్లకు చివరి తేది మార్చి 13, నామినేషన్ల పరిశీలన మార్చి 16, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది మార్చి 18, మార్చి 26న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్. సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ * సాయంత్రం మోడీ-ట్రంప్ విందుకు హాజరుకానున్న ప్రముఖులు. రాలేనని సందేశం పంపిన మాజీ పీఎం మన్మోహన్ సింగ్

మల్లారెడ్డి మంత్రి ప‌ద‌వి ఊస్ట్‌..?

19-01-202019-01-2020 08:02:44 IST
Updated On 20-01-2020 16:36:25 ISTUpdated On 20-01-20202020-01-19T02:32:44.741Z19-01-2020 2020-01-19T02:32:33.726Z - 2020-01-20T11:06:25.947Z - 20-01-2020

మల్లారెడ్డి మంత్రి ప‌ద‌వి ఊస్ట్‌..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో డ‌బ్బులు ఉన్న వారికే టిక్కెట్లు ఇవ్వ‌డం ప్ర‌స్తుతం అన్ని రాజ‌కీయ పార్టీలు అవ‌లంభిస్తున్నా విన్నింగ్ ఫార్ములాలో ఒక భాగం. అంతేకాదు, టిక్కెట్ల కోసం డ‌బ్బులు అడిగే సంస్కృతి కూడా ఇప్పుడు అన్ని పార్టీల్లోనూ ఉంది. ఇప్పుడు తెలంగాణ‌లో జ‌రుగుతున్న మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లోనూ టిక్కెట్లు ఇవ్వ‌డానికో, ఇప్పించ‌డానికో ఆయా నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యేలు లేదా ఇత‌ర కీల‌క నేత‌లు డ‌బ్బులు అడుగుతున్నార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ప‌లువురు టిక్కెట్ ద‌క్క‌ని ఆశావ‌హులు ఈ ఆరోప‌ణ‌లు బాహాటంగానే చేస్తున్నారు.

ప‌లువురు టీఆర్ఎస్ నేత‌ల‌పైన ఈ ఆరోప‌ణ‌లు రాగా, అంద‌రి కంటే ఎక్కువ‌గా మంత్రి మ‌ల్లారెడ్డిపైన వ‌స్తున్నాయి. ఆయ‌న ప్రాతినిథ్యం వ‌హిస్తున్న మేడ్చ‌ల్ నియోజ‌క‌వ‌ర్గం మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో చాలా కీల‌కం.

హైద‌రాబాద్ న‌గ‌ర శివారులోని ఈ నియోజ‌క‌వ‌ర్గంలోనే ఎక్కువ మున్సిపాలిటీలు, కార్పొరేష‌న్లు ఉన్నాయి. దీంతో టీఆర్ఎస్ అధిష్ఠానం కూడా ఈ నియోజ‌క‌వ‌ర్గంపై ప్ర‌త్యేక దృష్టి పెట్టింది. నియోజ‌క‌వ‌ర్గంలోని అన్ని మున్సిపాలిటీల్లో పార్టీని గెలిపించే బాధ్య‌త మంత్రి మ‌ల్లారెడ్డిపైన పెట్టారు.

అయితే, ఈ బాధ్య‌త‌లు మ‌ల్లారెడ్డికి త‌ల‌కు మించి భారంగా మారింది. టిక్కెట్ల కేటాయింపు ఆయ‌న‌కు చాలా త‌ల‌నొప్పులు తెచ్చింది. టీఆర్ఎస్ టిక్కెట్ల కోసం పెద్ద ఎత్తున పోటీప‌డ్డారు. న‌గ‌ర శివారు మున్సిపాలిటీలు కావ‌డంతో ఎక్కువ‌గా రియాల్ట‌ర్లు, ధ‌నికులు టిక్కెట్ల కోసం ప్ర‌య‌త్నించారు. టిక్కెట్ల కోసం వారికి, ముందు నుంచీ టీఆర్ఎస్‌లో, తెలంగాణ ఉద్య‌మంలో ప‌ని చేసిన వారి మ‌ధ్య పోటీ ఏర్ప‌డింది. గెలుపే లక్ష్యంగా భావించి డ‌బ్బులు దండిగా ఉన్న‌వారికే టిక్కెట్లు ఇచ్చార‌ని టీఆర్ఎస్‌పై ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

మ‌ల్లారెడ్డి టిక్కెట్లు అడిగిన నేత‌ల‌ను డ‌బ్బులు ఎన్ని ఉన్నాయ‌ని అడిగార‌ని, టిక్కెట్ ఇవ్వ‌డానికి కూడా డ‌బ్బులు డిమాండ్ చేశార‌ని టిక్కెట్లు ద‌క్కని ఆశావ‌హులు బాహాటంగానే ఆరోప‌ణ‌లు చేశారు.

రాపోలు రాములు అనే ఓ నేత అయితే మంత్రి డ‌బ్బులు అడిగే ఆధారాలు బ‌య‌ట‌పెడ‌తాన‌ని నేరుగా ఆయ‌న‌తోనే చెప్పిన ఆడియో వైర‌ల్ అయ్యింది. మ‌ల్లారెడ్డి ప్ర‌ధాన అనుచ‌రుడు మంద సంజీవ రెడ్డి కూడా డబ్బులు ఉన్న వారికి మంత్రి టిక్కెట్ ఇస్తారు అని చెబుతున్నా ఓ ఆడియో సంచ‌ల‌నం సృష్టించింది.

టిక్కెట్లు ద‌క్క‌ని ఆశావ‌హులు చాలా మంది మంత్రి కేటీఆర్ వ‌ద్ద‌కు వెళ్లి మ‌ల్లారెడ్డిపై ఫిర్యాదు చేశార‌ని తెలుస్తోంది. మ‌ల్లారెడ్డి టిక్కెట్లు అమ్ముకున్నార‌ని, త‌మ‌ను డ‌బ్బులు డిమాండ్ చేశార‌ని ఆరోపించారు. ఈ ఆరోప‌ణ‌ల‌పై టీఆర్ఎస్ అధిష్ఠానం కూడా సీరియ‌స్‌గా ఉన్న‌ట్లు తెలుస్తోంది.

అయితే, ఎన్నిక‌ల ముందు ఏం చేసినా ప్ర‌జ‌ల్లోకి త‌ప్పుడు సంకేతాలు వెళతాయ‌ని వేచి చూస్తోందని స‌మాచారం. ఎన్నిక‌ల త‌ర్వాత ఆయ‌న‌పై చ‌ర్య‌లు తీసుకునే అవ‌కాశం ఉంద‌ని, ఆయ‌నను మంత్రి ప‌ద‌వి నుంచి త‌ప్పించ‌వ‌చ్చ‌ని చెబుతున్నారు. ఒక‌వేళ మేడ్చ‌ల్ ప‌రిధిలోని అన్ని మున్సిపాలిటీల‌ను గెలిపించి, త‌న‌పై ఆరోప‌ణ‌ల‌కు జ‌వాబు ఇస్తే త‌ప్ప ఆయ‌న మంత్రి ప‌ద‌విలో కొన‌సాగే అవ‌కాశాలు లేవనే ప్ర‌చారం జ‌రుగుతోంది.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle