newssting
BITING NEWS :
*అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పర్యటన.. ఘనంగా స్వాగతం..సబర్మతి ఆశ్రమంలో మహాత్మాగాంధీ వినియోగించిన చరఖా తిప్పిన ట్రంప్ పంపతులు *సబర్మతి ఆశ్రమంలో ట్రంప్ దంపతులు... గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ట్రంప్, మోడీ *నేడు విజయనగరం జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన.. జగనన్న వసతి దీవేన కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం*సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు బాంబు బెదిరింపు.. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల తనిఖీలు.. ప్లాట్ ఫామ్‌లతో పాటు రైళ్లలోనూ క్షుణ్ణంగా తనిఖీ, పేలుడు పదార్థాలు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు *చిత్తూరు జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల కలకలం..శ్రీ చౌడేశ్వరి ఆలయం వెనకాల ప్రాంతంలో తవ్వకాలు *ఆదిలాబాద్‌ గుడిహత్నూర్‌లో దారుణం....బాలికపై ఇద్దరు కామాంధుల అత్యాచారం* చైనాలో కొనసాగుతున్న కరోనా మరణమృదంగం....ఇప్పటివరకు 2వేల 460కి చేరిన కొవిడ్-19 మృతుల సంఖ్య*ఒడిశా : పూరీ జిల్లా పిప్పిలి ప్రాంతంలో ఏనుగుల బీభత్సం...ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి.., ఐదుగురికి గాయాలు *గుజరాత్‌లోని వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం..ట్రక్కు- టెంపో ఢీ, 11మంది మృతి *68వ రోజు కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళన

మరో సమ్మె ముప్పు తప్పింది... కేసీఆర్ హ్యాపీస్!

19-10-201919-10-2019 19:09:55 IST
2019-10-19T13:39:55.105Z19-10-2019 2019-10-19T13:39:38.288Z - - 24-02-2020

మరో సమ్మె ముప్పు తప్పింది... కేసీఆర్ హ్యాపీస్!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సమ్మె పేరు చెబితే.. తెలంగాణలో జనం వణికిపోతున్నారు. అదే మరో సమ్మె నిజంగా సంభవిస్తే తట్టుకునే ఓపిక, తీరిక జనానికి లేదు. తాజాగా మరో సమ్మె ముప్పు తప్పింది. ఇప్పటికే ఆర్టీసీ సమ్మెతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెలంగాణ ప్రభుత్వానికి మరో సమ్మె ముప్పు తప్పింది.

ఆర్టీసీ కార్మిక సంఘాల మాదిరి ఇక్కడి కార్మిక సంఘాలు మొండికేయకపోవడంతో కెసీఆర్ సర్కార్..తెలంగాణ రాష్ట్ర విద్యుత్ రంగంలో. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో వున్న సమస్యలపై జెన్‌కో, ట్రాన్స్‌కో కార్మికులు యాజమాన్యానికి కొన్ని రోజుల క్రితం సమ్మె నోటీసునిచ్చాయి. 

తమ సమస్యలపై చర్చలకు సిద్దమని ఆయా సంఘాలు ప్రకటించాయి. ఆర్టీసీ విషయంలో వ్యవహరించినట్లు చేస్తే సమ్మె పోటు తప్పదని హెచ్చరించాయి. విద్యుత్‌ కార్మిక సంఘాల డిమాండ్లపై యాజమాన్యాలు అనుకూలంగా స్పందించాయి. ఆర్టిజన్లకు ఏపీఎస్‌ఈబీ సర్వీసు నిబంధనల అమలు, విద్యుత్‌ సంస్థల్లో నియామకమైన కార్మికులందరికీ పాత పెన్షన్‌ విధానం అమలుతో పాటు ఇతర డిమాండ్ల సాధనపై కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. 

ఈ నేపథ్యంలో ఉద్యోగ కార్మిక సంఘం నేతలతో నగరంలోని విద్యుత్‌సౌధలో విద్యుత్‌ యాజమాన్యం శనివారం చర్చలు జరిపింది. ఈ చర్చల్లో విద్యుత్‌ సంస్థల సీఎండీలు ప్రభాకర్‌రావు, రఘురామ్‌రెడ్డి, గోపాల్‌రావు పాల్గొన్నారు. చర్చల విషయంలో కార్మిక సంఘాలు ఆశాభావంగా ఉన్నాయి.

దీంతో విద్యుత్‌ కార్మిక సంఘాల డిమాండ్లపై విద్యుత్‌ సంస్థల యాజమాన్యాలు అంగీకరించడంతో సమ్మె విషయంలో మరో ఆలోచన చేశాయి. దీంతో సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేయాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో తెలంగాణలో మరో సమ్మె తప్పినట్లు అయ్యింది.

కార్మికుల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించేందుకు... యాజమాన్యం సుముఖత వ్యక్తం చేసిందని కార్మిక సంఘాలు నేతలు చెప్పారు. ఉద్యోగులకు అమలు చేసిన జీపీఎఫ్‌ విధానాన్ని మళ్లీ కొనసాగించాలని వచ్చే నెల 3వ వారంలో విద్యుత్‌ సంస్థల యాజమాన్యాలతో మరోసారి చర్చలు జరుపుతామని కార్మిక సంఘాలు నేతలు చెబుతున్నారు.విద్యుత్ కార్మికులు సమ్మెకు దిగితే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. మైగాడ్.. సమ్మె ముప్పు తప్పింది కదా తెలంగాణ ఊపిరి పీల్చుకో. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle