మరో లాక్ డౌన్‌తో ప్రయోజనం ఏంటి? మంత్రి వ్యాఖ్యలు
10-07-202010-07-2020 09:48:24 IST
Updated On 10-07-2020 13:42:14 ISTUpdated On 10-07-20202020-07-10T04:18:24.629Z10-07-2020 2020-07-10T04:18:15.810Z - 2020-07-10T08:12:14.740Z - 10-07-2020

తెలంగాణలో భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతుండడంతో అధికారులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. గడిచిన 24 గంటల్లో1410 మందికి పాజిటివ్ వచ్చిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించింది. అలాగే ఈ ఒక్క రోజే ఏడుగురు కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 30,946కి చేరిపోవడం ఆందోళన కలిగిస్తోంది. అలాగే కరోనా మృతుల సంఖ్య 331కి పెరిగింది. ఈ ఒక్క రోజులో 913 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా తీవ్రత నేపథ్యంలో తెలంగాణలో మరీ ముఖ్యంగా హైదరాబాద్ లో లాక్ డౌన్ పరిస్థితులు ఏర్పడ్డాయని అంతా భావించారు. అయితే ప్రభుత్వం అందుకు సిద్ధంగా లేదని తేలిపోయింది. నిత్యం కరోనా పరిస్థితుల గురించి అధికారులతో సమీక్షించే ముఖ్యమంత్రి కేసీయార్ ఫాంహౌస్ లోనే ఉండిపోయారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి తలసాని కరోనా వైరస్ స్థితిగతులుపై మాట్లాడారు. విపక్షాలపై విరుచుకుపడ్డారు కరోనా సమస్య ప్రపంచం అంతా ఉందని, ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం నూటికి డెబ్బై మందికి కరోనా వచ్చే అవకాశం ఉందని ,దానిని దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తలు తీసుకోవాలన్నా మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్. కొందరికి కరోనా వారికి తెలియకుండా వచ్చి పోతోందని ఆయన చెప్పారు. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో మరోసారి లాక్ డౌన్ వల్ల లాభం లేదని, మరింత నష్టం తప్ప మరొకటి కాదని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని, చాలామంది కోలుకుంటున్నారని, హోం మంత్రి అలీ, ఉప సభాపతి పద్మారావు, కాంగ్రెస్ నేత వి.హెచ్ కూడా కోలుకున్నారని ఆయన అన్నారు. బేగంబజార్, సికింద్రాబాద్ జనరల్ బజార్ లు స్వచ్చందంగా మూసి వేశారని,కాని వారం రోజుల తర్వాత యదా ప్రకారం తెరవక తప్పలేదని ఆయన అన్నారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే బిజెపి నేతలు ఏవేవో మాట్లాడుతున్నారని తాము కూడా మాట్లాడవలసి వస్తుందని ఆయన హెచ్చరించారు.కేంద్రం ఏమి చేస్తోందని,తప్పట్లు కొట్టించి, దపాలు వెలిగిస్తే సరిపోతుందా అని అడగవచ్చని ఆయన అన్నారు. కానీ తామేం కేంద్రంపై విమర్శలు చేయడం లేదన్నారు. మరోవైపు కరోనా లాక్డౌన్ కాలంలో జనజీవనం స్తంభించడం వల్ల వైరస్ అదుపులో ఉన్నప్పటికీ ప్రభుత్వ సడలింపులతో వైరస్ వ్యాప్తి విస్తృతమైంది. ప్రస్తుతం రోజుకు రెండు వేలకు చేరువలో పాజిటివ్ కేసులు నమో దవుతున్నాయి. రాష్ట్రంలో వైరస్ వ్యాప్తిని పరిశీలిస్తే ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 51.13 శాతం కేసులు గత పది రోజుల్లోనే నమోదు అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల వేగాన్ని భారీగా పెంచింది. ఈ క్రమంలో పాజిటివ్ కేసుల సంఖ్యలోనూ పెరుగుదల నమోదవుతోంది. తెలంగాణ పాజిటివ్ కేసుల్లో 80 శాతానికిపైగా పాజిటివ్ కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే బయటపడడం పరిస్థితి తీవ్రతకు దర్పణం పడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 30 వేల పాజిటివ్ కేసులు నమోదైతే అందులో రెండొంతులకు పైగా పాజిటివ్‌లు జీహెచ్ఎంసీ ఏరియాలో ఉన్నాయి. దీంతో గ్రేటర్ ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. గ్రేటర్ తర్వాత రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో వైరస్ బారిన పడుతున్న వారు అధికంగా ఉన్నారు. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, నిజామాబాద్, కరీంగనర్ సంగారెడ్డి జిల్లాల్లోనూ వైరస్ ప్రభావం తీవ్రంగానే ఉంది.

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత
13 hours ago

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్
14 hours ago

షర్మిల దీక్ష..రచ్చ ఫిక్స్..పర్మిషన్ ప్రాబ్లమ్
13 hours ago

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.
17 hours ago

ఏపీ, తెలంగాణలో ఉత్కంఠ.. ఈ ఒక్కరోజు చాలా ఇంపార్టెంట్
18 hours ago

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జగన్
17 hours ago

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్
19 hours ago

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత
20 hours ago

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!
15 hours ago

ఎమ్మెల్యేల డ్రగ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు
21 hours ago
ఇంకా