newssting
BITING NEWS :
*ఢిల్లీ వెళ్లనున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌..రాష్ట్రపతి భవన్‌ లో విందుకు హాజరుకానున్న సీఎం కేసీఆర్‌ *రెండవ రోజు భారత్‌లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పర్యటన *దేవరకొండలో మంత్రి కేటీఆర్‌ పర్యటన. పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొని సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేయనున్న కేటీఆర్‌ *తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎన్‌ ఎన్నికల్లో నేడు నామినేషన్ల స్వీకరణ * కుప్పంలో రెండోరోజు పర్యటించనున్న చంద్రబాబు* ఏపీ స్థానికల రిజర్వేషన్లపై తీర్పు వెల్లడించనున్న ఏపీ హైకోర్టు ఫాలో అప్ *వివేకా హత్యకేసుపై తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు *ఇవాళ హైదరాబాద్ హౌస్ లో మోదీతో ట్రంప్ ద్వైపాక్షిక చర్చలు *ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్‌ గా రామ్‌ నివాస్‌ గోయల్ ఏకగ్రీవ ఎన్నిక*అమరావతి: 70వ రోజుకు చేరిన అమరావతి రైతుల ఆందోళనలు, మందడం, వెలగపూడి, తుళ్లూరులో రైతుల ధర్నాలు*వికారాబాద్: కొడంగల్ సమీపంలో రోడ్డు ప్రమాదం. బీజాపూర్ - హైదరాబాద్ హైవేపై కారును ఢీకొట్టిన లారీ. భార్యాభర్తలకు తీవ్రగాయాలు. హాస్పిటల్ కు తరలింపు*భారతీయ సినిమాలు గ్రేట్.. దిల్‌వాలే దుల్హనియా, షోలే చిత్రాలు గొప్పవి-డొనాల్డ్ ట్రంప్

మరో బలవన్మరణం.. సత్తుపల్లిలో మహిళా కండక్టర్ ఆత్మహత్య

28-10-201928-10-2019 14:27:30 IST
2019-10-28T08:57:30.069Z28-10-2019 2019-10-28T08:56:39.668Z - - 25-02-2020

మరో బలవన్మరణం.. సత్తుపల్లిలో మహిళా కండక్టర్ ఆత్మహత్య
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆర్టీసీ కార్మికులు ఉద్యమం ఉధృతం అవుతోంది. సమ్మె 24వ రోజుకి చేరుకుంది. కార్మికులు కుటుంబసభ్యులతో కలిసి కలెక్టరేట్లను ముట్టడిస్తున్నారు. ఇటు కార్మికుల గుండెపోట్లు, బలవన్మరణాలు కొనసాగుతున్నాయి. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఆర్టీసీ కండక్టర్ నీరజ ఆత్మహత్య చేసుకుంది. ఉద్యోగం పోయిందనే బాధతోనే నీరజ ఈఅఘాయిత్యానికి పాల్పడింది.

దీంతో సత్తుపల్లిలో ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. నీరజ మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆర్టీసీ జేఏసీ డిమాండ్ చేసింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలోనే నీరజ ఆత్మహత్యకు పాల్పడిందని బంధువులు, కుటుంబసభ్యులు చెబుతున్నారు.

ఆర్టీసీ సమ్మె ప్రారంభం అయిన వెంటనే ఖమ్మం డిపోకు చెందిన శ్రీనివాస్‌ రెడ్డి ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. నిజామాబాద్‌–2 ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా విధులు నిర్వర్తించే దూదేకుల గఫూర్‌,  ముషీరాబాద్‌ డిపోకి చెందినడ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న 37ఏళ్ళ రమేష్‌ గుండెపోటుతో మృతి చెందాడు. 

నార్కెట్‌పల్లి డిపోకు చెందిన కండక్టర్‌ వెంకటేశ్వర్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. హైదరాబాద్‌లో రాణిగంజ్ డిపోకి చెందిన ఆర్టీసీ ఉద్యోగి సుదర్శన్ ఆత్మహత్య  చేసుకున్నాడు. నల్లగొండ జిల్లా చిట్యాలకు చెందిన  మల్లయ్య నల్లగొండ RTC డిపోలో ADCగా పనిచేస్తున్నాడు. గుండెపోటుకి గురయి మరణించాడు.

మరోవైపు, కాంట్రాక్టు డ్రైవర్ల వల్ల ప్రమాదాలు కామన్ అయిపోయాయి. తాజాగా హైదరాబాద్ లో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. హబ్సిగూడ సిగ్నల్ దగ్గర ఆర్టీసీ బస్సు మూడు కార్లపైకి దూసుకెళ్లింది. దీంతో ప్రయాణికులకు ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు బాధ్యుడైన డ్రైవర్ పరారయ్యాడు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle