newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మరో నాలుగురోజులు అక్కడ వర్షాలే.. బీ అలర్ట్

21-08-202021-08-2020 07:58:12 IST
Updated On 21-08-2020 09:15:07 ISTUpdated On 21-08-20202020-08-21T02:28:12.684Z21-08-2020 2020-08-21T02:25:54.825Z - 2020-08-21T03:45:07.715Z - 21-08-2020

మరో నాలుగురోజులు అక్కడ వర్షాలే.. బీ అలర్ట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారీవర్షాలతో తెలంగాణ జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరికొన్ని రోజులు భారీ వర్షాలు తప్పేలా లేవు. రాబోయే నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు అనే ప్రాంతాల్లో కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం తెలిపింది.

ఉత్తర ఇంటీరియర్ ఒడిశాని ఆనుకుని ఉన్న ఝార్ఖండ్ ప్రాంతాల్లో ఏర్పడిన బంగాళాఖాతం మీదుగా వాయు తుఫాను సగటు సముద్ర మట్టానికి 7.6 కిలో మీటర్ల వరకు విస్తరించి ఉంది. దీంతో ఆగష్టు 23 వరకూ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది వాతావరణ శాఖ. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడే అవకాశం ఉంది. 

ఇక ఆగష్టు 23న మరో అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్‌, జయశంకర్ భూపాల పల్లి, ములుగు, ఖమ్మం, వరంగల్‌, నల్గొండ, సూర్యాపేట, జనగామ ప్రాంతాల్లో రాబోయే రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, రెండు రోజులు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.. గ్రేటర్‌ హైదరాబాద్‌, ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో ఒకటి రెండుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.

ఎగువ నుంచి వస్తున్న వరదతో శ్రీశైలం పూర్తిస్థాయిలో నిండిపోయింది. ఈ క్రమంలోనే 10 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఏకంగా 10 గేట్లు తెరవడంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. అక్కడి నాగార్జున సాగర్‌కు పరుగులు పెడుతోంది. ఇన్‌ఫ్లో పెరగడంతో నాగార్జున సాగర్ డ్యామ్‌ కూడా నిండిపోయింది. ఇవాళ ఉదయం సాగర్ డ్యామ్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. నాగార్జున సాగర్ గేట్లను తెరుస్తున్న నేపథ్యంలో డ్యామ్ పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు. 

 

నా రూటే సెప‌రేటు

నా రూటే సెప‌రేటు

   an hour ago


బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   14 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   15 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   15 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   19 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   20 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   18 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   21 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   21 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   16 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle