newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మరో చరిత్రకు గాంధీ సిద్ధం.. నేటి నుండి కరోనాకు ప్లాస్మా థెరపీ!

11-05-202011-05-2020 13:07:50 IST
Updated On 11-05-2020 13:13:26 ISTUpdated On 11-05-20202020-05-11T07:37:50.506Z11-05-2020 2020-05-11T07:37:47.821Z - 2020-05-11T07:43:26.716Z - 11-05-2020

మరో చరిత్రకు గాంధీ సిద్ధం.. నేటి నుండి కరోనాకు ప్లాస్మా థెరపీ!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ రాష్ట్రానికి తొలి కోవిడ్ - 19 హాస్పటిల్ గాంధీ ఇప్పుడు మరో చరిత్రకు సిద్ధమైంది. ఇప్పటికే గాంధీ ఆసుపత్రిని పూర్తిగా కరోనా కోసమే ప్రత్యేకంగా కేటాయించగా నేటి నుండి గాంధీ ఆసుపత్రిలోనే కరోనా మహమ్మారికి చికిత్సలో కీలకంగా భావిస్తున్న ప్లాస్మా థెరపీని కూడా మొదలుపెట్టనున్నారు. ఇందుకోసం ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌  రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) అనుమతి పొందింది.

ఇప్పటికే గాంధీ దవాఖానాలో ప్లాస్మా థెరపీకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తిచేయగా గాంధీ వైద్యులు కూడా అందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే నేటి నుండి మొదలయ్యే ప్లాస్మా థెరపీ క్లినికల్ ట్రయిల్ మాత్రమేనని దాదాపుగా తొంబై శాతం ఇది విజయవంతమయ్యే అవకాశాలు ఉన్నాయని వైద్యులు చెప్తున్నారు. కరోనా రోగులకు ఈ ప్లాస్మా థెరపీ ఎంత మాత్రం ఉపయోగపడుతుందో ఈసీఎంఆర్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తుంది.

ఇంతకీ ఈ ప్లాస్మా థెరపీ ఏంటి? కరోనా రోగులకు ఇది ఏవిధంగా పనిచేస్తుంది? అసలు ఈ విధానానికి మూలం ఏంటి? అనే దానిపై వైద్యుల సమాధానాలు ఇలా ఉన్నాయి. ప్రస్తుతం కరోనా వ్యాధికి ఎలాంటి నిర్దిష్ట చికిత్స లేదు. కరోనాకు చికిత్స అందించే మందు కూడా లేదు. వ్యాక్సిన్ తయారీ కోసం ఇప్పటికీ ప్రపంచదేశాలు ముమ్మర ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి.

ప్రస్తుతానికి అయితే ప్రపంచ దేశాలు ఆయా దేశాలలో పరిస్థితులను బట్టి ఫ్లూ, ఎయిడ్స్ వ్యాధులకు వాడే మందులనే కరోనాకు చికిత్సలో వాడుతున్నారు. అయితే కరోనా రోగులలో కొందరు మహమ్మారిపై పోరాటంలో తమ శరీరంలో యాంటీ బాడీస్ ఫైట్ చేయలేకపోవడంతో తిరిగి కోలుకోలేక ప్రాణాలను కోల్పోతున్నారు. వెంటిలేటర్స్ మీద చికిత్స అందించినా శరీరంలో యాంటీ బాడీస్ వృద్ధిలేక ప్రాణాలు విడుస్తున్నారు.

ఈక్రమంలో ప్లాస్మా థెరపీ ద్వారా రోగి శరీరంలోకి యాంటీ బాడీలను పంపడమే ఈరోజు గాంధీలో అవిష్కృతమయ్యే ప్రయోగం. ఎలాంటి వ్యాక్సిన్, మందులేని వ్యాధికి యాంటీ బాడీస్ ఎక్కడ తరయారవుతాయి? అంటే ఇప్పటికే కరోనా సోకి కోలుకోనున్న వారి శరీరంలోనే కరోనాను ఎదుర్కొనే యాంటీ బాడీస్ తయారవుతాయి. అలా ఫైట్ చేయడంతోనే వారు కరోనాను ఎదుర్కోగలిగారు.

ఇప్పటికే కరోనాకు గాంధీలో చికిత్స చేయించుకొని వెళ్లిన 15 మంది తమ బాడీలో ప్లాస్మాను ఇచ్చేందుకు సిద్దపడగా ఇది సక్సెస్ అయితే మరో 200 మంది కూడా అందుకు సిద్ధంగా ఉన్నారు. ఇందులో భాగంగా కరోనా నుండి కోలుకున్న వ్యక్తి నుండి రక్తంలోని ప్లాస్మాను సేకరించి అందులోని యాంటీ బాడీస్ ను కరోనాకు చికిత్స పొందుతున్న రోగికి ఎక్కిస్తారు.

అంటే చికిత్స పొందే రోగి శరీరం యాంటీ బాడీస్ తయారుచేయలేని స్థితితో పాటు సమయం కూడా ఎక్కువగా లేనపుడు ఈ పద్దతి ద్వారా కృత్రిమంగా రోగి శరీరంలోకి యాంటీ బాడీస్ పంపి కరోనాను ఎదుర్కొనేలా చేయనున్నారు. ఇందుకు ప్రస్తుతం చికిత్స పొందుతున్న రోగి బ్లడ్ గ్రూప్.. కరోనా సోకి కోలుకున్న వ్యక్తి బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కావాల్సి ఉంటుంది. ఈ థెరపీ సక్సెస్ అయితే దాదాపుగా కరోనా మరణాలను అధిగమించవచ్చు!

 

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

   4 hours ago


తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

   5 hours ago


అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

   34 minutes ago


“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

   7 hours ago


ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

   8 hours ago


వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

   6 minutes ago


ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

   2 hours ago


తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

   8 hours ago


ఇక కేటీఆర్ టైం వ‌చ్చిన‌ట్లేనా

ఇక కేటీఆర్ టైం వ‌చ్చిన‌ట్లేనా

   9 hours ago


బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమం

బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమం

   18-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle