newssting
BITING NEWS :
* భారత్ లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు 1, 45, 380.. మరణాలు 4167*ఏపీలో 2719 మృతులు 57, తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1920 * కరోనా వైరస్ మహమ్మారిపై పోరులో భారత్ కు చైనా సహకారం యథాతథం * మహారాష్ట్రలో 1695 కోవిడ్ మరణాలు.. కేసులు 17,082*భారత్ లో వారం రోజుల్లో 45 వేల కేసులు *ఏపీలో భారీగా పట్టుబడుతున్న తెలంగాణా మద్యం*హైకోర్టుకు చేరిన ఏపీ వికేంద్రీకరణ, సీఆర్డీఏ సవరణ బిల్లు వ్యవహారం*సిద్దిపేట:కొండపోచమ్మ సాగర్‌ ప్రారంభోత్సవం ముహూర్తం ఖరారు..ఈనెల 29న ఉ. 11:30 గంటలకు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ *జార్ఖండ్ లో ఘోర ప్రమాదం ఐదుగురి మృతి

మరో ఎన్నికలకు రెడీ.. సహకారసంఘాలకు నోటిఫికేషన్

31-01-202031-01-2020 16:40:02 IST
2020-01-31T11:10:02.838Z31-01-2020 2020-01-31T11:09:55.185Z - - 27-05-2020

మరో ఎన్నికలకు రెడీ.. సహకారసంఘాలకు నోటిఫికేషన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో వరుసగా ఎన్నికల జాతర కొనసాగుతోంది. ఇటీవల మునిసిపల్ ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే. తాజాగా చివరిసారి ఎన్నికలకు ముహూర్తం కుదిరింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి జనవరి 30 గురువారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదలు చేశారు. దీనికి సంబంధించి ఫిబ్రవరి 3న ఎన్నికల నోటీస్ జారీ చేస్తారు. 6 నుండి 8వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఫిబ్రవరి 9న వాటిని పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 10 వరకు గడువు నిర్దారించారు.

ఎన్నికల బరిలోని అభ్యర్థులకు అదే రోజు గుర్తులు కేటాయించనున్నారు. ఫిబ్రవరి 15న ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా 906 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలున్నాయి. ఇందులో 18 లక్షల 42 వేల 412 మంది ఓటర్లున్నారు. సహకార సంఘాల కాల పరిమితి 2018 ఫిబ్రవరిలోనే ముగిసింది. 

2018లోనే ఎన్నికలు నిర్వహించాల్సి వున్నా.. డిసెంబర్ నాటికి అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు రావడంతో ఎన్నికలు ఆలస్యం అయ్యాయి. అసెంబ్లీ, పంచాయితీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, లోక్ సభ ఎన్నికలు జరిగాయి. గత ఏడాది కాలంగా తెలంగాణలో ఎన్నికల వాతావరణం నెలకొని వుంది. దీంతో నాలుగుపర్యాయాలు సహకార పరపతి సంఘాలకు 4 సార్లు ఇంఛార్జీల పాలనను పొడిగించారు.

సహకార పరపతి సంఘాలకు సంబంధించి స్టేట్‌‌ కోఆపరేటివ్‌‌ ఎలక్షన్‌‌ అథారిటీ ఎన్నికల నోటిఫికేషన్‌‌ విడుదల చేసింది. ఎన్నికలు పూర్తయిన మూడు రోజుల్లోగా సొసైటీ చైర్మన్, వైస్​ చైర్మన్లను​ఎన్నుకుంటారు. ఉమ్మడి జిల్లాలకు చెందిన డీసీసీబీలకే ఎన్నికలు నిర్వహించనున్నారు. సహకార పరపతి సంఘాలకు ఎన్నికలు జరిగి ఏడేళ్ళు అవుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో 2013 జనవరిలో సహకార ఎన్నికలు జరిగాయి. 2017 డిసెంబర్​నాటికి పాలకవర్గాల గడువు ముగిసింది. 2018 డిసెంబర్​31 నాటికి సొసైటీల్లో సభ్యత్వం కలిగిన వారికే ఓటు హక్కు కల్పించారు. హైదరాబాద్‌‌ మినహా 9 ఉమ్మడి జిల్లాల్లో డీసీసీబీలు వున్నాయి. 

ఏపీలో మాల్స్, జ్యూయలరీ, ఫుడ్ టేక్ అవేలకు అనుమతి

ఏపీలో మాల్స్, జ్యూయలరీ, ఫుడ్ టేక్ అవేలకు అనుమతి

   36 minutes ago


రమణదీక్షితులు సంచలన వ్యాఖ్యలు

రమణదీక్షితులు సంచలన వ్యాఖ్యలు

   an hour ago


ఆన్ లైన్లో మహానాడు.. జూమ్ యాప్ ద్వారా 14వేలమందికి అవకాశం

ఆన్ లైన్లో మహానాడు.. జూమ్ యాప్ ద్వారా 14వేలమందికి అవకాశం

   an hour ago


కరువు సీమకు నీటిని ఇస్తామంటే ఇంతవివాదమా.. జగన్ ప్రశ్న

కరువు సీమకు నీటిని ఇస్తామంటే ఇంతవివాదమా.. జగన్ ప్రశ్న

   2 hours ago


లాక్ డౌన్‌పై కేసీయార్ కీలక నిర్ణయం

లాక్ డౌన్‌పై కేసీయార్ కీలక నిర్ణయం

   2 hours ago


కన్నాపై మంత్రి వెల్లంపల్లి హాట్ కామెంట్స్

కన్నాపై మంత్రి వెల్లంపల్లి హాట్ కామెంట్స్

   2 hours ago


ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై బండి సంజ‌య్ ఆశ‌లు నెర‌వేరేనా..?

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై బండి సంజ‌య్ ఆశ‌లు నెర‌వేరేనా..?

   3 hours ago


హైకోర్టు ఆగ్రహం.. 49 మంది వైసీపీ నేతలకు నోటీసులు!

హైకోర్టు ఆగ్రహం.. 49 మంది వైసీపీ నేతలకు నోటీసులు!

   4 hours ago


తెలంగాణలో వైరస్ ఉధృతి.. టెస్టులు తక్కువ.. కేసులు ఎక్కువ!

తెలంగాణలో వైరస్ ఉధృతి.. టెస్టులు తక్కువ.. కేసులు ఎక్కువ!

   4 hours ago


ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

   17 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle