newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మరోసారి లాక్ డౌన్ ఆలోచన.. మందుబాబుల ముందుచూపు

01-07-202001-07-2020 19:21:21 IST
2020-07-01T13:51:21.310Z01-07-2020 2020-07-01T13:51:03.734Z - - 12-04-2021

మరోసారి లాక్ డౌన్ ఆలోచన..  మందుబాబుల ముందుచూపు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రపంచం ఏమైపోయినా కొంతమందికి పట్టదు. తమ కడుపు నిండితే చాలనే ధోరణి వారిది. లాక్ డౌన్ టైంలో కరోనా వైరస్ గురించి ఆలోచించకుండా మందుషాపులు ఎప్పుడు తెరుస్తారని ఆలోచించారు. తర్వాత వారి గోడు విన్న ప్రభుత్వాలు మాత్రం వైన్ షాపులు తెరిచేందుకు అనుమతించాయి. మొదటిసారి లాక్‌డౌన్‌ విధించినప్పుడు మార్చి 25న మద్యం దుకాణాలు మూతబడి మే6న తెరుచుకున్నాయి. భౌతిక దూరం, మాస్కు నిబంధనలు విధించి మందుషాపులు తెరిచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. 

హైదరాబాద్‌లో మరోసారి లాక్‌డౌన్‌ ప్రకటించడానికి ప్రభుత్వం సిద్ధమవుతుండడంతో మందుబాబులు వైన్స్‌ దుకాణాల ఎదుట బారులుతీరుతున్నారు. భౌతిక దూరం, మాస్కుల సంగతి పక్కన పెట్టి మందు సీసాల కోసం ఎగబడుతున్నారు. మొదట్లో లాక్‌డౌన్‌ విధించినప్పుడు మద్యం లేక చాలా మంది మానసికంగా ఇబ్బందులు పడి ఎర్రగడ్డ దవాఖానలో సైతం చేరిన సంగతి తెలిసిందే. కొందరయితే ప్రాణాలు కూడా వదిలారు. విచిత్రంగా ప్రవర్తించారు. మళ్లీ ఈసారి లాక్‌డౌన్‌ విధిస్తే అలాంటి ఇబ్బందులు రాకూడదని ఉద్దేశంతో ముందే మద్యం కొనుగోలు చేసి స్టాక్‌ పెట్టుకోవాలని మందుబాబులు వైన్స్‌ ఎదుట క్యూ కడుతున్నారు. 

గత కొద్దిరోజులుగా నగరంలో మద్యం అమ్మకాలు జోరందుకున్నాయని పటన్ చెరుకి చెందిన వైన్స్‌ షాపు నిర్వాహకులు ఒకరు ‘న్యూస్ స్టింగ్’ తో చెప్పారు. వినియోగదారుల డిమాండ్‌ మేరకు ఎక్కువ మొత్తంలో స్టాక్‌ తెస్తున్నామని  తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్ సడలింపుల కారణంగా రాత్రి 8 గంటలకు మద్యం దుకాణాలు మూసివేస్తున్నారు. ఒక వేళ మరో రెండురోజుల్లో లాక్‌డౌన్‌ విధిస్తే పూర్తిగా మూతబడతాయి. అందుకే అలాంటి పరిస్థితి రాకుండా మందుబాబులు ముందుచూపుతో వ్యవహరిస్తున్నాయి. 

 

 

 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle