newssting
BITING NEWS :
*కార్మికులతో చర్చలు జరపండి: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఆదేశం * విశాఖ భూ కుంభకోణంపై సిట్‌ ఏర్పాటు * ఆర్టీసీ జేఏసీ సమావేశం.*ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ.. కోర్టుకు నివేదిక సమర్పించిన తెలంగాణ ప్రభుత్వం*హైదరాబాద్‌ వనస్థలిపురంలో దారుణం...ప్రియురాలిని భవనం పైనుంచి కిందకు నెట్టి చంపిన ప్రియుడు*కేబినెట్ సమావేశాల నిర్వాహణలో సీఎం జగన్ కీలక నిర్ణయం..ఇకపై నెలలో రెండు సార్లు మంత్రి వర్గ సమావేశం *ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెపై గవర్నర్ తమిళిసై ఆరా...మంత్రి పువ్వాడ అజయ్ తో ఫోన్‌ లో మాట్లాడిన గవర్నర్ *హూజూర్‌నగర్‌లో భారీ వర్షం.. మార్గ మధ్యలో కూడా ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షం.. కేసీఆర్ టూర్ రద్దు

మరోసారి జగన్ -కేసీఆర్‌ల కీలక భేటీ

25-06-201925-06-2019 09:05:23 IST
2019-06-25T03:35:23.128Z25-06-2019 2019-06-25T03:30:31.112Z - - 19-10-2019

మరోసారి జగన్ -కేసీఆర్‌ల కీలక భేటీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు మరోసారి కలుసుకోబోతున్నారు. ఏపీ,తెలంగాణ రాష్ట్రాలలో జల వివాదాలపై ఓ సమగ్ర విధానం ఉండాలని యోచించిన రెండు రాష్ట్రాల సీఎంలు కలిసి ఓ కార్యాచరణ రూపొందించడానికి సిద్ధమవుతున్నారు. 

ఈ నెల 28న హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో ఇరు రాష్ట్రాల సీఎంలు సమావేశం కానున్నారు. ఏపీ, తెలంగాణ జల వివాదాల పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలపై కేసీఆర్, జగన్ చర్చిస్తారు. గోదావరి జలాలను శ్రీశైలం ప్రాజెక్టుకు తరలింపు, లింక్ కెనాల్ వంటి అంశాలపై చర్చిస్తారని సమాచారం. కాళేశ్వరం ప్రారంభం సందర్భంగా కేసీఆర్-జగన్ కాసేపు మాట్లాడుకున్నారు. త్వరలో భేటీ కావాలని సంకల్పించారు. దీంట్లో భాగంగా ఈ సమావేశం జరగనుంది. 

ఐదేళ్ళుగా పరిష్కారానికి నోచుకోని అనేక సమస్యలు గత నెలరోజులుగా చర్చకు వచ్చాయి. హైదరాబాద్ లోని ఏపీ భవనాలను తెలంగాణ అప్పగించే ప్రక్రియ శరవేగంగా సాగుతున్నది. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న క‌ృష్ణానదీ జలాల జగడాలను కూడా చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.

జూన్ 29న కూడా ఇరువురు సీఎంలు మరోసారి భేటీ అవుతారని తెలంగాణ ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఇద్దరు సీఎంలు సమావేశమై ఇరు రాష్ట్రాల జలవివాదాలపై కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశమున్నట్లు సమాచారం.

తెలంగాణలోని మహబూబ్‌నగర్‌, నల్గొండ, రంగారెడ్డి, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం, కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాలకు ఎక్కువ నీటి వినియోగం జరగాలంటే గోదావరి నీటిని ఎక్కడి నుంచి మళ్లించేలా చేపడితే ఎక్కువ ప్రయోజనం ఉంటుందన్నదానిపై జలవనరుల నిపుణులతో చర్చిస్తారు. వర్షాకాలం కాబట్టి వరద నీటిని వృధా కాకుండా అరికట్టేందుకు చర్చలు చేపడతారు.

ఈ నెల 28న సమావేశం గురించి అధికారికంగా సమాచారం లేకున్నా సీఎంల సూచన మేరకు రెండు రాష్ట్రాల అధికారులు కసరత్తు ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం సంబంధిత అధికారులతో భేటీ అయి, అవసరమయిన సమాచారం సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. 

 

లెక్క తేలింది.. మద్యం దరఖాస్తుల ద్వారా రూ. 960 కోట్లు

లెక్క తేలింది.. మద్యం దరఖాస్తుల ద్వారా రూ. 960 కోట్లు

   9 hours ago


కార్మికులతో చర్చలు జరపండి: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఆదేశం

కార్మికులతో చర్చలు జరపండి: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఆదేశం

   10 hours ago


‘మహా’లో పట్టు నిలిచేనా? హర్యానాలో హవా సాగేనా?

‘మహా’లో పట్టు నిలిచేనా? హర్యానాలో హవా సాగేనా?

   10 hours ago


టీఆర్ఎస్‌లో తిరుగుబాటు.. కేసీఆర్ సర్కార్ పై నీలినీడలు

టీఆర్ఎస్‌లో తిరుగుబాటు.. కేసీఆర్ సర్కార్ పై నీలినీడలు

   10 hours ago


జర్నలిస్టు హత్య కేసు:ప్రాణహాని ఉందని చెప్పినా పట్టించుకోలేదా?

జర్నలిస్టు హత్య కేసు:ప్రాణహాని ఉందని చెప్పినా పట్టించుకోలేదా?

   11 hours ago


హుజూర్‌నగర్లో హోరాహోరీ.. గెలుపెవరిది?

హుజూర్‌నగర్లో హోరాహోరీ.. గెలుపెవరిది?

   11 hours ago


ఆ విషయంలో జగన్ కంటే వైఎస్సే బెస్ట్.. బాబు కామెంట్స్

ఆ విషయంలో జగన్ కంటే వైఎస్సే బెస్ట్.. బాబు కామెంట్స్

   13 hours ago


జేసీ బ్రదర్స్‌ప్రై ప్రతీకారం మొదలైనట్లేనా..

జేసీ బ్రదర్స్‌ప్రై ప్రతీకారం మొదలైనట్లేనా..

   13 hours ago


దేవుడు కూడా కేసీఆర్‌‌ను వ్యతిరేకిస్తున్నాడుగా.. దాసోజు ఎద్దేవా

దేవుడు కూడా కేసీఆర్‌‌ను వ్యతిరేకిస్తున్నాడుగా.. దాసోజు ఎద్దేవా

   14 hours ago


ఆర్టీసీ జేఏసీ నేత అశ్వథ్ధామరెడ్డి అరెస్ట్

ఆర్టీసీ జేఏసీ నేత అశ్వథ్ధామరెడ్డి అరెస్ట్

   14 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle