newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మరి కాస్సేపట్లో తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు

07-09-202007-09-2020 07:31:30 IST
2020-09-07T02:01:30.797Z07-09-2020 2020-09-07T02:01:27.744Z - - 15-04-2021

మరి కాస్సేపట్లో తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మరి కాస్సేపట్లో తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కరోనా నేపథ్యంలో సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే శాసనసభ వర్షాకాల సమావేశాల నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. సుమారు 20 రోజుల పాటు సమావేశాలు నిర్వహిస్తామనే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటన నేపథ్యంలో సభను సజావుగా నిర్వహించేందుకు అసెంబ్లీ యంత్రాంగం అన్ని జాగ్రత్తలు తీసుకుంది. 

ప్రధానంగా శాసనసభ సమావేశ మందిరంలోనూ, బయటా భౌతిక దూరానికి ప్రాధాన్యతిస్తూ సభ్యులు, ఇతరుల ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకుని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి, స్పీకర్, మండలి చైర్మన్, మంత్రులతో పాటు సభ్యులందరికీ పార్టీలకతీతంగా కరోనా నిర్ధారణ పరీక్షలు తప్పనిసరి చేశారు. దీంతో మూడు రోజులుగా అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్‌తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మార్షల్స్, మీడియా ప్రతినిధులు, పోలీసులు, మంత్రుల పీఏలు, పీఎస్‌లు శాసనసభ ఆవరణలో కరోనా పరీక్షలు చేయించుకున్నారు.

సమావేశాల ప్రారంభంలోనే మాజీ రాష్ట్రపతి ప్రణబ్, ఎమ్మెల్యే రామలింగారెడ్డి సంతాప తీర్మానాలు పెడుతారు. సంతాప తీర్మానం తర్వాత బీఏసీ సమావేశం నిర్వహిస్తారు. అసెంబ్లీ, మండలి అజెండా, పనిదినాలను బీఏసీ ఖరారు చేయనుంది. ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి రద్దు చేశారు. సోమవారం రాత్రి 7.30 గంటలకు ప్రగతి భవన్‌లో కేబినెట్ సమావేశాన్ని నిర్వహిస్తారు. కొత్తగా రూపొందించిన రెవెన్యూ చట్టాలతో పాటు.. శాసనసభలో ప్రవేశపెట్టాల్సిన ఇతర బిల్లులపై కేబినెట్ చర్చించనుంది. 

శాసనసభ, మండలిలో భౌతిక దూరానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ సీటింగ్‌ ఏర్పాట్లు చేశారు. 119 మంది సభ్యులున్న శాసనసభలో 45, శాసన మండలిలో 40 మంది సభ్యుల కోసం ఎనిమిది సీట్లు అదనంగా ఏర్పాటు చేశారు. భౌతిక దూరం పాటించేలా విజిటర్స్‌ గ్యాలరీని మీడియా ప్రతినిధులకు కేటాయిస్తూ ఏర్పాట్లు చేశారు. శాసనసభ ఆవరణలో రద్దీని తగ్గించేందుకు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల వ్యక్తిగత సహాయకులకు అనుమతి నిరాకరించడంతో పాటు మీడియా, అధికారులకు జారీ చేసే పాస్‌ల సంఖ్యను భారీగా కుదించారు. 

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తీసుకోనున్న జాగ్రత్తలు

మాస్క్‌లు, కరోనా నిర్ధారణ పరీక్షలు చేసుకున్న వారికే అనుమతి. ప్రవేశ ద్వారం వద్ద శరీర ఉష్ణోగ్రత కొలిచే పరికరాలు, శానిటైజర్ల ఏర్పాటు. సభ్యులకు ఆక్సీమీటర్, శానిటరీ బాటిల్, మాస్క్‌లతో కూడిన కిట్లు. జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలు ఉంటే అనుమతి నిరాకరణ. అసెంబ్లీ పరిసరాలు, మీటింగ్‌ హాళ్లలో రెండుసార్లు శానిటైజేషన్‌. అసెంబ్లీ ఆవరణలో రెండు డయాగ్నస్టిక్‌ కేంద్రాలు, అంబులెన్స్‌లు. మీడియా పాయింట్‌ ఎత్తివేత, గ్యాలరీలోకి సందర్శకులకు నో ఎంట్రీ. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల పీఏలు, వ్యక్తిగత సిబ్బందిని అనుమతించరు. చర్చల సందర్భంగా ముఖ్య అధికారులకు మాత్రమే లోనికి అనుమతి

ఈ నెల 7 నుంచి జరగనున్న శాసనసభ, మండలి సమావేశాలకు హాజరయ్యే ప్రతి సభ్యుడూ కరోనా పరీక్ష చేయించుకుని రావాల్సిందేనని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. రిపోర్టుల్లో నెగెటివ్‌ అని తేలితేనే అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. శాసనసభ, మండలి సభ్యులు, అసెంబ్లీ సిబ్బంది, మీడియా ప్రతినిధులు, పోలీసులు, పోలీస్‌ మార్షల్స్‌, మంత్రుల వెంట వచ్చే పీఏలు, పీఎ్‌సలు తప్పనిసరిగా టెస్టులు చేయించుకుని ఆరో తేదీకల్లా రిపోర్టులతో సిద్ధంగా ఉండాలని సూచించారు. 

 

నా రూటే సెప‌రేటు

నా రూటే సెప‌రేటు

   an hour ago


బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   14 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   15 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   15 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   19 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   20 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   18 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   21 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   21 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   16 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle