newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మనుషులతో కరోనా వికటాట్టహాసం.. సైకిల్ పై మృతదేహం!

20-04-202020-04-2020 17:20:43 IST
Updated On 20-04-2020 17:33:48 ISTUpdated On 20-04-20202020-04-20T11:50:43.560Z20-04-2020 2020-04-20T11:50:41.544Z - 2020-04-20T12:03:48.903Z - 20-04-2020

మనుషులతో కరోనా వికటాట్టహాసం.. సైకిల్ పై మృతదేహం!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేయడమే కాదు కొందరు మనుషులను స్వార్థపరులను చేసేసింది. కొందరు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా మానవాళి కోసం పాటుపడుతుంటే మరికొందరు వైరస్ అనే అడ్డుగోడను కట్టుకొని సోషల్ డిస్టెన్స్ సాక్షిగా సమాజాన్ని చీడగా చూసేస్తున్నారు. అయితే ఎవరికి వారు ప్రాణభయంతో మానవత్వాన్ని చాటే అవకాశం లేకుండా పోయిందని వైరస్ మీద నెపం నెట్టేస్తున్నారు.

ఈమధ్యనే తెలుగు రాష్ట్రమైన ఏపీలోని నెల్లూరులో ఓ వైద్యుడు కరోనాతో చనిపోతే దహన సంస్కారాలు చేయడానికి కూడా ఎవరూ ముందుకు రాలేదని.. కనీసం స్మశాన వాటికలో కూడా సంస్కారాలు చేయడానికి స్థానిక ప్రజలు ఒప్పుకోలేదని కరోనాపై జాగ్రత్తలు తీసుకోకపోతే ఈ చావే దిక్కవుతుందని మీడియా ప్రజలను భయపెట్టింది. కరోనా ఎంత ప్రమాదకరమో ప్రజలకు తెలిపే క్రమంలో ఇది ఒక భాగమే.

ఆ వైద్యుడిదే అనాధ చావని భావిస్తే తాజాగా మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో ఓ వ్యక్తి మరణాన్ని ఏమనాలో కూడా తెలియని పరిస్థితి. ఆ వ్యక్తికి కరోనా సోకలేదు కానీ కరోనా ప్రభావంతో వచ్చిన ఆకలి.. వైద్యం అందకపోవడం వంటి కారణాలతో అయనను చచ్చాక కూడా శవాన్ని అందగానే మిగిల్చేసింది. బ్రతికిన కాలమంతా అనాధగానే బ్రతికి చివరికి అనాధ శవంగానే మిగిలిపోయాడు.

నిర్మల్ ఈద్ గావ్‌కి చెందిన మహారాజ్ లింగ్ రాజు(44) అనే వ్యక్తి కామారెడ్డి రైల్వేస్టేషన్లో హామాలిగా పనిచేసేవాడు. కరోనా కారణంగా దేశమంతా లాక్‌డౌన్ ఉండటం వల్ల గాంధీ గంజ్ ప్రాంతంలో తలదాచుకుంటున్నాడు. ఇక్కడ దాతలిచ్చే ఆహార పొట్లాలతో కడుపు నింపుకుంటూ ఒంటరిగా జీవిస్తున్న రాజు శనివారం రాత్రి చనిపోయాడు. ఆదివారం ఉదయం దుర్వాసనతో స్థానికులు పోలీసులకి సమాచామిచ్చారు.

రైల్వేస్టేషన్ కు వచ్చిన పోలీసులు రాజు మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించాలని భావించి సాయం పట్టమని స్థానికుల్ని కోరారు. అయితే, కనీసం ఇంట్లో వారిని కూడా బయటకి వెళ్లివస్తే అనుమానంతో చూస్తున్న కరోనా కాలంలో ఓ అనాధ శవాన్ని తాకేందుకు ప్రజలు ముందుకు వస్తే దానిని కలికాలం అని ఎందుకు అంటాం. అందుకే ఒక్కరు కూడా ముందుకు రాలేదు.

పోలీసుల వద్ద కూడా మృతదేహాన్ని తరలించేందుకు వాహనం లేకపోవడంతో ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. దీంతో చివరికి పోలీసులే రైల్వేలో అనాధ శవాలని సంస్కరించే వారికి సమాచారమివ్వడంతో రాజు అనే వ్యక్తి శవాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అతను కూడా శవాన్ని ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో చివరికి శవాన్ని ఒక దుప్పటిలో చుట్టి తన సైకిల్ పైనే ఆసుపత్రికి తీసుకెళ్లాడు.

రైల్వేస్టేషన్ నుండి ఆసుపత్రి వరకు శవాన్ని అలా సైకిల్ మీద తీసుకెళ్తుంటే చూసిన వారికి ఎంత విదారకంగా అనిపిస్తుందో మనం ఊహించుకోవచ్చు. చావు ఏదో ఒక రోజు అందరికీ వచ్చేదే. పచ్చి నిజమైనా ఎందుకో ఒప్పుకొనేందుకు మన మనస్సాక్షి ఒప్పుకోదు. అందుకే ఆ చావు ఎక్కడ మన వరకు వస్తుందో అని ఇలాంటి వారు ఆనాధలుగానే మిగిలిపోతున్నారు. చివరికి ఆ ప్రాణ భయమే లింగ్ రాజ్ ను అనాధ శవంగానే బూడిద చేసింది!

 

 

కోవిడ్  వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

   3 hours ago


మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

   4 hours ago


ఆదుకుంటున్న ఆంధ్రప్రదేశ్.. ప్రశంసలు

ఆదుకుంటున్న ఆంధ్రప్రదేశ్.. ప్రశంసలు

   an hour ago


గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

   4 hours ago


ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

   5 hours ago


క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

   6 hours ago


క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

   6 hours ago


 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   a day ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   22-04-2021


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   22-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle