newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మనసులో మాట బయటపెట్టిన జగ్గారెడ్డి

10-08-202010-08-2020 18:42:38 IST
Updated On 10-08-2020 18:46:24 ISTUpdated On 10-08-20202020-08-10T13:12:38.158Z10-08-2020 2020-08-10T13:12:28.563Z - 2020-08-10T13:16:24.614Z - 10-08-2020

మనసులో మాట బయటపెట్టిన జగ్గారెడ్డి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ. నేతలంతా తమదైన రీతిలో మాట్లాడుతుంటారు. పదవులకు పోటీ కూడా ఎక్కువే. కాంగ్రెస్ పార్టీలో సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఆయన పార్టీ విషయంలోనూ, సీఎం కేసీఆర్ విషయంలోనూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తారు. గతంలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి తనకు ఇవ్వాలని కోరిన జగ్గారెడ్డి ఇప్పుడు ఏకంగా టీపీసీసీ చీఫ్ గా తనకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు.

సొంత పార్టీ నేతల పైన అయినా సరే ఆరోపణలు, వివాదాస్పద వ్యాఖ్యలు చేసే జగ్గారెడ్డి తాజాగా తనకు టీపీసీసీ అధ్యక్ష పదవి కావాలని తన మనసులోని మాట బయటపెట్టారు.గత కొంత కాలంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థానంలో కొత్త టీపీసీసీ అధ్యక్షుడు ఎంపిక కోసం కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తుంది . ఇక ఈ నేపధ్యంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. 

టీపీసీసీ అధ్యక్షుడిని మార్చి కొత్త అధ్యక్షుడిని నియమిస్తారనే చర్చ జరుగుతోందని పేర్కొన్న ఆయన ఢిల్లీలో టీపీసీసీ మార్పుపై చర్చ జరుగుతున్నదనే సమాచారం తనకు ఉందన్నారు. టీపీసీసీ చీఫ్ రేసులో తన పేరు కూడా ఉందని జగ్గా రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎప్పుడు అధ్యక్షుడిని మార్చాలి అనుకున్నా, తనకు అవకాశం ఇవ్వాలని ఆయన అన్నారు.

ఈ విషయంలో సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి తన విజ్ఞప్తిని తెలియజేస్తున్నానని అన్నారు. తనకు అవకాశం ఇస్తే పార్టీ సీనియర్ల సహకారంతో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తానని జగ్గారెడ్డి పేర్కొన్నారు. నేను అమ్ముడు పోయే వ్యక్తిని కాదు అని తన గురించి తెలుసుకోవాలంటే కెవిపిని కానీ, కిరణ్ కుమార్ రెడ్డిని గానీ అడగాలని, తన గురించి వారు పూర్తిగా చెప్తారని జగ్గారెడ్డి అంటున్నారు.

తనకు టీపీసీసీ అధ్యక్షునిగా పదవి ఇస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని, పార్టీని ముందుకు నడిపిస్తానని చెప్పారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. జగ్గారెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలతో మరోమారు టీపీసీసీ అధ్యక్ష పదవిపై ఆసక్తికర చర్చ జరుగుతుంది.

ఏపీలో స్కూల్స్ బంద్

ఏపీలో స్కూల్స్ బంద్

   an hour ago


వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

   an hour ago


జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

   5 hours ago


తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

   7 hours ago


అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

   2 hours ago


“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

   9 hours ago


ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

   9 hours ago


వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

   2 hours ago


ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

   4 hours ago


తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

   10 hours ago


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle