newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మధ్యప్రదేశ్ నుండి మద్యం అక్రమ రవాణా

27-04-202027-04-2020 12:53:17 IST
Updated On 27-04-2020 13:24:52 ISTUpdated On 27-04-20202020-04-27T07:23:17.602Z27-04-2020 2020-04-27T07:20:57.447Z - 2020-04-27T07:54:52.536Z - 27-04-2020

మధ్యప్రదేశ్ నుండి మద్యం అక్రమ రవాణా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
లాక్ డౌన్ కారణంగా మద్యం దొరకడం లేదు. ఎంత ఖర్చయినా మద్యం కొనుగోలు చేసేందుకు మందుబాబులు వెనుకాడడంలేదు. తాజాగా ఆసిఫాబాద్ జిల్లాలో అక్రమ మద్యం రవాణా గుట్టురట్టయింది.  లాక్ డౌన్ కారణంగా అక్రమ మద్యం దందా కు తెరలేపుతున్నారు కొందరు వ్యక్తులు.  మద్యం షాపులు బంద్ ఉండటంతో మద్యం అమ్మకాలు లేక మద్యం ప్రియుల అవసరాలను ఆసరాగా చేసుకున్న కొందరు వ్యాపారులు అక్రమ మార్గం గుండా  మధ్యప్రదేశ్ నుండి  అక్రమంగా మద్యం  మధ్యం తీసుకువచ్చి అమ్మకాలు సాగిస్తున్నారు. 

కొమురంభీం అసిఫాబాద్  జిల్లా కాగజ్‌నగర్‌ పట్టణంలో పోలీసులు అరెస్ట్ చేశారు  మధ్యప్రదేశ్ నుండి అక్రమంగా తీసుకువచ్చిన 45వేల రూపాయల విలువగల మద్యం పట్టుకున్న ఎక్సైజ్,మరియు టాస్స్ పోర్స్ అధికారులు. నిందితుల్ని అరెస్ట్ చేశారు. మార్కెట్ లో ఈ మద్యం విలువ లక్షన్నర రూపాయలు వుంటుందని చెబుతున్నారు. దీనికి సంబంధించి తొమ్మిది మంది పై కేసు నమోదు చేశారు ఎక్సైజ్ అధికారులు. లారీలో మధ్యప్రదేశ్ నుండి వచ్చిన 180 కార్టన్లను స్వాధీన పరుచుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో సంజయ్ సర్కార్,  కంబంపాటి అవినాష్ రాచర్ల వినయ్, కృష్ణ, సుమన్, కులదీప్ మండల్, గోపి, శ్రీకాంత్, సాధిక్ హుస్సేన్ ఉన్నారు. 

మెడిక‌ల్ షాపులో మ‌ద్యం సరఫరా.. 

దేశంలో క‌రోనా విస్త‌రిస్తున్న నేప‌థ్యంలో లాక్‌డౌన్ అమ‌ల్లో ఉంది. దీంతో మ‌ద్యం షాపులు కూడా మూత‌ప‌డ్డాయి. ఇదే అదునుగా కొంద‌రు అక్ర‌మార్కులు దొడ్డిదారుల్లో మ‌ద్యం అమ్మ‌కాలు మొద‌లు పెట్టారు. అందుకోసం ఏకంగా ఓ వ్యాపారి మెడిక‌ల్ షాపులోనే దందా సాగిస్తున్నారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో గణేష్‌పేట్ ప్రాంతంలోని ఓ మెడికల్ షాపు యజమాని లాక్‌డౌన్ నిబంధనలను క్యాష్ చేసుకోవాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా తన మెడికల్ షాపులోనే అక్రమంగా మద్యం అమ్మకాలను మొద‌లుపెట్టాడు.  

టానిక్ సీసాల్లో విస్కీ, బ్రాందీ, సెలైన్ బాటిల్స్ లో  జిన్ను, వోడ్కా నింపి రహస్యంగా అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నాడు. అయితే పోలీసుకలుకు సమాచారం అందడంతో పోలీసులు రంగంలోకి దిగారు. షాపుపై ఆక‌స్మీక త‌నిఖీ చెప‌ట్టారు. మంచినీళ్ల బాటిళ్లలో బీర్ పోసి అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో కేసు న‌మోదు చేసిన పోలీసులు షాపు యజమాని  అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు తప్పించుకున్నట్లు పోలీసులు తెలిపారు.

బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమం

బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమం

   4 hours ago


చంద్రబాబుపై ఎదురుదాడి.. కుప్పం ప్రస్తావన తీసుకొచ్చారుగా..!

చంద్రబాబుపై ఎదురుదాడి.. కుప్పం ప్రస్తావన తీసుకొచ్చారుగా..!

   5 hours ago


షర్మిల ఆరోగ్య పరిస్థితి ఇది..!

షర్మిల ఆరోగ్య పరిస్థితి ఇది..!

   3 hours ago


తిరుపతి పార్లమెంట్ ఎన్నికను రద్దు చేయాలి.. పెద్దిరెడ్డిపై విరుచుకుపడ్డ చంద్రబాబు

తిరుపతి పార్లమెంట్ ఎన్నికను రద్దు చేయాలి.. పెద్దిరెడ్డిపై విరుచుకుపడ్డ చంద్రబాబు

   6 hours ago


కూర‌లో క‌ర‌వేపాకు అయిన బండి సంజ‌య్

కూర‌లో క‌ర‌వేపాకు అయిన బండి సంజ‌య్

   30 minutes ago


జానారెడ్డి చేతిలో.. రేవంత్ రెడ్డి భ‌విష్య‌త్

జానారెడ్డి చేతిలో.. రేవంత్ రెడ్డి భ‌విష్య‌త్

   7 hours ago


అబ్బో స‌మ‌స్య‌ల‌పై కూడా జ‌గ‌న్ ఫోక‌స్ చేస్తున్నారా

అబ్బో స‌మ‌స్య‌ల‌పై కూడా జ‌గ‌న్ ఫోక‌స్ చేస్తున్నారా

   8 hours ago


కోవిడ్ ను ఎదుర్కోవడంలో మోడీ సర్కారు విఫలం.. సోనియా గాంధీ

కోవిడ్ ను ఎదుర్కోవడంలో మోడీ సర్కారు విఫలం.. సోనియా గాంధీ

   21 hours ago


కోరలుచాస్తున్న కరోనా.. బెంగాల్ లో ఐదో దశ పోలింగ్ .. నిబంధనలు పట్టని పార్టీలు

కోరలుచాస్తున్న కరోనా.. బెంగాల్ లో ఐదో దశ పోలింగ్ .. నిబంధనలు పట్టని పార్టీలు

   a day ago


దొంగ ఓట్ల రచ్చ.. స్పందించిన పెద్దిరెడ్డి రామ చంద్రా రెడ్డి

దొంగ ఓట్ల రచ్చ.. స్పందించిన పెద్దిరెడ్డి రామ చంద్రా రెడ్డి

   a day ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle