newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మద్యపాన ప్రియులకు అది లేకపోతే పిచ్చెక్కడం ఖాయం

01-04-202001-04-2020 14:39:24 IST
2020-04-01T09:09:24.792Z01-04-2020 2020-04-01T09:09:22.788Z - - 16-04-2021

మద్యపాన ప్రియులకు అది లేకపోతే పిచ్చెక్కడం ఖాయం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మద్యపానాన్ని ఉన్నట్లుండి ఆపివేస్తే విపరీత లక్షణాలు జనాలను ఆవహిస్తాయని కాబట్టి మందుబాబులకు లాక్ డౌన్ సమయంలో కూడా ఏదో ఒకవిధంగా మద్యం అందించడానికి ప్రభుత్వం పూనుకోవాలని బాలీవుడ్ అలనాటి హీరో రిషి కపూర్ కొన్నిరోజుల ముందు సలహా ఇస్తే అందరూ విరుచుకుపడ్డారు. కానీ ఇప్పుడు తన మాటే నిజమై దేశానికి కొత్త ఉపద్రవం ముంచుకొస్తోంది. గత పదిరోజులుగా మద్యం దొరక్క మందుబాబులు వింతగా వ్యవహరిస్తుంటే వారిని ఎర్రగడ్డ ప్రభుత్వ మానసిక వైద్యశాలకు కుటుంబ సభ్యులు తీసుకెళుతున్నారన్న వార్త తీవ్ర చర్చకు తావుతీసింది.

కరోనా వైరస్‌ కట్టడి చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్‌డౌన్‌ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో కేవలం నిత్యావసరాలకు సంబంధించిన షాప్‌లు తప్ప మిగతా షాప్‌లు మూత పడ్డాయి. వైన్‌ షాప్‌లు కూడా మూతపడటంతో మందుబాబులు పరిస్థితి దారుణంగా తయారైంది. రోజు మద్యం సేవించడం అలవాటు ఉన్నవారికి ఒక్కసారిగా మందు దొరక్కపోవడంతో తట్టుకోలేకపోతున్నారు. మద్యానికి బానిసైన ఒక్కరిద్దరు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు.

వారం రోజుల నుంచి మద్యం దొరక్కపోవడంతో మందుబాబులు వింతగా ప్రవరిస్తున్నారు. దీంతో ఆందోళనకు గురైన మందుబాబుల కుటుంబసభ్యులు.. వారిని ఎర్రగడ్డ ప్రభుత్వ మానసిక వైద్యశాలకు తీసుకువస్తున్నారు. దీంతో ఎర్రగడ్డ ఆస్పత్రికి రోజురోజుకు మందుబాబులు రాక పెరుగుతోంది. కాగా, వింతగా ప్రవరిస్తున్న మందుబాబులకు సంబంధించి రోజుకు వందకు పైగా కేసులు వస్తున్నట్టు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ఉమా శంకర్‌ తెలిపారు.

రాష్ట్రంలో మద్యం, కల్లు విక్రయాలు అప్పుడప్పుడూ నిలిపేస్తారు. కానీ వరుసగా ఇన్నాళ్ల పాటు అందుబాటులో లేకపోవడం ఇదే తొలిసారి. దీంతో వ్యసనాపరులు నానా అగచాట్లు పడుతున్నారు. లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చిన తర్వాత ఒకట్రెండు రోజులు అందుబాటులో ఉన్న మద్యం, కల్లును అధిక ధరలకు కొనుగోలు చేసి తాగారు. కానీ ఆ తర్వాత పూర్తిగా అం దుబాటులో లేకపోవడంతో 5–7 రోజుల్లో బయటపడే లక్షణాలు వారిని బాధపెడుతున్నాయి. దీంతో ఒక్క సోమవారమే ఎర్రగడ్డలోని మానసిక వైద్యశాలకు వంద మంది వరకు బాధితులు వచ్చారు.

ముఖ్యంగా కల్లులో కలిపే క్లోరల్‌ హైడ్రేట్, చాక్లెట్‌ పౌడర్, యూరియా, అల్ప్రాజోలమ్, డైజోఫామ్‌లాంటివి వ్యసనపరుల నాడీ వ్యవస్థను పూర్తిగా దెబ్బతీస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఆల్కహాల్‌కు దీర్ఘకాలికంగా అలవాటుపడిన వారి మెదడులోని నాడీ కణాలు కూడా మత్తుకు అలవాటు పడి ఉంటాయని, సమయానికి ఆల్కహాల్‌ తీసుకోకపోతే అవి తీవ్రంగా స్పందిస్తాయని అంటున్నారు. వీటి ప్రభావంతోనే ఇప్పుడు మందు, కల్లుబాబులు చిందులు వేస్తున్నారని, మతి కోల్పోయి పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నారని చెబుతున్నారు.

రాష్ట్రంలోని మందుబాబుల విచిత్ర విన్యాసాలపై ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ సమీక్ష నిర్వహించారు. వ్యసనానికి బానిస లై పిచ్చిగా ప్రవర్తిస్తున్న వారికి పీహెచ్‌సీల్లో చికిత్స చేయించాలని ఎక్సైజ్‌ అధికారులకు ఆదేశించారు. ఇటువంటి వారంతా యోగ, ధ్యానం, ఆటలు లాంటి వాటి ద్వారా ఉపశమనం పొందాలని సూచించారు.

రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాలో వేర్వేరు ఘటనల్లో కల్లు లేక నలుగురు మృతిచెందారు. వికారాబా ద్‌ జిల్లా బూర్గుపల్లి నివాసి చాకలి రాచ య్య(45) ఆదివారం అర్ధరాత్రి బావి లో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎక్‌మామిడికి చెందిన గొర్రె వెంకటమ్మ (50) రెండు రోజుల క్రితం కల్లు లేక సొమ్మసిల్లి పడిపోయింది. తలకు గాయాలై ఆదివారం రాత్రి మృతిచెందింది. మరో ఘటనలో కర్ణాటకకు చెం దిన మహ్మద్‌ అలీ(50).. నగరం నుంచి స్వస్థలానికి వెళ్తూ.. పరిగి మండలం లక్ష్మిదేవిపల్లిలో మృతిచెందాడు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం కొడిచెర్లకిS చెందిన చింతకింది లక్ష్మయ్య(39) కొన్ని రోజులుగా కల్లు దొరకకపోవడంతో పిచ్చిగా ప్రవర్తించాడు. సోమవారం విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ను పట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

అందుకే ప్రభుత్వాలు తక్షణం ఈ సమస్యను పరిష్కరించకపోతే దేశంలో మద్యపాన ప్రియుల మరణాలు పెరిగే ప్రమాదం తప్పదు

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

   10 hours ago


లొంగిపోయిన కూన రవికుమార్

లొంగిపోయిన కూన రవికుమార్

   6 hours ago


రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

   9 hours ago


షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

   11 hours ago


తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

   13 hours ago


ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

   15 hours ago


బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

   16 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

   18 hours ago


భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

   18 hours ago


ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

   19 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle