newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మద్యంపై ఆదాయం 'రైతుకి బంధు'వు అయిందా?

27-12-201927-12-2019 12:25:27 IST
2019-12-27T06:55:27.010Z27-12-2019 2019-12-27T06:49:37.266Z - - 12-04-2021

మద్యంపై ఆదాయం 'రైతుకి బంధు'వు అయిందా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇప్పుడు దేశం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. నటుడు నూతన ప్రసాద్ ఓ పాత సినిమాలో చెప్పిన డైలాగ్ ఇది. కానీ కారణాలేమైనా ఇప్పుడు మన రెండు తెలుగు రాష్ట్రాలు అంతకుమించిన క్లిష్ట పరిస్థితిలో ఉన్నాయి. రెండు రాష్ట్రాలలో ప్రభుత్వాలలో ఉన్న పార్టీలు తలకు మించిన హామీలతో ఎన్నికలకు వెళ్లి ఆ హామీలను తీర్చడానికి కిందా మీద పడాల్సిన పరిస్థితి తలెత్తింది. ఏపీలో సవాలక్ష సమస్యలున్నా తెలంగాణకు మాత్రం ఆర్ధిక సమస్య ఒక్కటే భారంగా కనిపిస్తుంది.

రాష్ట్రం విడిపోయేప్పుడు ధనిక రాష్ట్రమే అయిన తెలంగాణ ప్రస్తుతం ఆర్ధిక సమస్యలలో తీవ్ర కష్టాలను ఎదుర్కొంటుంది. తెరాస ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆర్ధిక సమస్యలు పూర్తిగా బయటపడ్డాయి. ప్రభుత్వ పెద్దలు.. ముఖ్యమంత్రే స్వయంగా ఆర్ధిక సమస్యలను ఒప్పేసుకోవడంతో పాటు ప్రభుత్వం నిర్వహించాల్సిన కొన్ని కార్యక్రమాలను కూడా వాయిదా వేసుకుంటున్న ఘటనలు చూసాం.

ఇక హామీలు, ప్రభుత్వం తెచ్చిన పథకాల విషయానికి వస్తే తెరాస రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు దోహదపడిన వాటిలో రైతు బంధు పథకం కూడా ఒకటి. దేశంలో మరెక్కడా లేని ఈ పథకం అమలు మాటలు కాదు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఎకరాకు ఎలాంటి షరతులు లేకుండా ఏడాదికి పదివేల రూపాయలు చెల్లించాల్సివుంటుంది. ఇది ప్రభుత్వానికి తలకు మించిన భారంగానే చెప్పుకోవాలి.

కాళేశ్వరం లాంటి భారీ ప్రోజెక్టులతో పాటు రైతు బంధు పథకానికి నిధుల కొరత ఏర్పడింది. రైతుబంధులో దఫాకు సుమారుగా 7 వేలకోట్లు చెల్లించాల్సి ఉంటుంది. అంటే రెండు దఫాలకు కలిపి సుమారు ఏడాదికి 14 వేల కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇంత భారీ నిధులు లేక ప్రభుత్వం ఎకరాల వారీగా విభజించి మూడెకరాల లోపు ఒకసారి ఐదెకరాల లోపు ఒకేసారి అంతకు మించి ఉంటే మరోసారి చెల్లింపులు చేస్తుంది.

కానీ, మూడెకరాల లోపు రైతులకు కూడా ఇంకా పూర్తి చెల్లింపులు కాలేదు. అయితే మరో వారం లేదా రెండు వారాలలో రైతు బంధు చెల్లింపులు పూర్తిచేయాలని సీఎం కెసిఆర్ ఆదేశించారట. మరి నిధులు ఎలా అంటారా? నూతన మద్యం పాలసీ అనంతరం రాష్ట్రంలో మద్యం ధరలను భారీగా పెంచిన సంగతి తెలిసిందే. ఈ నూతన ధరల వలన నెలకు నాలుగు వందల కోట్లకు పైగా ఆదాయం పెరిగిందట.

మద్యం ధరలను పెంచడం వలన వచ్చిన ఆదాయాన్ని పూర్తిగా రైతుబంధుకి మళ్లించాలని సీఎం ఆదేశించినట్లుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఎకరాల వారీగా ఏ నెలకు ఆ నెల రైతుబంధు చెల్లింపులు పూర్తిచేయాలని సీఎం చెప్పేశారట. అంటే ఇకపై రాష్ట్రంలో ప్రజలు మద్యం ఎంత ఎక్కువ తాగితే రైతులకు అంత మంచిదన్నమాట. అందుకే మద్యం ధరలు రైతుకి బంధువుగా మారాయన్నది!

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle