newssting
BITING NEWS :
*అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పర్యటన.. ఘనంగా స్వాగతం..సబర్మతి ఆశ్రమంలో మహాత్మాగాంధీ వినియోగించిన చరఖా తిప్పిన ట్రంప్ పంపతులు *సబర్మతి ఆశ్రమంలో ట్రంప్ దంపతులు... గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ట్రంప్, మోడీ *నేడు విజయనగరం జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన.. జగనన్న వసతి దీవేన కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం*సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు బాంబు బెదిరింపు.. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల తనిఖీలు.. ప్లాట్ ఫామ్‌లతో పాటు రైళ్లలోనూ క్షుణ్ణంగా తనిఖీ, పేలుడు పదార్థాలు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు *చిత్తూరు జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల కలకలం..శ్రీ చౌడేశ్వరి ఆలయం వెనకాల ప్రాంతంలో తవ్వకాలు *ఆదిలాబాద్‌ గుడిహత్నూర్‌లో దారుణం....బాలికపై ఇద్దరు కామాంధుల అత్యాచారం* చైనాలో కొనసాగుతున్న కరోనా మరణమృదంగం....ఇప్పటివరకు 2వేల 460కి చేరిన కొవిడ్-19 మృతుల సంఖ్య*ఒడిశా : పూరీ జిల్లా పిప్పిలి ప్రాంతంలో ఏనుగుల బీభత్సం...ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి.., ఐదుగురికి గాయాలు *గుజరాత్‌లోని వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం..ట్రక్కు- టెంపో ఢీ, 11మంది మృతి *68వ రోజు కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళన

మందుబాబులకు మెట్రో ఆఫర్.. మందుతాగినా ఎంట్రీ

30-12-201930-12-2019 17:11:16 IST
Updated On 31-12-2019 10:13:32 ISTUpdated On 31-12-20192019-12-30T11:41:16.251Z30-12-2019 2019-12-30T11:41:09.463Z - 2019-12-31T04:43:32.528Z - 31-12-2019

మందుబాబులకు మెట్రో ఆఫర్.. మందుతాగినా ఎంట్రీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
డిసెంబర్ 31 సందర్బంగా హైదరాబాద్ మెట్రో బంపర్ ఆఫర్ ప్రకటించింది. అర్థరాత్రి వరకూ మెట్రో సర్వీసులు నడుస్తాయని మెట్రో పేర్కొంది. మందు సేవించినా మెట్రోలో ప్రయాణించే అవకాశం కల్పించింది. అయితే, కొన్ని షరతులు మాత్రం విధించింది. మందు తాగి ప్రయాణం చేసే ప్రయాణికులు ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలిగించకూడదు.

గతంలో మందుతాగితే మెట్రో ప్రయాణించే అవకాశం ఉండేది కాదు. డిసెంబర్ 31 సందర్భంగా మందుబాబులు సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరేందుకు ఈ అవకాశం కల్పించింది. మందుబాబులకు ఇచ్చిన అవకాశం దుర్వినియోగం చేయకూడదని మెట్రో పేర్కొంది. నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని అర్ధరాత్రి ఒంటి గంట వరకూ రైళ్లను నడపనున్నట్లు హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మెట్రో ప్రత్యేక సర్వీసులు అన్ని స్టేషన్లలోనూ అందుబాటులో ఉంటాయి.

మెట్రో రైలు హైదరాబాద్ వాసులకు ఎంతో ఊరటనిస్తుందనే చెప్పాలి. ప్రధాన రూట్లలో మెట్రో అందుబాటులోకి రావడంతో ఏసీలో ప్రయాణించే అవకాశం కలిగింది. తాజాగా వారం క్రితం ప్రవేశపెట్టిన క్యూఆర్ కోడ్ ద్వారా టికెట్లు తీసుకునే సౌలభ్యం ఉండడంతో లైనులో నిలబడాల్సిన అవసరం లేకుండా పోయింది. మొబైల్ యాప్ ద్వారా టికెట్ బుక్ చేసిన తరువాత క్యూఆర్ కోడ్‌తో ప్రయాణం చేసే అవకాశం కలిగింది. ఈ క్యూఆర్ కోడ్ టికెట్ కార్యక్రమం పట్ల ప్రయాణికులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఫుల్లుగా మద్యం తాగి తమ స్వంత వాహనాలు నడుపుకుంటూ వెళ్లి డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడేవారికి ఇది మంచి ఆఫర్ అనే చెప్పాలి. ఇటు ఎంఎంటీఎస్ రైళ్ళు కూడా అర్థరాత్రి ఒంటిగంట వరకూ నడుస్తాయి. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle