newssting
BITING NEWS :
*కరోనా కట్టడిలో అన్ని వర్గాల కృషిని ప్రశంసించిన ప్రధాని మోడీ. మన్ కీ బాత్ లో పలు అంశాలను ప్రస్తావించిన మోడీ ఆత్మనిర్భర భారత్ ద్వారా ఆర్థికవ్యవస్థకు ఊతం *తెలంగాణలో పెరుగుతున్న కేసులు.. కొత్తగా 74, మరణాలు 77, మొత్తం కేసులు 2499 * జూన్ 30 వరకూ ఐదవ విడత లాక్ డౌన్.. పలు సడలింపులు *దేశ వ్యాప్తంగా జూన్ 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు..కొత్త మార్గదర్శకాలు రిలీజ్ చేసిన కేంద్రం..ఈ సారి లాక్ డౌన్ లో మరిన్ని సడలింపులు..కేవలం కంటైన్మెంట్ జోన్లకే లాక్ డౌన్ పరిమితం*మాల్స్, రెస్టారెంట్లు జూన్ 8 వ తేదీ నుంచి పునఃప్రారంభం..కర్ఫ్యూ సమయం కుదింపు..దేశ వ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ*ఆదివారం మన్ కీ బాత్ లో పలు వివరాలు వెల్లడించనున్న ప్రధాని మోడీ * మాల్స్, రెస్టారెంట్ల, దేవాలయాలు, చర్చిలు జూన్ 8 నుంచి ప్రారంభం *పాఠశాలలు, కాలేజీలు, విద్యాసంస్థలు ప్రారంభంపై రాష్ట్రాలకు నిర్ణయాధికారం *విద్యాసంస్థల ప్రారంభంపై జూలైలో నిర్ణయం*నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామక ఉత్తర్వులు వెనక్కి *ఏపీలో మొత్తం కేసులు 3461

మందుబాబులకు చుక్కలు చూపిస్తున్న లాక్ డౌన్.. ఇకనైనా మానతారా?

26-03-202026-03-2020 16:46:54 IST
Updated On 26-03-2020 16:55:36 ISTUpdated On 26-03-20202020-03-26T11:16:54.818Z26-03-2020 2020-03-26T11:16:51.166Z - 2020-03-26T11:25:36.693Z - 26-03-2020

మందుబాబులకు చుక్కలు చూపిస్తున్న లాక్ డౌన్.. ఇకనైనా మానతారా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ రాష్ట్ర చరిత్రలో తొలిసారి మద్యం అమ్మకాలు 48 గంటల కన్నా ఎక్కువ సమయం నిలిచిపోయాయి. 1995–97లో మద్యనిషేధం అమల్లో ఉన్నప్పుడు మినహా రాష్ట్రంలో ఎప్పుడూ ఇన్ని రోజులు లిక్కర్‌ అమ్మకాలు జరగ కుండా ఉన్న సందర్భాల్లేవని ఎక్సైజ్‌ అధికారులు చెబుతున్నారు. ఎన్నికల సందర్భాల్లో పోలింగ్‌కు 48 గంటల ముందు వైన్ షాపులు, బార్లు బందయ్యేవి. కానీ, ఇప్పుడు ఆరోగ్య అత్యయిక పరిస్థితుల నేపథ్యంలో గత 8 రోజులుగా బార్లు, మూడు రోజులుగా మద్యం దుకాణాలు మూతపడ్డాయి. దీంతో రాష్ట్రంలోని మందుబాబులకు కరోనా ‘చుక్కలు’కనిపిస్తున్నాయి. 

అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మద్య నిషేధం అమల్లో ఉన్నప్పుడు కల్లు, అనధికారికంగా గుడుంబా అందుబాటులో ఉండేవి. సరిహద్దు రాష్ట్రాల్లో నిషేధం లేకపోవడంతో గుట్టుచప్పుడు కాకుండా రాష్ట్రానికి అరకొరగా మద్యం వచ్చేది. ఇప్పుడు అలాంటి వెసులుబాట్లు కూడా లేకుండాపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా గుడుంబాను దాదాపు నిర్మూలించగా, కల్లు దుకాణాలు కూడా కరోనా దెబ్బకు మూతపడ్డాయి. గ్రామాల్లో చెట్ల నుంచి తీసిన కల్లు మాత్రమే లభిస్తోంది. 

రాష్ట్ర సరిహద్దులను మూసివేయడంతో పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం వచ్చే అవకాశం లేకుండా పోయింది. పొరుగు రాష్ట్రాలు కూడా లాక్‌డౌన్  విధించడంతో అక్కడ కూడా మద్యం లభించడం లేదు. దీంతో రాష్ట్రంలో త్వరలోనే పూర్తిస్థాయిలో మద్యం కొరత ఏర్పడనుందని ఎక్సైజ్‌ వర్గాలంటున్నాయి. కరోనా దెబ్బకు ఇప్పట్లో లాక్‌డౌన్ ఎత్తేసే అవకాశం లేదని, కనీసం మరో నెలైనా ఇదే పరిస్థితి ఉంటుందని తెలుస్తోంది. 

బార్లు, వైన్ షాపులు మూతపడటంతో బ్లాక్‌ మార్కెట్‌లో మద్యం అమ్మకాలు అక్కడక్కడా జరుగుతున్నాయి. బ్లాక్‌లో కొని తాగాలనుకునే మందుబాబులకు వాటి ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. సాధారణ బ్రాండ్‌ మద్యం కూడా క్వార్టర్‌కు రూ.350 వరకు అమ్ముతున్నారు. ప్రీమియం బ్రాండ్ల మద్యమైతే ఇష్టారాజ్యంగా అమ్ముతున్నారు. 

అంత ధర పెట్టి తాగేకన్నా మందు మానడమే ఉత్తమమని కొందరు సర్దుకుంటుండగా, మరికొందరు బేరాలాడి కొనుక్కొంటున్నారు. మద్యానికి బానిసలైన వారు మాత్రం ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నారు. 

అయితే, ఈ పరిస్థితి కొంత మేలు చేస్తుందని, అనధికార మద్యనిషేధం వ్యసనపరులకు ఉపయోగపడుతుందని ఎక్సైజ్‌ అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితులను వ్యసనపరులు సద్వినియోగం చేసుకుని మద్యానికి దూరంగా ఉండటం అలవాటు చేసుకోవాలని, లేదంటే మద్యం నుంచి పూర్తిగా విముక్తి పొందేందుకు సువర్ణావకాశమని అంటున్నారు. 

ఏదేమైనా తాగి అందరికీ చుక్కలు చూపించే మందుబాబులకు ‘కరోనా’నిజంగానే చుక్కలు చూపిస్తోంది.

మందుబాబుల సమస్య ఒక్క తెలంగాణకు మాత్రమే పరిమితం కాలేదు. ఆస్ట్రేలియాలో గత సోమవారం నుంచి దేశవ్యాప్తంగా ఆల్కహాల్ స్టోర్లను మూసివేస్తామని అక్కడి ప్రభుత్వం కరోనా నేపథ్యంలో ప్రకటించడంతో, భీతావహులైన మందురాయుళ్లు లిక్కర్ షాపులకు పరుగుతీసి కేసుల మీద కేసుల కొద్దీ మందును కొనపడేశారని అంతర్జాతీయ మీడియా సమాచారం. అత్యవసరం కాని సర్వీసులన్నీ వచ్చే 48 గంటల్లోపు మూసివేస్తామని గత శుక్రవారం ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటించిందే తడవుగా ఆ దేశ మందుబాబులు పొలోమంటూ మద్యం షాపులుమీద పడ్డారు. 

ఆస్ట్రేలియా వాతావరణ పరిస్థితుల రీత్యా లిక్కర్ షాపులు అత్యవసర సర్వీసుల కిందికి  ప్రభుత్వం తీసుకొచ్చినప్పటికీ ప్రభుత్వ ప్రకటన వినగానే ఆందోళనలో మునిగితేలిన మందుబాబులు లిక్కరు షాపులపై దాడి చేసి బాటిల్స్ ని ఖాళీ చేసారు.

ఒకవిధంగా చూస్తే ఆస్ట్రేలియానే నయం. అత్యవసర సర్వీసులు కానివాటిని రెండురోజుల్లో మూసేస్తామని ఆ ప్రభుత్వం గడువు పెట్టింది. కానీ మనకు మాత్రం అటు కేంద్రం కానీ, ఇటు రాష్ట్రాలు కానీ జనం సంచారాన్ని పూర్తిగా మానుకోవడంపై కనీస సమయం గడువు ఇవ్వకుండా కొరడా ఝళిపించడంతో జనం లాక్ డౌన్ లక్ష్యాన్నే వదిలిపెట్టి రెండురోజులకే తిరగబడుతున్నారు. హైదరాబాద్ లోని ఆంద్రవిద్యార్థులు మొదట ఆంక్షల్ని ఉల్లంఘించగా, సరిగ్గా బుధవారం రోజునే ఆంధ్రప్రదేశ్‌లో పోలీసులపై జనం దాడి చేసి చితకబాదడం గమనార్హం. 

ఈ నేపథ్యంలో నిత్యావసర సరకుల కొరత ఏర్పడితే మరో వారంరోజుల్లో జనం పరిస్థితి ఎలా మారుతుందన్నది అంతుబట్టడంలేదు. ఇంటింటికీ వెళ్లి జనాలకు కావలసినవి ఇంటివద్దే అందించేందుకు మనదేశం ఏమైనా చైనానా? ప్రజలకు సౌకర్యాలను కట్ చేసిపడేయటమే ఆంక్షలు, కర్ప్యూలు అని నిర్దేశించుకున్న వ్యవస్థలో ప్రజల సమస్యలు ఏ గంగలో కలిస్తే మాత్రం ప్రభుత్వాలకు పట్టింపు ఎందుకు ఉంటుంది?

తెలంగాణలో కంటైన్మెంట్ జోన్లలోనే లాక్‌డౌన్ ... అక్కడ షరతులు వర్తిస్తాయ్!

తెలంగాణలో కంటైన్మెంట్ జోన్లలోనే లాక్‌డౌన్ ... అక్కడ షరతులు వర్తిస్తాయ్!

   3 hours ago


తెలంగాణలో కరోనా విజృంభణ.. ఒకేరోజు 6 గురు మృతి!

తెలంగాణలో కరోనా విజృంభణ.. ఒకేరోజు 6 గురు మృతి!

   8 hours ago


భక్తులకు శుభవార్త.. జూన్ 8 నుంచి తిరుమలలో దర్శనాలు

భక్తులకు శుభవార్త.. జూన్ 8 నుంచి తిరుమలలో దర్శనాలు

   11 hours ago


మోడీ మన్ కీ బాత్.. కరోనాపై యుద్ధానికి కొత్త దారులు వెతుకుదాం

మోడీ మన్ కీ బాత్.. కరోనాపై యుద్ధానికి కొత్త దారులు వెతుకుదాం

   11 hours ago


నిమ్మగడ్డ  ఎపిసోడ్‌లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు

నిమ్మగడ్డ ఎపిసోడ్‌లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు

   12 hours ago


మోడీ సరే.. మరి తెలంగాణ సీఎం వైఖరేంటో?

మోడీ సరే.. మరి తెలంగాణ సీఎం వైఖరేంటో?

   14 hours ago


యడ్డీ మెడపై రెబెల్స్ కత్తి.. వణుకుతున్న బీజేపీ

యడ్డీ మెడపై రెబెల్స్ కత్తి.. వణుకుతున్న బీజేపీ

   14 hours ago


‘‘ఓ తల్లి ఉసురు మీకు తగలక మానదు’’

‘‘ఓ తల్లి ఉసురు మీకు తగలక మానదు’’

   14 hours ago


తండ్రిని మించిన ఫైర్‌బ్రాండ్‌.. తెర‌పైకి జ‌యారెడ్డి

తండ్రిని మించిన ఫైర్‌బ్రాండ్‌.. తెర‌పైకి జ‌యారెడ్డి

   15 hours ago


డాక్టర్ సుధాకర్ కేసులో సీబీఐ ఏం తేల్చబోతోంది?

డాక్టర్ సుధాకర్ కేసులో సీబీఐ ఏం తేల్చబోతోంది?

   30-05-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle